breaking news
Singham
-
భారత్‌లో అస్థిరతకు కుట్ర?.. ఎవరీ నెవిల్ రాయ్ సింఘమ్?
భారత్‌లో రాజకీయ నిరసనలను ప్రోత్సహించడం, అంతర్జాతీయ కార్యకర్తల నెట్‌వర్క్‌ల ద్వారా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నించడం వంటి ఆరోపణలతో అమెరికా వ్యాపారవేత్త నెవిల్ రాయ్ సింఘమ్ పేరు మరోసారి చర్చనీయాంశమైంది. చైనాకు అనుకూల ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలూ ఆయనపై ఉన్నాయి. అయితే, ఈ ఆరోపణలను సింఘమ్ ఖండించారు. తాజాగా బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలతో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.స్వచ్ఛంద సంస్థలకు భారీగా నిధులు అందిస్తూ..సీబీఎస్ న్యూస్ కథనం ప్రకారం.. న్యూయార్క్‌లోని ‘పీపుల్స్ ఫోరమ్’ అనే వామపక్ష భావజాలంతో కూడిన లాభాపేక్షలేని సంస్థకు సింఘమ్ ప్రధాన ఆర్థిక మద్దతుదారుల్లో ఒకరు. కార్మికవర్గం, అణగారిన వర్గాల సమస్యలపై ఈ సంస్థ పనిచేస్తుంది. సింఘమ్ ఐటీ కన్సల్టింగ్ సంస్థ ‘థాట్‌వర్క్స్’ వ్యవస్థాపకుడు కూడా. యుద్ధ వ్యతిరేక సంస్థ ‘కోడ్ పింక్’ సహ వ్యవస్థాపకురాలు జోడీ ఇవాన్స్ ఆయన భార్య. శ్రీలంక నుంచి వలస వచ్చిన దంపతులకు ఆయన జన్మించారు. 2017లో థాట్‌వర్క్స్‌ను ప్రైవేట్ ఈక్విటీ సంస్థకు సుమారు 785 మిలియన్ డాలర్లకు విక్రయించినట్లు సమాచారం. అనంతరం ఆయన తన కార్యకలాపాలను చైనాలోని షాంఘైకి మార్చి, పలు స్వచ్ఛంద సంస్థలు, థింక్ ట్యాంక్‌లకు భారీగా నిధులు అందించినట్లు తెలుస్తున్నది.భారత్‌లో ప్రభుత్వాన్ని మార్చే ప్రయత్నమా?సింఘమ్ పేరు చుట్టూ తాజాగా నెలకొన్న వివాదానికి ప్రధాన కారణం బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలు. అంతర్జాతీయ కార్యకర్తల నెట్‌వర్క్‌లు భారత్‌లో రాజకీయ నిరసనలను విస్తృత ఉద్యమాలుగా మార్చి, నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ అమెరికా మీడియా సంస్థ ఫాక్స్ న్యూస్ ప్రచురించిన నివేదికను ప్రస్తావించింది. ఫ్రాన్స్‌లో జరిగిన అల్లర్లకు, ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలకు మధ్య సంబంధం ఉందని ఆ నివేదిక పేర్కొన్నట్లు బీజేపీ నేతలు తెలిపారు. 13 దేశాల్లో నిరసనలను సమన్వయం చేయడం, నిర్వహించడం లేదా ప్రోత్సహించడంలో పాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 101 సంస్థలను గుర్తించినట్లు ఫాక్స్ న్యూస్ పరిశీలనలో వెల్లడైంది. అయితే ఈ ఆరోపణలు నిరూపితమైన వాస్తవాలు కావు.చైనా ప్రభుత్వంతో సంబంధాలున్నాయా?బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ ‘గ్లోబల్ కయాస్ ఇంక్ గ్రోస్ టు 101 గ్రూప్స్’ అనే నివేదికను ప్రస్తావిస్తూ, వివిధ దేశాల్లోని సంస్థలు నిరసనలకు సంబంధించిన సందేశాలను విస్తృతంగా వ్యాప్తి చేస్తున్నాయని ఆరోపించారు. భారత్, ఫ్రాన్స్, స్పెయిన్, అల్బేనియాలో జరిగిన నిరసనలను ఉదాహరణలుగా పేర్కొంటూ, కార్యకర్తల సంస్థలకు, సింఘమ్‌తో సంబంధమున్నట్లు చెబుతున్న సమూహాలకు మధ్య అనుబంధాలున్నాయని వాదించారు. ఈ సంస్థలు చైనా ప్రభుత్వ సూచనల మేరకు పనిచేస్తున్నాయనే ఆరోపణలూ తెరపైకి వచ్చాయి. కాంగ్రెస్ నాయకత్వం విదేశీ రాజకీయ సంస్థ అయిన ‘ప్రోగ్రెసివ్ ఇంటర్నేషనల్’ ప్రతినిధులతో జరిపిన చర్చలపైనా బీజేపీ ప్రశ్నలు సంధించింది. అయితే, ఈ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు, వాటి ప్రామాణికతపై స్వతంత్ర నిర్ధారణ అవసరం.రాహుల్ గాంధీతో సంబంధాలపై ప్రశ్నలుబీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఈ వ్యవహారంపై నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ప్రశ్నలు లేవనెత్తారు. గత ఐదేళ్లలో సింఘమ్‌తో పాటు ఆన్లైన్ జూదం, కృత్రిమ మేధ (ఏఐ), క్రిప్టోకరెన్సీ, బిట్‌కాయిన్ రంగాలకు చెందిన వ్యక్తుల్లో ఎవరెవరిని రాహుల్ కలిశారని ప్రశ్నించారు. వారిలో ఎవరైనా ఆయన భారత్ జోడో యాత్ర లేదా ఇతర యాత్రల్లో పాల్గొన్నారా? విదేశీ పర్యటనల్లో ఆయన ఎవరిని కలుస్తున్నారు? దేశాన్ని అస్థిరపరిచేందుకు ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తున్నారనే అంశాలపై సమాధానం చెప్పాలని దూబే డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితాలపై జరుగుతున్న నిరసనలు, ఎన్నికల అధికారుల జవాబుదారీతనంపై వస్తున్న డిమాండ్లను కూడా బీజేపీ నేతలు ఈ వివాదంతో ముడిపెడుతున్నారు. ఈ పరిణామాలన్నీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విస్తృత ప్రయత్నంలో భాగమై ఉండవచ్చని వారు ఆరోపిస్తున్నారు.2023లో వెలుగులోకి వచ్చిన సింఘమ్ భారత్‌లో సింఘమ్ పేరు 2023లో తొలిసారిగా విస్తృతంగా చర్చకు వచ్చింది. అప్పట్లో ‘న్యూయార్క్ టైమ్స్’ ప్రచురించిన పరిశోధనాత్మక కథనం వామపక్ష భావజాలం, మీడియా సంస్థలతో సంబంధమున్న కొన్ని సంస్థలకు ఆయన అందించినట్లు చెబుతున్న ఆర్థిక సహాయంపై వివరాలను వెల్లడించింది. బీజింగ్‌లోని ప్రభుత్వ మీడియా వ్యవస్థతో కలిసి ఆయన పనిచేస్తున్నారని ఆ కథనం ఆరోపించింది. అయితే, చైనా ప్రభుత్వ ఆదేశాల మేరకు పనిచేస్తున్నాననే ఆరోపణలను, రాజకీయ పార్టీ నుంచి సూచనలు స్వీకరిస్తున్నాననే వాదనలను సింఘమ్ తిరస్కరించారు. ఆయనతో సంబంధమున్నట్లు పేర్కొన్న డిజిటల్ వార్తా వేదికకు నిధులు అందిన తీరుపైనా భారత అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఆ వేదికకు చైనా అనుకూల కథనాలను ప్రోత్సహించే అంతర్జాతీయ నెట్వర్క్ నుంచి నిధులు అందాయని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది.