breaking news
smashes iPhones
-
వామ్మో ఈ ప్రిన్సిపల్ యమ డేంజర్
-
వామ్మో ఈ ప్రిన్సిపాల్ యమ డేంజర్: వైరల్ వీడియో
సాక్షి, బెంగళూరు: కళాశాలకు విద్యార్థులు మొబైల్ ఫోన్లు తీసుకుపోవడం ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారిపోయింది. వెంట పుస్తకాలు ఉంటాయో లేదో చెప్పలేం కానీ చేతిలో ఐఫోన్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అయితే కాలేజీ తరగతి గదుల్లోకి ఫోన్లను తీసుకురావద్దని బెంగళూరులోని ఎంఈఎస్ చైతన్య పీయూ కాలేజీ కఠిన నిబంధన విధించింది. అయినా తీరు మార్చుకోని విద్యార్థులు అదేపనిగా తరగతి గదుల్లో ఫోన్ వాడుతున్నారు. లెక్చరర్ పాఠాలు చెబుతున్నా వాట్సప్ చాటింగ్స్‌లో మునిగిపోతున్నారు. దీనిపై తీవ్రంగా స్పందించిన కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థుల ముందే తన ఆగ్రహావేశాలు ప్రదర్శించాడు. విద్యార్థుల వద్దనున్న ఫోన్లను తీసుకుని వారిముందే సుత్తెతో ముక్కలుముక్కలుగా పగలగొట్టాడు. మరెవరైనా ఇంకోసారి తరగతి గదిలోకి చరవాణి తీసుకువస్తే ఇదే విధంగా ముక్కలవుతుందని హెచ్చరించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్‌గా మారింది. -
12 ఐఫోన్లను ధ్వంసం చేశాడు
పారిస్ : ఆపిల్ సంస్థపై కోపోద్రిక్తుడైన ఓ ఫ్రెంచి వ్యక్తి బిజోన్ సిటీలోని ఆ కంపెనీ స్టోర్‌లో వీరంగం సృష్టించాడు. బౌల్స్ గేమ్‌లో వాడే ఇనుప బంతితో కొత్త ఐఫోన్లను ధ్వంసం చేశాడు. డార్క్ కళ్లద్దాలు పెట్టుకున్న ఆ వ్యక్తి, స్టోర్‌లోకి బౌల్స్ గేమ్‌లో వాడే ఇనుప బంతితో ప్రవేశించాడు. అనంతరం తన ముందు డిస్ప్లే చేసిన ఫోన్లను తీసి పక్కకు పడేశాడు. అలా పడేసిన ఆ ఫోన్లను బంతితో పగులగొట్టాడు. కనీసం 12 ఐఫోన్లను, మ్యాక్‌బుక్‌ను ఆ వ్యక్తి ధ్వంసంచేసిన వీడియో బయటికి వచ్చింది. ఆ వ్యక్తి సృష్టిస్తున్న వీరంగానికి వెంటనే స్పందించిన సెక్యురిటీ గార్డు అతని అదుపులోకి తీసుకున్నాడు. ఈ సంఘటనంతా ఓ వినియోగదారుడు తన కెమెరాలో చిత్రీకరించాడు. కెమెరా ద్వారా సంఘటన చిత్రీకరిస్తున్న విషయం తెలుసుకున్న ఆ ఫ్రెంచి వ్యక్తి మరింత ఊగిపోయి తాను ఎందుకు ఈ విధ్వంసం సృష్టిస్తున్నాడో ఆవేశంగా వివరించాడు. యూరోపియన్ వినియోగదారుల హక్కులను ఆపిల్ కంపెనీ ఉల్లంఘిస్తుందని, దోచుకున్న మొత్తాన్ని తిరిగి ఇవ్వడానికి కంపెనీ తిరస్కరిస్తుందని పేర్కొన్నాడు. తన నగదును ఎన్నిసార్లు వెనక్కి ఇవ్వమని కోరినా ఇవ్వడం లేదని ఆరోపించాడు. మీరే చూశారుగా దీనికి ప్రతిఫలమని బిగ్గరగా అరుస్తూ మరో ఐఫోన్‌ను ఇనుప బంతితో పగులగొట్టాడు. ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారని ఇండిపెండెంట్ రిపోర్టు చేసింది..