breaking news
smart phones Features
-
‘స్మార్ట్’ అస్త్రం..
మొబైల్‌ను మొదట్లో ఇతరులతో మాట్లాడడానికి మాత్రమే ఎక్కువగా ఉపయోగించేవారు. కాలానుగుణంగా మారిన శాస్త్ర, సాంకేతికతతో మొబైల్ రంగంలో ఎన్నో మార్పులొచ్చాయి. సాంకేతికత మరింతగా విస్తరించింది. ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, వ్యాపారులు ఇలా అన్ని వర్గాల వారు మొబైల్స్‌ను అధికంగా వినియోగిస్తున్నారు. తమ ఆలోచనలను ఇతరులతో పంచుకోవడానికి అవకాశం ఏర్పడింది. మహిళలకు ప్రత్యేకించి అనేక యాప్‌లు అందుబాటులోకి రావడం, వీటికి విస్తృత ఆదరణ లభించడంతో ప్రపంచవ్యాప్తంగా అధునాతన యాప్‌ల రూపకల్పనలో చాలా సంస్థలు నిమగ్నమయ్యాయి. బ్యూటీ టిప్స్.. అతివల సౌందర్యానికి బ్యూటీటిప్స్ అనే యాప్ అందుబాటులో ఉంది. ప్రస్తుత జీవనవిధానం కారణంగా అందం పాడవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ యాప్‌ద్వారా చక్కటి సూచనలు తెలుసుకునే అవకాశం ఉంది. పాదాలు, చర్మం, పెదవులు, కేశాలను రక్షించుకునే మెళకువల గురించిన పూర్తి సమాచారం ఇందులో అందుబాటులో ఉంటుంది. ఆరోగ్య భద్రత.. మహిళల ఆరోగ్య భద్రతకు ఉమెన్ హెల్త్ డైరీ యాప్ అందుబాటులో ఉంది. ఈ డైరీలో పూర్తి వివరాలు నమోదు చేసుకుంటే ఆరోగ్యపరంగా ఎదురయ్యే సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కారం తెలుసుకునే వీలుంది. రుతుసంబంధ, మానసిక రుగ్మతలను ఈ యాప్‌లో ఉన్న వివరాల ఆధారంగా అధిగమించే అవకాశం ఉంది. కేశ సంరక్షణ.. స్త్రీల కేశసంరక్షణకు న్యూ హెయిర్ స్టైల్ అనే యాప్ అందుబాటులొకి వచ్చింది. దీని ద్వారా ప్రపంచంలో వచ్చే మార్పులకనుగుణంగా కేశాల రక్షణకు చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. ఇంటీరియర్ డిజైన్.. ఇంటి అలంకరణలో మహిళల పాత్ర కీలకం. వీరికోసం ఇంటీరియర్ డిజైన్ యాప్ అందుబాటులో ఉంది. నివసించే గది, భోజనశాల, వంటశాల, పడక గదులను అలంకరించడంలో ఈ యాప్ అధునాతన నమూనాలను అందిస్తున్నాయి. దేశ, విదేశాల్లో ఉన్న నిర్మాణ శైలిని ఈ యాప్ ద్వారా కళ్లముందు చూపిస్తుంది. మేకప్.. వేడుకల్లో ప్రత్యేకంగా కనిపించడానికి మేకప్ యాప్‌ను అధికసంఖ్యలో వినియోగిస్తున్నారు నేటి యువత. ఈ యాప్‌లో అధునాతన అలంకరణకు పెద్దపీట వేస్తున్నారు. వివాహం చేసుకునే యువతులు ఈ యాప్‌తో నూతన విషయాలను తెలుసుకొని అలంకరణలో కొత్తపుంతలు తొక్కుతున్నారు. రక్షణకు నిర్భయ.. మహిళల భద్రతకు నిర్భయ, రక్ష, ఉమెన్ సేఫ్టీ ఇలా 18రకాల యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్‌లో ఇచ్చిన సూచనల ఆధారంగా వివరాలు నమోదు చేసుకుంటే భద్రతకు డోకా లేదు. ఒంటరిగా వెళ్తున్న మహిళలపై ఏప్రాంతంలో దాడులు అధికంగా జరుగుతున్నాయో ఈ యాప్‌ల ద్వారా పోలీసులకు సమాచారం అందుతుంది. 100 నంబర్‌కు ఫోన్.. ఆపదలో ఉన్నప్పుడు మహిళలు 100 నంబర్‌కు ఫోన్ చేసినట్లయితే పోలీసులు వేగంగా స్పందించి రక్షణ చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉంటారు. సమాచారం అందిన వెంటనే సంబంధిత పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునే అవకాశం ఉంది. షీ-టీమ్స్, రక్షక్ వాహనం, బ్లూకోర్ట్సు సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారు. అత్యవసర సమయాల్లో 100 డయల్‌కు ఫోన్ చేస్తే చాలు రక్షణ మీ ముందు ఉన్నట్లుగానే భావించే పరిస్థితులను పోలీసులు కల్పించారు. నగర పోలీసుల వాట్సప్ సేవలు.. నగర పోలీసులు కమిషనరేట్ పరిధిలో అత్యవసర సేవల కోసం ప్రత్యేక వాట్సాప్ నెంబర్‌ను క్రియేట్ చేశారు. 94910–89257 నంబర్‌ను సెల్లో ఫీడ్ చేసుకుంటే చాలు వాట్సప్ ఆన్ అవుతుంది. మహిళలు ఏదైనా ప్రమాదంలో ఉన్నట్లుగా గుర్తించి ఈ నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేస్తే చాలు ఆ నంబర్‌ను ప్రత్యేక యాప్‌తో ఏ లోకేషన్లో ఉందో గుర్తించి సదరు వ్యక్తిని పోలీసులు కాపాడే అవకాశం ఉంటుంది. -