న్యూస్‌క్లిక్ కేసు.. దర్యాప్తులో కీలక పరిణామాలుసింఘమ్తో సంబంధాలున్నాయని ఆరోపణలు ఎదుర్కొన్న డిజిటల్ వార్తా వేదిక ‘న్యూస్‌క్లిక్’కు అందిన నిధుల మూలాలు, ఆర్థిక లావాదేవీలపై భారత అధికారులు విచారణ చేపట్టారు. 2023 అక్టోబర్‌లో ఢిల్లీ పోలీసులు విదేశాల నుంచి అక్రమంగా నిధులు అందుకున్నారనే ఆరోపణలు, చైనాకు అనుకూల కథనాలను ప్రోత్సహించారనే అభియోగాలకు సంబంధించి న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పురకాయస్థ, ఆ సంస్థ మానవ వనరుల విభాగం అధిపతి అమిత్ చక్రవర్తిని అరెస్టు చేశారు. ఈ పరిణామాలతో సింఘమ్‌కు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు, ఆయన మద్దతు ఇస్తున్న సంస్థల కార్యకలాపాలపై దృష్టి పెరిగింది. సింఘమ్ మాత్రం ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ఆయన నిధుల వ్యవహారాలు సాధారణ దాతృత్వ కార్యక్రమాల పరిధిని దాటి రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడ్డాయా? విదేశీ సంస్థల కార్యకలాపాలకు వాటి ద్వారా ప్రభావం ఏర్పడిందా? అనే అంశాలు ప్రస్తుతం రాజకీయ చర్చకు కేంద్రంగా నిలిచాయి. ఈ ఆరోపణలపై తుది నిర్ధారణకు సంబంధిత దర్యాప్తులు, అందుబాటులో ఉన్న ఆధారాలు కీలకం కానున్నాయి.ఇదీ చదవండి: ముంబై, పూణెలను వణికిస్తున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ -
Bihar Election: డబుల్ షాక్‌లో ‘బిహార్ సింగం’
పట్నా: తన ధైర్యసాహసాలు, సమర్థవంతమైన పోలీసింగ్‌తో బిహార్ ప్రజల హృదయాలను గెలుచుకుని 'సింఘం'గా పేరు తెచ్చుకున్న మాజీ ఐపీఎస్ అధికారి శివ్‌దీప్ డబ్ల్యూ లాండేకు రాజకీయ అరంగేట్రం కలసిరాలేదు. 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా అరారియా, జమాల్పూర్ రెండు స్థానాల నుండి పోటీ చేసిన లాండే రాజకీయాల్లోకి అడుగుపెడుతూ అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే స్థానిక ప్రజల్లో ఆయనకున్న ప్రజాదరణను ఎన్నిక విజయంగా ఆయన మలచుకోలేకపోయారు. ఈ డబుల్ ఓటమితో ఆయన రాజకీయ ఆశలకు మొదటి అడుగులోనే బ్రేక్ పడింది.జమాల్పూర్ నియోజకవర్గంలో లాండేపై జేడీయూ అభ్యర్థి నచికేత మండల్ 96,683 ఓట్లతో విజయం సాధించారు. మండల్ తన సమీప ప్రత్యర్థి అయిన ఐఐపీ నేత నరేంద్ర కుమార్‌పై 36,228 ఓట్ల భారీ తేడాతో గెలుపొందారు. అరారియాలో కూడా లాండేకు ఇదే ఫలితం పునరావృతమైంది. ఈ స్థానాన్ని ఐఎన్‌సీ అభ్యర్థి అబిదుర్ రెహమాన్ 91,529 ఓట్లతో కైవసం చేసుకున్నారు. ఆయన జేడీయూకి చెందిన షగుఫ్తా అజీమ్‌ను 12,741 ఓట్ల తేడాతో ఓడించారు. 49 ఏళ్ల లాండే ఈ రెండు స్థానాల్లోనూ బలమైన నేపథ్యం ఉన్న రాజకీయ నాయకులతో తలపడి విఫలమయ్యారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం లాండేపై ఎటుంవంటి క్రిమినల్ కేసులు లేవు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అతని మొత్తం ఆస్తులు విలువ రూ. 