small dog
-
కుక్కపిల్లను కొట్టిచంపాడు
భోపాల్: అటుఇటు తిరుగుతూ తన వద్దకు వచి్చన కుక్కపిల్లను ఓ వ్యక్తి అత్యంత నిర్దయగా నేలకేసి కొట్టి చంపాడు. మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో జరిగిన ఈ దారుణం అక్కడి సీసీటీవీలో రికార్డయింది. వీడియో వైరల్‌గా మారడంతో వేలాది మంది.. ఆ వ్యక్తి కర్యశ చర్యపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ దృష్టికి తీసుకెళ్లడంతో అరెస్ట్‌కు ఆదేశాలిచ్చారు. కఠిన శిక్ష పడేలాచూస్తామని ముఖ్యమంత్రి శివరాజ్ హామీ ఇచ్చారు. శనివారం సాయంత్రం గుణ జిల్లాలోని సుభాష్ కాలనీలో జరిగిన ఈ దారుణ ఘటన తాలూకు వీడియో చూసిన వారంతా వ్యక్తిని తీవ్రంగా శిక్షించాలంటూ పోస్టులు పెట్టారు. దాదాపు 30 ఏళ్ల వయసున్న ఆ వ్యక్తి ఆరుబయట కూర్చోగా అక్కడికి రెండు బుల్లి కుక్కపిల్లలు తిండి కోసం తచ్చాడుతూ వచ్చాయి. వాటిల్లో ఒకటి ఇతడి సమీపానికి రాగానే వెంటనే ఆగ్రహంతో కుక్క పిల్లను ఎత్తిపట్టుకుని నేలకేసి బలంగా కొట్టాడు. అక్కడి నుంచి లేచి వచ్చి దానిని కుడికాలితో పలుమార్లు తొక్కిచంపాడు. ఈ హృదయవిదారక దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ‘‘ఇది నా హృదయాన్ని కలిచివేసింది. అతనికి కఠిన శిక్ష పడేలా చేస్తాం’’ అని ముఖ్యమంత్రి చౌహాన్ ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు. -
ఆకారం కాదు.. ధైర్యముండాలి
మన్రోవియా: భారీ శత్రువుతో పోరాడి గెలవాలంటే పెద్ద ఆకారం కాదు.. ధైర్యం ముఖ్యమని బుల్లి కుక్క నిరూపించిన ఘటన దృశ్యమిది. అమెరికాలోని మన్రోవియాలో ఓ తోటను చిన్న కుక్కపిల్ల కాపలాకాస్తుండగా ఆహారం కోసం రెండు ఎలుగుబంట్లు చొరబడ్డాయి. ఒక్కోటి 45కేజీల బరువుండే ఎలుగుబంట్లను 9కేజీల కుక్కపిల్ల అరుస్తూ తరిమింది. దీని దెబ్బకు అవి పారిపోయాయి. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. -
మీరు నిద్రపోతున్నారు.. పోతున్నారు.. పోతున్నారు.. గుర్ర్..
వీళ్లిలా ఎందుకు ఒళ్లు తెలియకుండా నిద్రపోతున్నారో తెలుసా? చిత్రంలో కనిపిస్తున్న ప్రిన్సెస్ అనే బుల్లి కుక్క వీరిని హిప్నటైజ్ చేసింది అందుకే!! ఈ కుక్క మన కళ్లలోకి అలా చూస్తే చాలు.. సినిమాలోలాగా రింగులు రింగులు తిరిగినట్లు అయి.. నిద్ర అదే ముంచుకొస్తుందని దీని యజమాని క్రిస్టినా లెనన్ చెబుతున్నారు. దానికి నిదర్శనమే ఈ ఫొటో. గత రెండేళ్లుగా ప్రిన్సెస్ బ్రిటన్‌లో తన టాలెంట్‌ను చూపిస్తూనే ఉంది. అదెలా సాధ్యం అని క్రిస్టినాను ప్రశ్నిస్తే.. తాము వేటాడే జంతువులను హిప్నటైజ్ చేసే సామర్థ్యం కుక్కలకు ఉంటుందని చెప్పారు. అదే సమయంలో అన్ని శునకాలకూ ఆ సామర్థ్యం ఉండదని.. ప్రిన్సెస్‌కు మాత్రం ఈ ప్రత్యేక లక్షణం జన్మతః అబ్బిందని.. దానికి తన శిక్షణ తోడైందని పేర్కొన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. క్రిస్టినా కూడా హిప్నటిస్టే. దీంతో ప్రదర్శనల్లో కుక్కకు బదులు ఆమే జనాన్ని హిప్నటైజ్ చేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. కుక్కలు హిప్నటైజ్ చేయలేవని నిపుణులు చెబుతున్నారు. అయితేనేం.. వీరి షోలకు మాత్రం తెగ డిమాండ్ ఉంది. ప్రస్తుతం క్రిస్టీనా, ప్రిన్సెస్లు బ్రిటన్ అంతా పర్యటిస్తూ.. వివిధ వర్సిటీల్లో ప్రదర్శనలు ఇస్తున్నారు.