breaking news
sobhanadripuram
-
ఉత్సాహంగా ఎడ్ల పోటీలు
శోభనాద్రిపురం (హనుమాన్‌జంక్షన్ రూరల్) : బాపులపాడు మండలంలోని శోభనాద్రిపురంలో రాష్ట్రస్థాయి ఎద్దుల పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని వివిధ కేటగిరీల్లో నిర్వహిస్తున్న గూటీ లాగుడు పోటీలు తొలిరోజు ఉత్సాహపూరిత వాతావరణంలో సాగాయి. తొలిరోజు కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి 16 జతల ఎడ్లు పోటీలో పాల్గొన్నాయి. 57 అంగుళాల ఎత్తులోపు ఎడ్ల పోటీలు నిర్వహించారు. ఈ నెల 30వ తేదీ వరకు ఎడ్ల పోటీలు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఎడ్ల పోటీలను తిలకించేందుకు పరిసర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. తొలుత ఈ పోటీలను తెలుగురైతు జిల్లా అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు పోటీలను ప్రారంభించారు. తెలుగురైతు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గుండపనేని ఉమావరప్రసాద్, తెలుగు యువత మండల అధ్యక్షుడు కలపాల సూర్యనారాయణ, నిర్వాహకులు చింతపల్లి సుమన్, మొవ్వా బోసు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
వ్యక్తి ఆత్మహత్య
జంగారెడ్డిగూడెం : ఆర్థిక ఇబ్బందులకు తోడు అనారోగ్యంతో మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ ఎ.ఆనందరెడ్డి కథనం ప్రకారం.. మండలంలోని శోభనాద్రిపురం గ్రామానికిచెందిన కఠారి రంగయ్య (38) అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీనికితోడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. దీంతో మనస్థాపానికి గురై శనివారం ఉదయం పురుగుమందు తాగాడు. దీనిని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రంగయ్య మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.