breaking news
Skit college
-
‘స్కిట్’ నిలిచేనా?!
అనంతపురం: వేలాది మందికి ఉజ్వల భవిష్యత్తు ఇచ్చి.. మంచిపేరు ప్రఖ్యాతులు గాంచిన శ్రీకాళహస్తీశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (స్కిట్) కాలగర్భంలోకి కలిసి పోకుండా కాపాడాలని విద్యావేత్తలు కోరుతున్నారు. శ్రీ కాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా 1997–98 విద్యా సంవత్సరంలో స్కిట్ ఇంజినీరింగ్ కళాశాల ప్రారంభించారు.మొదట ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, కంప్యూటర్ సైన్సెస్ కోర్సులకు అనుమతించారు. ఒక్కొక్క కోర్సులో 60 సీట్లు కేటాయించారు. ఆ తర్వాత కొంతకాలానికి సివిల్ ఇంజినీరింగ్ కోర్సుకు కూడా అనుమతిచ్చారు. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ కళాశాల నిర్వహించే విధంగా ప్రభుత్వం నిర్ణయించింది.రూ.750 కోట్ల ఆస్తులురాష్ట్రంలో దేవదాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఏకైక ఇంజినీరింగ్ కళాశాల కావడం..బోధన బాగా ఉండటం.. మంచి ఫలితాలు వస్తుండడంతో అనతి కాలంలోనే స్కిట్‌కు మంచి ఖ్యాతి వచ్చింది. ప్రధాన బ్రాంచ్‌ల్లో అదనపు సీట్లు పెంపుదల చేశారు. దీనికి తోడు డిప్లొమో కోర్సులూ నిర్వహించారు. ఆదాయ పెంపుదల ప్రధానం కాకుండా గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక విద్య అందించాలనే ప్రధాన ఆశయంతో ఈ కళాశాల అప్పట్లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కళాశాల ఆస్తుల విలువ రూ.750 కోట్లు ఉంటాయని అంచనా. విద్యార్థుల నుంచి వచ్చే ఫీజులతోనే కళాశాల ఉద్యోగులకు జీతాలు ఇచ్చే విధంగా నియమ నిబంధనలు రూపొందించారు. ముక్కంటి ఆలయం వారు తొలి కామన్ డిపాజిట్ కోసం రూ.50 లక్షలు ఇచ్చారు. ఆ తరువాత కళాశాల నుంచి వచ్చే ఆదాయమే జీతాలకు, అభివృద్ధి పనులకు సరిపోయేది. 1997 నుంచి 2013 వరకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కళాశాల నిర్వహించారు.ఇప్పటికే రెండు దఫాలు కమిటీ ఏర్పాటుస్కిట్ను జేఎన్టీయూ (అనంతపురం) పరిధిలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రెండు దఫాలు కమిటీలను నియామకం చేసి, సిఫారసులను బుట్టదాఖలు చేశారు. మరో దఫా కమిటీని నియమించారు. ఈసారైనా ఆచరణ సాధ్యమయ్యేనా? లేక మొక్కుబడిగా కమిటీ వేసి కాలయాపన చేస్తారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.పూర్తిగా జేఎన్టీయూ అనంతపురం పరిధిలోకి తెచ్చి.. గతంలో మాదిరి విద్యార్థుల ఫీజులతోనే కళాశాలను నిర్వహించాలని, స్కిట్లో పనిచేసే ఫ్యాకల్టీని అక్కడికే పరిమితం చేసి జీతాలు చెల్లించాలని, ఉద్యోగులను వర్సిటీ పరిధిలోకి తెస్తే సాంకేతిక, న్యాయపరమైన చిక్కులు వస్తాయని నిపుణులు అంటున్నారు. 2013 నుంచి తగ్గుముఖంవిద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోవడం ప్రారంభమైంది. ఆలయ అధికారులు పట్టించుకోకపోవడం, కళాశాలలో వర్గ రాజకీయాలు అధికం కావడం, రాజకీయ జోక్యం మితిమీరడం వంటి కారణాలతో కళాశాల పతన దిశగా పయనించడం ప్రారంభం అయింది. విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. 2016 నవంబర్ నాటికి అక్కడ పనిచేసే ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ప్రతి నెలా రూ.25 లక్షల వంతున ముక్కంటి దేవాలయం వారు చెల్లిస్తున్నారు. కళాశాల ఉద్యోగుల వేతనాలకు ఇప్పటి దాకా దేవాలయం వారు రూ.14 కోట్లు చెల్లించారు. ఈ భారం అధికం కావడంతో రాష్ట్ర దేవదాయశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్థితిగతులను అధ్యయనం చేశారు. 2019–20 సంవత్సరంలో పూర్తిగా అడ్మిషన్లు లేవు. అంతకు ముందు సంవత్సరాల్లో చేరిన విద్యార్థులు బీటెక్‌లో 15 మంది, డిప్లొమోలో 12 మంది ఉన్నారు. చివరి సంవత్సరం విద్యార్థులు కోర్సులు ముగిసి బయటకు వెళ్లిపోతారని, కళాశాలను మూసివేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఈ కళాశాలలో 29 మంది బోధన, 36 మంది బోధనేతర ఉద్యోగులు ఉన్నారు. -
కాలగర్భంలో తొలి దేవదాయ శాఖ కళాశాల!