20.4 కోట్లు. అప్పులు రూ. 2.7 కోట్లు ఉన్నాయి.243 మంది సభ్యుల బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ఎన్డీఏ మొత్తం 202 స్థానాలను గెలుచుకుని 200 సీట్ల మార్కును అధిగమించింది. మహాఘట్బంధన్ (ఎంజీబీ) కేవలం 35 స్థానాలకే పరిమితమైంది. శుక్రవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ ఈ విజయోత్సవాలను జరుపుకుంటూ బీహార్ ప్రజలు అద్భుతమైన ఆదేశం ఇచ్చినందుకు వారిని ప్రశంసించారు. ఈ విజయం ప్రజాస్వామ్యాన్ని, భారత ఎన్నికల కమిషన్‌పై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరింత బలోపేతం చేసిందని అన్నారు.ఇది కూడా చదవండి: Bihar Election: ఈ ఐదుగురు.. ‘ఉత్కంఠ విజయులు’ -
రామ్ చరణ్ కు గిఫ్ట్
-
ఈ దీపావళికి సింగం అగైన్ 1000 కోట్ల రికార్డు సృష్టిస్తుందా?
-
ఒకే మూవీలో ప్రభాస్, సూర్య..ఇక బాక్సాఫిస్ షేక్ అవ్వాల్సిందే..
-
సింగమ్ వర్సెస్ సైతాన్ .. అదిరిపోయిన అర్జున్ కపూర్ ఫస్ట్ లుక్!
బాలీవుడ్ సింగమ్ ఫ్రాంచైజీలో రూపొందుతున్న తాజా చిత్రం ‘సింగమ్ ఎగైన్’. అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్, దీపికా పదుకోన్, కరీనా కపూర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘సింగమ్’ ఫ్రాంచైజీ దర్శకుడు రోహిత్ శెట్టి ‘సింగమ్ ఎగైన్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరగుతోంది. కాగా ఈ సినిమాలో అర్జున్ కపూర్ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు పేర్కొని, ఆ పాత్రను సైతాన్గా అభివర్ణిస్తూ, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేశారు రోహిత్ శెట్టి. ‘ఈ తుఫానుకు సిద్ధంగా ఉండండి’ అంటూ అర్జున్ పాత్రను ఉద్దేశించి, సోషల్ మీడియాలో షేర్ చేశారు అజయ్ దేవగన్. రోహిత్ శెట్టి, అజయ్ దేవగన్, జ్యోతీ దేశ్‌పాండే నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. మరోవైపు ‘సింగమ్ ఫ్రాంచైజీ’లో భాగంగా 2011లో ‘సింగమ్’, 2014లో ‘సింగమ్ రిటర్న్స్’ ఇప్పుడు ‘సింగమ్ ఎగైన్’ సినిమాల్లో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Rohit Shetty (@itsrohitshetty) -
ఘోరరోడ్డు ప్రమాదంలో లేడీ సింగం దుర్మరణం
