breaking news
Speedometers
-
స్పీడ్ లిమిట్ దాటితే అలర్ట్.. కొత్త ఫీచర్
సాంకేతిక దిగ్గజం గూగుల్ తన యూజర్ల డ్రైవింగ్ అనుభవాన్ని మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మార్చేందుకు సరికొత్త అప్డేట్లను పరిచయం చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ‘ఆండ్రాయిడ్ ఆటో’ వేదికగా గూగుల్ మ్యాప్స్‌లో ‘లైవ్ స్పీడోమీటర్’ ఫీచర్‌ను తీసుకొచ్చారు. ప్రస్తుతం బీటా వెర్షన్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్‌ను త్వరలోనే అందరికీ యాక్సెస్ ఇవ్వనున్నారు.ప్రయాణ వేగంపై స్పష్టమైన నిఘాసాధారణంగా మొబైల్ స్క్రీన్లపై గూగుల్ మ్యాప్స్ వాడుతున్నప్పుడు వాహనం వెళ్లే వేగాన్ని చూపే సదుపాయం ఇప్పటికే ఉంది. అయితే, కారు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ను ఆండ్రాయిడ్ ఆటోకు అనుసంధానించినప్పుడు ఈ లైవ్ స్పీడ్ డిస్ప్లే కనిపించేది కాదు. తాజా అప్డేట్తో కారు డ్యాష్‌బోర్డ్ స్క్రీన్‌పైనే నావిగేషన్‌తో పాటు వాహనం ఎంత వేగంతో దూసుకెళ్తుందో స్పష్టంగా గమనించవచ్చు. ఇది వాహనదారులు రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు ఆయా ప్రాంతాల్లోని స్పీడ్ లిమిట్స్‌ను దాటకుండా అలర్ట్ అవ్వడానికి సహాయపడుతుంది.ఈ ఫీచర్‌ను ఎలా ఎనేబుల్ చేసుకోవాలి?1. మొదట మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో Google Maps యాప్‌ను ఓపెన్ చేయాలి.2. స్క్రీన్ పైభాగంలో కుడి వైపున ఉండే Profile Iconపై క్లిక్ చేసి Settingsలోకి వెళ్లాలి.3. సెట్టింగ్స్ మెనూలో Navigation Settings ఆప్షన్‌ను ఎంచుకోవాలి.4. కిందకు స్క్రోల్ చేసి Driving Options విభాగంలోకి వెళ్తే అక్కడ Speedometer అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని On (ఎనేబుల్) చేసుకోవాలి.ఈ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత మీ ఫోన్‌ను ఆండ్రాయిడ్ ఆటో ద్వారా కారుకు కనెక్ట్ చేసినప్పుడు గూగుల్ మ్యాప్స్ నావిగేషన్ స్క్రీన్‌పై ఎడమ వైపు కింద భాగంలో వాహనం ప్రస్తుత వేగం స్పష్టంగా కనిపిస్తుంది.భద్రతతో కూడిన స్మార్ట్ డ్రైవింగ్ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ ఆటో 12.4 లేదా అంతకంటే తాజా బీటా వెర్షన్ వాడుతున్న వినియోగదారులకు అందుబాటులో ఉంది. వేగ పరిమితులను సూచించే Speed Limits ఫీచర్‌తో పాటు ఈ స్పీడోమీటర్ కూడా జతకూడటంతో మితిమీరిన వేగం వల్ల జరిగే ప్రమాదాలను నివారించవచ్చని, అలాగే ట్రాఫిక్ చలాన్ల బారిన పడకుండా ఉండొచ్చని ఆటోమొబైల్ రంగానికి చెందిన నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ఫీచర్ త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాధారణ వినియోగదారులందరికీ స్థిరమైన అప్డేట్ రూపంలో అందుబాటులోకి రానుంది.ఇదీ చదవండి: హోమ్ లోన్ కడుతూ అద్దె ఇంట్లో ఉంటున్నారా? -
మన మెదడులోనూ.. స్పీడోమీటర్!