సాక్షి, జేఎన్టీయూ(అనంతపురం): నిరుపేద, మధ్యతరగతి విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించాలనే ప్రధాన ఆశయంతో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీపంలో నెలకొల్పిన శ్రీకాళహస్తీశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (స్కిట్) ఇంజినీరింగ్ కళాశాల కాలగర్భంలో కలిసిపోనుంది. కళాశాలను బాగు చేయాల్సిన దేవదాయ శాఖ అధికారులు ఏ కారణంగానో నిద్రావస్థలో ఉన్నారు. ఫలితంగా కళాశాల భవిత ప్రశ్నార్థకంగా మారింది. స్కిట్ కళాశాలకు ఈ విద్యాసంవత్సరంలో ఏఐసీటీఈ అనుమతి కూడా రాలేదు. ప్రభుత్వ పెద్దలు స్పందిస్తేగానీ కళాశాలకు పూర్వవైభవం రాదు. 2014 తర్వాతనే పతనం ఒకనాడు ఎంతో కీర్తిని ఆర్జించిన స్కిట్‌కు 2014 తర్వాత పతనం మొదలయింది. ప్రిన్సిపాళ్లను తరచూ మార్చడం, ఆలయ ఈవోలు పట్టించుకోకపోవడం, అధ్యాపకులు గ్రూపులుగా విడిపోవడం, బోధన పట్టించుకోకపోవడంం తదితర కారణాలతో స్కిట్ నిర్వహణ అస్థవ్యస్థంగా మారింది. అప్పటి టీడీపీ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చదువులు పూర్తిగా కుంటుపడ్డాయి. ఉత్తీర్ణత తగ్గిపోయింది. దీంతో ఈ కళాశాలలో చేరే విద్యార్థుల సంఖ్య ఏడాదికేడాది తగ్గుతూ వచ్చింది. రెండేళ్లుగా ఒకరు కూడా చేరలేదు. ఇక్కడ నిర్వహిస్తున్న డిప్లొమా కోర్సుల్లో మాత్రమే విద్యార్థులు చేరుతున్నారు. గతంలో పని చేసిన ఓ ప్రిన్సిపల్ సకాలంలో నివేదికలు సమర్పించకపోవడంతో 2019–2020 విద్యా సంసవత్సరానికి ఏఐసీటీఈ నుంచి అనుమతులు కూడా మంజూరు కాలేదు. ఫలితంగా ఈ ఏడాది ప్రవేశాలు నిలిచిపోయాయి. కాగా, స్కిట్‌ను ప్రభుత్వమే నిర్వహిస్తే.. ఈ కళాశాలలో విద్యార్థులకు నిర్ధేశించిన ఫీజులు చాలా తక్కువగా ఉంటాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఫీజు రీయింబర్స్మెంట్ భారం తగ్గుతుంది. కేవలం బోధన, బోధనేతర సిబ్బందిని నియామకం చేసుకుని బ్లాక్‌గ్రాంట్ నుంచి జీతాలు చెల్లిస్తారు. మేము అసమర్థులం! మరో కొత్త ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు తగ్గ శక్తిసామర్థ్యాలు, ప్రతిభాపాటవాలు, సమర్థత తమకు లేదని పరోక్షంగా జేఎన్టీయూ(ఏ) డెరెక్టర్లు అంగీకరిస్తున్నట్లుగా ఉంది. ఎంతో పేరు ప్రఖ్యాతులున్న స్కిట్‌ను ప్రభుత్వ కళాశాలగా ఏర్పాటు చేసేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇందుకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు సైతం జారీ చేసింది. జేఎన్టీయూ(ఏ) పరిధిలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటును ఆమోదిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత రూ. 10 కోట్లు నిధులు మంజూరుకు ఉన్నత విద్యాశాఖ అంగీకారం తెలిపింది. అయితే తమ పరిధిలో అవసరం లేదని, స్కిట్‌ను కానిస్టిట్యూట్ కళాశాలగా మార్పు చేయలేమంటూ జేఎన్టీయూ(ఏ) డైరెక్టర్లు ఇటీవల సమావేశం ఏర్పాటు చేసుకుని తీర్మానం చేశారు. తమకు తామే సుప్రీంగా తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఉచిత సాంకేతిక విద్యకు విఘాతం స్కిట్‌ను ప్రభుత్వ ఆధీనంలో నిర్వహిస్తే రాయలసీమలో నాలుగో కళాశాలగా గుర్తింపు దక్కుతుంది. అంతేకాక విద్యార్థులకు ఉచిత సాంకేతిక విద్యను ఉన్నత ప్రమాణాలతో అందించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యను అభ్యసిస్తే ఉద్యోగాల కల్పనకు బహుళజాతి కంపెనీలు సైతం ఆసక్తి చూపుతాయి. జేఎన్టీయూ(ఏ), దీని అనుబంధ కలికిరి, పులివెందుల ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు ఇటీవల అత్యున్నత బహుళజాతి