జంగారెడ్డిగూడెం : ఆర్థిక ఇబ్బందులకు తోడు అనారోగ్యంతో మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వ్యక్తి ఆత్మహత్య
Sep 11 2016 1:43 AM | Updated on Nov 6 2018 8:04 PM
	జంగారెడ్డిగూడెం : ఆర్థిక ఇబ్బందులకు తోడు అనారోగ్యంతో మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ ఎ.ఆనందరెడ్డి కథనం ప్రకారం.. మండలంలోని శోభనాద్రిపురం గ్రామానికిచెందిన కఠారి రంగయ్య (38) అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీనికితోడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. దీంతో మనస్థాపానికి గురై శనివారం ఉదయం పురుగుమందు తాగాడు. దీనిని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రంగయ్య మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 
	 
					
					
					
					
						
					          			
						
				Advertisement
Advertisement

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
