breaking news
Sony hack
-
ఎలక్ట్రిక్ టూత్ బ్రష్, ఇది ఎలా పనిచేస్తుందంటే
అందానికే అందం చిరునవ్వు. అది ఎల్లప్పుడూ అహ్లాదంగా ఉండాలంటే.. పెదవుల మధ్య తళతళలాడే పలువరుస ఉండాల్సిందే. గార, పిప్పి, పుచ్చు లాంటి పలు సమస్యలతో పాటు నోటి దుర్వాసన కూడా ఆ అందాన్ని కమ్మేస్తుందని బాధపడుతున్నారా? పరిష్కారం కోసం పేస్ట్‌లు, బ్రష్‌లు ఎన్ని మార్చినా.. ఫలితం కనిపించడం లేదని నిట్టూరుస్తున్నారా? అయితే చిత్రంలోని సోనిక్ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ వాడాల్సిందే. ప్రత్యేకమైన ఇంటర్ డెంటల్ హెడ్ కలిగిన ఈ డివైజ్.. సుపీరియర్ సోనిక్ టెక్నాలజీతో పళ్లు, దంతాలను చాలా నీట్‌గా క్లీన్ చేస్తుంది. నిమిషానికి 40 వేల స్ట్రోక్‌లను ఉత్పత్తి చేస్తూ.. సమర్థవంతంగా శుభ్రపరుస్తుంది. ఈ మెషిన్‌తో పాటు ఐదు స్పెషల్ నైలాన్ డ్యుపోంట్ హెడ్స్ లభిస్తాయి. అవి దంతాల ఆకృతికి సరిపోయే విధంగా రూపొందించడంతో.. క్లీనింగ్ చాలా సులభమవుతుంది. వైటెనింగ్, క్లీనింగ్, సెన్సిటివ్, పాలిషింగ్, మసాజ్ అనే ఆప్షన్స్‌తో ఫైవ్ క్లీనింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది. రోజుకు రెండు సార్లు దీన్ని ఉపయోగించడానికి కేవలం రెండు నిమిషాల సమయం చాలు. నాలుగు గంటల పాటు దీనికి చార్జింగ్ పెడితే.. సుమారు 25 రోజుల పాటు పని చేస్తుంది. ఆన్ చేసిన ప్రతి 30 సెకండ్లకు క్లీన్ చెయ్యాల్సిన ప్రదేశాన్ని మార్చమని అలర్ట్ చేస్తుంది. పైగా 2 నిమిషాల తర్వాత ఆపినా ఆపకపోయినా ఆటోమెటిక్‌గా ఆఫ్ అవుతుంది. చివరిగా ఉపయోగించిన మోడ్‌ని గుర్తు చేస్తూ.. తిరిగి ఆన్ చేసినప్పుడు అదే మోడ్‌లో పని చేస్తుంది. ఇది వాటర్ ప్రూఫ్ టూల్ కావడంతో.. వినియోగించే సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. దీని ధర రూ. 15 వందలు. -
జేమ్స్ బాండ్ కథ చోరీ!
జేమ్స్ బాండ్... నేర పరిశోధనలో వీర పనితనం చూపించే ఈ కారెక్టర్ అంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇష్టపడతారు. బాండ్ బరిలోకి దిగాడంటే విలన్లు బాప్రే అని పారిపోవాల్సిందే. బాండ్ చేసే వీరోచిత విన్యాసాలు ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేస్తాయి. అందుకే ఇప్పటివరకు 23 జేమ్స్ బాండ్ చిత్రాలొచ్చినా విసుగు లేకుండా చూశారు. ఇప్పుడు 24వ బాండ్ రానున్నాడు. ఈ చిత్రం ఇటీవలే లండన్‌లో ఆరంభమైంది. ‘స్పెక్ట్రె’ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రణాళిక ప్రకారమే జరుగుతోంది. అయితే... కథ తస్కరణకు గురి కావడం చిత్రబృందాన్ని షాక్‌కు గురి చేసింది. ఈ చిత్రానికి ఓ నిర్మాణ సంస్థ అయిన సోనీ కార్యాలయంలోని కంప్యూటర్లలో ఉన్న ‘స్పెక్ట్రె’ కథను హాకర్స్ దొంగిలించారు. కానీ, చిత్రబృందానికి ఊరటనిచ్చే విషయం ఏంటంటే... ఈ కథకు కాపీ రైట్ రక్షణ ఉందట. ఒకవేళ ఎవరైనా ఈ కథను కాపీ కొట్టడానికి ప్రయత్నించినా, ఇందులోని సన్నివేశాలను పోలిన సన్నివేశాలు తీసినా చట్టరీత్యా నేరమవుతుందని సోనీ సంస్థ ప్రతినిథి పేర్కొన్నారు. కథను తస్కరించినంత మాత్రాన షూటింగ్ ఆగిపోతుందని దొంగలు ఆనందపడతారేమోననీ, షూటింగ్ ఆపే ప్రసక్తే లేదని కూడా తెలిపారు. జేమ్స్ బాండ్‌గా డానియల్ క్రెగ్ నటిస్తున్న ఈ చిత్రానికి సామ్ మెండెస్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది నవంబర్‌లో ఈ కొత్త బాండ్ తెరపైకి రానున్నాడు.