breaking news
special stals
-
26న తపాలాశాఖ మహా మేళా
- కర్నూలులో కార్యక్రమం - పోస్టల్ సూపరింటెండెంట్ కేవీ సుబ్బారావు కర్నూలు(ఓల్డ్‌సిటీ): ఈనెల 26వ తేదీన కర్నూలులో తపాలా శాఖ మహామేళాను ఏర్పాటు చేస్తున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరూ కృషి చేయాలన్నారు. ఇందుకు సంబంధించి ఆయన మంగళవారం తన ఛాంబరులో ఏఎస్పీలు, ఇన్స్పెక్టర్లతో సమావేశమయ్యారు. పీఎల్ఐ, ఆర్పీఎల్ఐ, సుకన్య సమృద్ధి యోజన, మైస్టాంప్స్ వంటి పథకాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేసి ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. మహామేళాలో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి అన్ని పథకాల గురించి ప్రజలకు వివరిస్తామన్నారు. మహామేళా వేదికగా సంబంధిత అధికారులు మార్కెటింగ్‌లో ప్రగతి సాధించాలని సూచించారు. మహామేళాను నగరంలోని ఏ ప్రదేశంలో ఏర్పాటు చేయాలనేది ఇంకా నిర్ణయించలేదని చెప్పిన కేవీ సుబ్బారావు త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీలు సి.హెచ్.శ్రీనివాస్, నాగానాయక్, ఇన్స్పెక్టర్లు నూరుల్లా, శ్రీనివాసరాజు, ఫజులుర్రహ్మాన్, విజయమోహన్, జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
'మన ఊరు-మన కూరగాయలు' స్టాళ్లు ప్రారంభం
హైదరాబాద్: వినియోగదారులకు తక్కువ ధరకు కూరగాయలు అందించటం కోసం ' మన ఊరు-మన కూరగాయలు' పేరుతో స్టాళ్లను ఏర్పాటు చేశారు. నగరంలోని మెహదీపట్నం రైతు బజార్ లో బుధవారం తెలంగాణ మంత్రులు హరీష్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి వాటిని ప్రారంభింబారు. ఈ స్టాళ్ల ద్వారా నాణ్యమైన కూరగాయలను తక్కువ ధరకే పొందవచ్చని వారు తెలిపారు. అనంతరం గుడిమల్కాపూర్ పూల మార్కెట్ ను మంత్రులు సందర్శించారు.