లేడీ సింగంగా పేరున్న అస్సాం పోలీస్ అధికారిణి జున్‌మోనీ రభా ఘోర రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. గతంలో కాబోయే భర్తను అరెస్ట్ చేసి మరీ దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారామె. వ్యక్తిగత పనిపై వెళ్తున్న ఆమె ప్రయాణిస్తున్న కారును.. ఓ ట్రక్కు బలంగా ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ఆమె మృతి చెందారు. లేడీ సింగం, దబాంగ్ కాప్‌గా పేరొందిన జున్‌మోనీ రభా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఓ కంటెయినర్ ట్రక్కు ఆమె ప్రయాణిస్తున్న కారును ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మరణించారు. నాగోవ్ జిల్లా కాలియాబోర్ సబ్ డివిజన్లో సరుభుగియా గ్రామం వద్ద ఈ ఘటన మంగళవారం ఉదయం జరిగింది. అర్ధరాత్రి రెండున్నర గంటల ప్రాంతంలో పెట్రోలింగ్ వాహనం ఆ యాక్సిడెంట్‌ను గుర్తించి.. ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు ప్రకటించారు. ఘటన జరిగిన వెంటనే డ్రైవర్ పరారయ్యాడు. ఉత్తర ప్రదేశ్‌కి చెందిన ఆ ట్రక్కును పోలీసులు సీజ్ చేశారు. సెక్యూరిటీ లేకుండానే ఆమె ప్రయాణం చేయగా.. ఆ ప్రయాణం వివరాలు తమకూ తెలియదని కుటుంబ సభ్యులు చెప్తుండడం గమనార్హం. జున్మోని రభా.. ధైర్యశాలి అధికారిణిగా పేరుంది. గతంలో మోరికోలాంగ్ పోలీస్ అవుట్ పోస్ట్‌లో ఎస్సైగా పని చేశారు. గతంలో ఎంతో సంక్షిష్టమైన కేసుల్ని సాహసోపేతంగా డీల్ చేశారామె. అదే సమయంలో ఆమెపై పలు వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. ఆ సమయంలో ఆర్థిక నేరాలకు పాల్పడ్డవాళ్లపై ఉక్కుపాదం మోపారామె. ఆ క్రమంలో ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడ్డ తనకు కాబోయే భర్తను(అప్పటికే ఎంగేజ్మెంట్ అయ్యింది కూడా) సైతం అరెస్ట్ చేసి ప్రశంసలు అందుకున్నారామె. అయితే.. గత జూన్‌లో ఆ అవినీతిలో ఆమెకు భాగం ఉందంటూ అభియోగాలు రావడంతో ఆమె అరెస్ట్ అయ్యారు. ఆపై సస్పెన్షన్ వేటు పడింది. సస్పెన్షన్ ముగియడంతో తిరిగి ఆమె డ్యూటీలో జాయిన్ అయ్యారు కూడా. 2022 జనవరిలో బీజేపీ ఎమ్మెల్యే అమియా కుమార్ భుయాన్‌తో ఆమె జరిపిన ఫోన్ సంభాషణ లీక్ కావడం కూడా పెను దుమారమే రేపింది. ఇదీ చదవండి: కేరళస్టోరీపై మేం బ్యాన్ పెట్టలేదు -
డ్రగ్స్ అమ్ముతూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ నటుడు
Singham 2 Actor Arrested For Smuggling Drugs: డ్రగ్స్ వినియోగిస్తూ నటుడు మెల్విన్ పోలీసులకు పట్టుబడ్డాడు. వివరాల ప్రకారం..సూర్య హీరోగా నటించిన సింగం-2 సినిమాలో నటించిన నైజీరియన్దేశస్థుడు, నటుడు చాక్విమ్ మాల్విన్ గుర్తున్నాడు కదా.. ఆ సినిమాలో అక్రమంగా డ్రగ్స్ సప్లై చేసే ముఠాకు సంబంధించిన వాడిగా నటించాడు మాల్విన్. సీన్ కట్ చేస్తే నిజ జీవితంలో కూడా డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. చదవండి : అరెరె.. కత్రినా కైఫ్‌కు జిరాక్స్ కాపీలా ఉందే.. నిందితుడి నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు 15లక్షల వరకు ఉంటుందని సమాచారం. 