శంషాబాద్‌లో స్పైస్ జెట్ విమానం అత్యవసర ల్యాండింగ్
హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ బయలుదేరిన స్పైస్‌జెట్ విమానం టెకాఫ్ అయిన కొన్ని నిముషాల్లోనే అకస్మాత్తుగా సాంకేతిక లోపం ఏర్పడింది. ఈ నేపథ్యంలో విమానంలో తలెత్తిన సాంకేతిక లోపాన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులను పైలేట్ వివరించాడు. విమానాన్ని అత్యవసర ల్యాండింగ్‌కు ఎయిర్పోర్ట్ అధికారులు వెంటనే అనుమతి ఇవ్వలేదు. దాంతో ఆ విమానం ఐదు నిముషాల పాటు గాలిలో చక్కర్లు కొట్టింది.
ఎయిర్ పోర్ట్ అధికారులు అనుమతి ఇవ్వడంతో స్పైస్ జెట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. దాంతో ఆ విమానంలో 130 మంది ప్రయాణీకులను వేరే విమానంలో న్యూఢిల్లీ పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే నిన్న ఉదయం కూడా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ వెళ్లవలసిన స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దాంతో దాదాపు 45 నిముషాల పాటు గాలిలో చక్కర్లు కొట్టి అత్యవసరంగా ల్యాండింగ్ అయిన సంగతి తెలిసిందే.