breaking news
Special Ministry
-
మధ్యప్రదేశ్‌లో ఆవుల కోసం మంత్రిత్వ శాఖ
ఛత్తర్పూర్: మధ్యప్రదేశ్ కేబినెట్లో త్వరలోనే ఆవుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేయనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ఆదివారం వెల్లడించారు. ‘ప్రస్తుతమున్న గో పాలన, పశుసంవర్ధక బోర్డు చాలా పరిమితుల్లో పనిచేయాల్సి వస్తోంది. అందుకే దీని స్థానంలో గో మంత్రిత్వ శాఖను త్వరలోనే ప్రవేశపెడతాం’ అని ఖజురహోలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన స్పష్టం చేశారు. ఆవుల సంరక్షణ, గోవుకు సంబంధించిన ఇతర అంశాలపై ఈ శాఖ పనిచేస్తుందన్నారు. మధ్యప్రదేశ్‌లోని అగర్ మాల్వా జిల్లాలో.. దేశంలోనే ఆవులకోసం ఉద్దేశించిన తొలి సంరక్షణ కేంద్రాన్ని తమ ప్రభుత్వం ఏర్పాటుచేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని ఇటువంటి కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. -
ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయండి
ప్రధాని మోదీకి ఓబీసీ ఎంపీల ఫోరం విజ్ఞప్తి న్యూఢిల్లీ: ఓబీసీల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ఓబీసీ పార్లమెంటరీ ఫోరం ఆధ్వర్యంలో ఎంపీల ప్రతినిధి బృందం ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసింది. అలాగే జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించాలని విన్నవిం చింది. ఓబీసీ పార్లమెంటరీ ఫోరం కన్వీనర్ వి.హనుమంతరావు నేతృత్వంలో ఎంపీల ప్రతినిధి బృందం బుధవారం పార్లమెంటులో ప్రధానిని కలసి వినతి పత్రాన్ని అందజేశారు. దేశ జనాభాలో 60 శాతానికి పైగా ఉన్న ఓబీసీల్లో 50 శాతం మంది పేదరికంలో ఉన్నారని వారి ఆర్థిక వికాసానికిక, ఓబీసీల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరారు. జాతీయ బీసీ కమిషన్ చట్టంలో సవరణలు తీసుకురావాలని, క్రీమీలేయర్‌ను ఎత్తివేసి ఓబీసీలను వర్గీకరించాలని కోరారు. మోదీని కలిసిన వారిలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీలు నాచి యప్పన్, దేవేందర్ గౌడ్, ఎంపీ బూర నర్స య్య గౌడ్, రాపోలు, కొనకళ్ల నారాయణ, కె.రామ్మోహన్నాయుడు, రాంకృపాల్ యాదవ్, రాంగోపాల్ యాదవ్ తదితరులున్నారు.