తొలి టెస్టు బరిలో అశ్విన్!
పూర్తి ఫిట్నెస్కు చేరువలో స్పిన్నర్
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో గాయపడిన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కోలుకున్నాడు. పూర్తి ఫిట్నెస్కు చేరువలో ఉన్న అతను వచ్చే నెల 5న మొహాలీలో ప్రారంభం కానున్న తొలి టెస్టులో బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ‘ప్రస్తుతానికి నేను బాగానే ఉన్నా. ఇంకాస్త ఫిట్నెస్ సాధించాలి. త్వరలోనే దాన్ని సాధిస్తా. టెస్టు సిరీస్లో రాణిస్తాననే నమ్మకం ఉంది’ అని అశ్విన్ పేర్కొన్నాడు. టెస్టు సిరీస్లో ఏదైనా జరగొచ్చని చెప్పిన స్పిన్నర్ ఏకపక్షంగా సాగే అవకాశాల్లేవని స్పష్టం చేశాడు.
‘టెస్టుల్లో హోరాహోరీ ఖాయం. దక్షిణాఫ్రికా పటిష్టమైన జట్టు. ఇక్కడి పరిస్థితులకు బాగా అలవాటు పడ్డారు. కాబట్టి వాళ్లను అందుకోవడం మాకు కూడా ఓ సవాలే’ అని అన్నాడు.