కార్లు, బైకుల వేగాన్ని చెప్పేందుకు స్పీడోమీటర్లు ఉన్నాయి. మరి మనుషుల వేగం సంగతో? మనకు కూడా మెదడులో ఓ స్పీడోమీటర్ ఉంటుందట! అవును. మనం నడుస్తున్నప్పుడు నెమ్మదిగా పరిసరాలను గమనిస్తూ వెళుతుంటాం. అదే పరుగెత్తితే? మరింత వేగంగా పరిసరాలను గమనిస్తూ దూసుకెళుతుంటాం. ఇంత కచ్చితంగా నడవటం, పరుగెత్తటం ఎలా సాధ్యం? అంటే.. అది మన మెదడులోని స్పీడోమీటర్ నేర్పరితనమేనని జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ బోన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు! భూమిపై దిక్కుల్ని తెలియజేసే దిక్సూచీ మాదిరిగా పరిసరాల్లో మన శరీర స్థానాన్ని తెలియజేసే దిక్సూచీ వ్యవస్థ కూడా మన మెదడులో ఉంటుందని శాస్త్రవేత్తలు ఇదివరకే కనుగొన్న విషయం తెలిసిందే. అయితే, ఎలుకల గమనంపై పరిశోధన చేపట్టిన జర్మనీ శాస్త్రవేత్తలు.. ఎలుకల్లో గమనానికి తోడ్పడుతూ, వేగాన్ని అంచనా వేసే నాడీకణాలు ఉన్నట్లు కనుగొన్నారు. మెదడు పనితీరు పరంగా మనిషికి, ఎలుకలకు చాలా సారూప్యం ఉంది కాబట్టి.. మనిషిలోనూ ఇలాంటి నాడీకణాలే ఉంటాయని పరిశోధన బృందం సారథి స్టెఫాన్ రెమీ వెల్లడించారు. మనిషిలోని స్పీడోమీటర్‌ను అర్థం చేసుకుంటే పార్కిన్సన్స్ వ్యాధి వల్ల మనిషి కదలికలపై పడే ప్రభావాన్ని నివారించవచ్చనీ భావిస్తున్నారు. మెదడు స్పీడోమీటర్ ఇలా... మెదడులో జ్ఞాపకశక్తిని నియంత్రించే హిప్పోక్యాంపస్ భాగం.. పరిసరాలను గుర్తుపెట్టుకుంటూ, అంచనా వేస్తూ, గమనాన్ని నియంత్రిస్తుంది. మనం వేగం పెంచితే హిప్పోక్యాంపస్ కూడా వేగంగా స్పందిస్తుంది. కానీ వేగం పెంచినట్లు, తగ్గించినట్లు మెదడుకు ఎలా తెలుస్తోంది? మనం ఎంత వేగంతో వెళుతున్నామన్నది ఎలా గ్రహిస్తోంది? అన్నది మాత్రం ఇంతకాలం అంతుచిక్కలేదు. కానీ పరిసరాల అంచనా, గమన వేగాలకు మధ్య అనుసంధానమై పనిచేసే నాడీకణాలను ఎలుకల్లో కనుగొనడంతో ఈ చిక్కుముడి వీడినట్లయింది. ఎలుకల మెదడులో హిప్పోక్యాంపస్ భాగానికి అనుసంధానమై ఉండే ‘మిడియల్ సెప్టమ్’ అనే భాగంలోని కొన్నివేల నాడీకణాలే వేగాన్ని కచ్చితంగా అంచనా వేసి హిప్పోక్యాంపస్‌కు సమాచారం అందిస్తున్నాయని స్టెఫానీ బృందం గుర్తించింది. మిడియల్ సెప్టమ్ భాగంలోని నాడీకణాలు జ్ఞానేంద్రియాలు, కండరాల నుంచి గమనం, వేగాలకు సంబంధించిన సమాచారాన్ని గ్రహించి వేగాన్ని అంచనా వేస్తున్నాయని వీరు కనుగొన్నారు.