సెల్కాన్ స్మార్ట్‌ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్లు
రెండు ఫేస్బుక్ ఖాతాలు కూడా డైమండ్ సిరీస్‌లో కొత్త 4జీ మోడళ్లు వడ్డీలేని వాయిదాల్లోనూ విక్రయం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల తయారీలో ఉన్న సెల్కాన్ తాజాగా డైమండ్ సిరీస్‌లో రెండు 4జీ మోడళ్లను మంగళవారమిక్కడ విడుదల చేసింది. రెండు వాట్సాప్, రెండు ఫేస్బుక్ అకౌంట్లను నిర్వహించుకునే ఏర్పాటు ఉండడం ఈ స్మార్ట్ఫోన్ల ప్రత్యేకత. భారతీయ బ్రాండ్ నుంచి ఈ ఫీచర్లతో మోడళ్లు రావడం ఇదే ప్రథమం అని సెల్కాన్ సీఎండీ వై.గురు ఈ సందర్భంగా తెలిపారు. హోమ్ క్రెడిట్ కంపెనీతో చేతులు కలిపినట్టు చెప్పారు. వడ్డీలేని వాయిదాల్లో ఈ ఫోన్లను కొనుక్కోవచ్చన్నారు. 2017లో 4జీ పైనే ఫోకస్ చేస్తామన్నారు. మరో 10–12 మోడళ్లు ప్రవేశపెడతామన్నారు. రూ.15 వేల శ్రేణిలోనూ స్మార్ట్ఫోన్ల తయారీ మొదలు పెడతామని వివరించారు. ఫిబ్రవరి నుంచి విదేశాలకు కొత్త మోడళ్ల ఎగుమతులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. రూ.1,999లకే 3జీ స్మార్ట్‌ఫోన్‌ను కొద్ది రోజల్లో సెల్కాన్ విడుదల చేయనుంది. పరిశోధన కేంద్రం.. సెల్కాన్ ఆర్అండ్డీ కేంద్రం త్వరలో హైదరాబాద్‌లో ఏర్పాటు కానుందని తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్ తెలిపారు. తెలంగాణలో స్మార్ట్ఫోన్ల తయారీ చేపట్టాలన్న ప్రభుత్వ కలను కంపెనీ నిజం చేసిందని అన్నారు. ‘డిజిటల్ చెల్లింపుల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. అందుబాటు ధరలకుతోడు స్థానిక భాషలను సపోర్ట్ చేసే స్మార్ట్ఫోన్ల రాకతో డిజిటల్ చెల్లింపులు అధికమవుతాయి’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. మేడ్చల్ ప్లాంటులో 18 నెలల్లో 50 లక్షలకుపైగా ఫోన్లను తయారు చేశామని సెల్కాన్ ఈడీ మురళి రేతినేని వెల్లడించారు. అందుబాటు ధరలో, ఆకట్టుకునే ఫీచర్లతో కూడిన మోడళ్లు తీసుకొస్తామని చెప్పారు. రూ.10 వేలలోపు మోడళ్లకు రుణ సౌకర్యం ఇవ్వడం ఇదే తొలిసారి అని అన్నారు. ఇవీ స్మార్ట్ఫోన్ల ఫీచర్లు.. రెండు మోడళ్లనూ 2.5డి కర్వ్డ్ గ్లాస్‌తో రూపొందించారు. ఫ్లాష్‌తో 8 ఎంపీ ఆటోఫోకస్ కెమెరా, 3.2 ఎంపీ ఫ్రంట్ కెమెరా, పిక్చర్ నాణ్యతను పెంచే బ్యూటీ ప్లస్ యాప్ ఏర్పాటు ఉంది. ఫ్లో యూఐ, 1.3 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్, ఆన్‌డ్రాయిడ్ 6 ఓఎస్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ ఇతర ఫీచర్లు. 21 భాషలను ఇవి సపోర్ట్ చేస్తాయి. డైమండ్ ‘యు’ స్మార్ట్‌ఫోన్‌ను 5 అంగుళాల హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లేతో తయారు చేశారు. ఫింగర్ ప్రింట్ స్కానర్ దీని ప్రత్యేకత. 2500 ఎంఏహెచ్ బ్యాటరీ పొందుపరిచారు. ధర రూ.5,999 ఉంది. డైమండ్ మెగా మోడల్‌ను 5.5 అంగుళాల హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లేతో తయారు చేశారు. 2700 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. ధర రూ.6,400గా నిర్ణయించారు.