breaking news
special queue
-
యాదాద్రిలో రూ.150 టికెట్‌కు ప్రత్యేక క్యూలైన్లు
యాదగిరిగుట్ట: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల్లో అధికంగా రూ.150 ప్రత్యేక టికెట్ దర్శనం ద్వారా వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ప్రత్యేక దర్శనం టికెట్‌పై వెళ్లే భక్తులు అష్టభుజి ప్రాకార మండపం వద్దకు రాగానే టికెట్లు తీసుకుని వెళ్లాల్సి వస్తోంది. ఇదే సమయంలో ధర్మ దర్శనానికి వెళ్లే భక్తులు, ప్రత్యేక దర్శనానికి వెళ్లే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆలయ అధికారులు సోమవారం క్యూలైన్లు, అష్టభుజి ప్రాకార మండపం వద్ద పరిశీలించారు. ప్రత్యేక దర్శనం భక్తులకు ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. (క్లిక్: నరసింహుడికి బంగారు సింహాసనం) -
క్యూ బాధ నుంచి పలు వర్గాలకు ఊరట
న్యూఢిల్లీ: వయోవృద్ధులకు, దివ్యాంగులకు సోమవారం కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రూ.500, రూ.1000 నోట్ల రద్దు తర్వాత కరెన్సీ మార్పిడి కోసం గంటల కొద్దీ క్యూ లైన్లలో నిల్చొలేక వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ తాజా నిర్ణయంతో వయోవృద్ధులు, దివ్యాంగులు ప్రత్యేక క్యూ ద్వారా బ్యాంకులో నగదు మార్పిడి చేసుకోవచ్చు. దీంతో పాటు పెన్షనర్లు ఏటా ప్రభుత్వానికి ఇచ్చే లైఫ్ సర్టిఫికేట్ గడువును వచ్చే ఏడాది జనవరి 15కు పెంచినట్లు ఆర్ధిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నగదును ప్రజల వద్దకు చేర్చే వివిధ మార్గాలపై సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. నాలుగైదు రోజులుగా బ్యాంకు ఉద్యోగులు నిరంతరాయంగా పనిచేస్తున్నారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. వారందరికి తమ అభినందనలు తెలిపారు. ఏటీఎంలలో నగదు లావాదేవీలను రోజుకు రూ.2,500లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, రూ.2000 నోటును ఇవ్వగల ఏటీఎంలకు మాత్రమే ఇది వర్తిస్తుంది.