జపాన్‌లో భూకంపం.. చిన్నపాటి సునామీ
టోక్యో : జపాన్‌లోని క్యుషు తీర ప్రాంతంలో శనివారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.0గా నమోదు అయిందని మీడియా వెల్లడించింది. చిన్నపాటి సునామీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. జపాన్‌కు నైరుతి ప్రాంతంలోని మకురాజ్కీ, కగోషిమాకు 160 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని కనుగొన్నట్లు జపాన్ వాతావరణ సంస్థ పేర్కొంది.