సంస్థల్లో గణనీయంగా కొలువులు సాధించడమే ఇందుకు నిదర్శనం. మరో వైపు ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లను శాశ్వత ప్రాతిపదికన నూతనంగా నియమించుకునే అవకాశం ఉంటుంది. నూతన పరిశోధనలకు ఆస్కారం కలుగుతుంది. నాణ్యమైన బోధన, పరిశోధనలు ఏకకాలంలో వృద్ధి చెందుతాయి. అయితే వీటన్నింటినీ కాదంటూ జేఎన్టీయూ (ఏ) యాజమాన్యం, డైరెక్టర్ల వ్యవహరిస్తున్న తీరు వల్ల స్కిట్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఫలితంగా ప్రభుత్వ ఉచిత ఉన్నత సాంకేతిక విద్యకు విఘాతం కలుగుతోంది. తొలి దేవదాయ శాఖ కళాశాల శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా పట్టణంలో 1997లో స్కిట్ ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవదాయ శాఖ తరపున ఏర్పాటు చేసిన ఏకైక ఇంజినీరింగ్ కాలేజీ ఇదే కావడం విశేషం. అప్పటి రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చొరవతో మొదట కాసాగార్డెన్‌లోని భవనాల్లో కళాశాలను నిర్వహించారు. తర్వాత శ్రీకాళహస్తి పట్టణ శివారులో జాతీయ రహదారి పక్కనే సుమారు 55 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక వసతులతో భవనాలు నిర్మించారు. మొదట్లో బీటెక్ కోర్సులకే అనుమతి ఉండేది. ఆ తరువాత ఎంటెక్ కోర్సులకూ అనుమతి లభించింది. డైరెక్టర్లను ఒప్పించే ప్రయత్నం చేస్తాం ప్రస్తుతం ఉన్న కానిస్టిట్యూట్ కళాశాలల్లో అపరిష్కృత సమస్యలు చాలా ఉన్నాయి. వీటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. శ్రీకాళహస్తీశ్వర ఇంజినీరింగ్ కళాశాలను మరో కానిస్టిట్యూట్ కళాశాలగా మార్చేందుకు మాకూ ఆసక్తి ఉంది. అయితే డైరెక్టర్లు ఇందుకు సమ్మతించడం లేదు. శాశ్వత ప్రాతిపదికన బోధన సిబ్బందిని నియామకం చేయాలి. అప్పుడే ఉన్నతవిద్యలో నాణ్యత ప్రమాణాలు మెరుగుపడుతాయి. రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా శ్రీకాళహస్తీశ్వర ఇంజినీరింగ్ కళాశాలను కానిస్టిట్యూట్ కళాశాలగా తీసుకోవాలని ఆదేశిస్తే తప్పదు. డైరెక్టర్లతో మరో దఫా సమావేశం నిర్వహించి ఒప్పించేందుకు ప్రయత్నిస్తాం. – ప్రొఫెసర్ ఎస్ .శ్రీనివాసకుమార్, వీసీ, జేఎన్టీయూ(ఏ) -
పన్నులు చెల్లిస్తారా? జప్తు చేయమంటారా?
స్కిట్ కళాశాల బకాయిలపై మున్సిపల్ కమిషనర్ శ్రీకాళహస్తి: స్కిట్ కళాశాల యజమాన్యం 2011 నుంచి రూ.60లక్షల ఆస్తిపన్ను చెల్లించాల్సి ఉందని..నోటీసులిచ్చినా పట్టించుకోవడంలేదని మున్సిపల్ కమిషనర్ చంద్రయ్య ఆ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్‌రెడ్డికి తెలిపారు. శుక్రవారం మున్సిపల్ కమిషనర్ కళాశాల వద్దకు వెళ్లి ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డితో పన్నుల బకాయిలపై చర్చించారు. పన్ను చెల్లించకపోతే కళాశాలను సైతం జప్తు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో స్పందించిన ప్రిన్సిపాల్ 2013 నుంచి మాత్రమే పన్నులు చెల్లించాల్సి ఉందని, అది కూడా రూ.26లక్షల లోపే ఉందని సమాధానమిచ్చారు. ఏప్రిల్ 1వతేదీలోపు బకాయిలు చెల్లించకపోతే చర్యలు తీసుకుంటామని కమిషనర్ చెప్పి వెళ్లిపోయారు. మరో తలపోటుగా పన్నుల భారం స్కిట్లో పనిచేస్తున్న ఉద్యోగులకు రెండు నెలలుగా జీతాలు లేవు. మొన్నటి వరకు స్కిట్‌ను అనంతపురం జేఎన్టీయూకి, కర్ణాటకలోని మఠాలకు లీజుకు ఇవ్వనున్నట్లు ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాలతో లీజుపై స్కిట్ యాజమాన్యం వెనక్కు తగ్గింది. ఈనేపథ్యంలో మున్సిపాలిటి పన్నుల భారం కళాశాల యాజమాన్యానికి మరో తలపోటుగా పరిణమించింది.