15 గ్రాముల MDMAతో పాటు 250 మిల్లీలీటర్ల హ్యాష్ ఆయిల్ సహా మొభైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనంలోకి తీసుకున్నారు. కరోనా లాక్డౌన్ సమయంలో సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో మెల్విన్ డ్రగ్స్ వ్యాపారంలోకి దిగినట్టు పోలీసులు పేర్కొన్నారు. అయితే మెల్విన్‌తో సినీ పరిశ్రమకు చెందిన ఎవరితో అయినా సంబంధాలు ఉన్నాయి?అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. కాగా కన్నడ, తమిళ, హిందీ భాషల్లో మెల్విన్ పలు చిత్రాల్లో నటించాడు. చదవండి: ‘డ్రైవింగ్ లైసెన్స్’ తీసుకోనున్న అక్షయ్‌కుమార్ -
ఎస్ ఫర్ సూర్య
సినిమా పేరు ‘ఎస్’ ఫర్ ‘సింహం’. కనపడే సింహాలూ కనిపించని సింహాలనూ చూశాం. కానీ ఖాకీ సినిమాలకు లేటెస్ట్ కేరాఫ్ అడ్రస్ సూర్య. రెండు సూపర్ హిట్ సింగంల తర్వాత ముచ్చటగా మూడో హిట్ కోసమే ఈ సినిమా.. సింగంతో సూర్య ప్రయాణమే ఈ కథనం... నీతి నిజాయతీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే పోలీసాఫీసర్ల కథలు సిల్వర్ స్క్రీన్‌కి కొత్త కాదు. చెప్పాలంటే ఇటు సౌత్ అటు నార్త్‌లో బాగా అరిగిపోయిన ఫార్ములా ఇది. స్క్రీన్‌ప్లే చిక్కగా ఉంటేనే ఈ అరిగిపోయిన ఫార్ములా కాసుల వర్షం కురిపిస్తుంది. ఆసక్తికరమైన ట్విస్టులు, చమక్కులు పెట్టే నేర్పు దర్శకుడికీ, ‘ఈ పోలీస్ సూపర్’ అనేలా పెర్ఫామ్ చేయగల సత్తా హీరోకీ ఉండాలి. హీరో సూర్య– దర్శకుడు హరిలకు ఆ దమ్ము ఉంది. ‘సింగమ్’కి ముందు ఈ ఇద్దరి కలయికలో రెండు సినిమాలు వచ్చాయి. విడివిడిగానూ చాలా సినిమాలే చేశారు. కానీ, ‘సింగమ్’కి ముందు ‘సింగమ్’ తర్వాత అని చెప్పుకునేలా వీళ్ల మార్కెట్ మారిపోయింది. అందుకే మొదటి పార్ట్‌తో వదల్లేదు. రెండో పార్ట్ తీశారు. అది కూడా సూపర్. మూడో పార్ట్ కూడా చేశారు. గురువారం మూడో సింగమ్ కూడా వచ్చేసింది. అసలు ‘సింగమ్’ ఎప్పుడు మొదలైంది? హీరోకి 25... దర్శకుడికి 10! అది 2009. హీరో సూర్య అప్పటికి 24 సినిమాలు చేసేశారు. వాటిలో ‘శివపుత్రుడు’ ఒకటి. ఎమోషనల్గానూ సూర్య యాక్ట్ చేయగలడని ప్రూవ్ చేసిన సినిమా అది. ‘గజిని’, ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ కూడా ఈ హీరోలో మంచి విషయం ఉందని నిరూపించాయి. ఇక, ‘ఆరు’, ‘వేల్’ అయితే మంచి మాస్ హీరో ఉన్నాడని చూపించాయి. ఈ రెండు సినిమాలకూ హరి దర్శకుడు. మాస్ సినిమాలు తీస్తే హరినే తీయాలన్నంతగా ఆయనకు పేరు వచ్చింది. దాంతో సూర్య–హరి కాంబినేషన్ అంటే హిట్ అనే పేరు పడిపోయింది. ఇద్దరికీ అండర్స్టాండింగ్ కూడా కుదిరింది. అందుకే ఎక్కడో ఓ మూల సూర్య 25వ సినిమా తానే చేస్తే బాగుంటుందని హరికి అనిపించి ఉంటుంది. అయితే అప్పటికే ప్రభుదేవా దర్శకత్వంలో సూర్య 25వ సినిమా అనే వార్త బయటికొచ్చింది. ఆ తర్వాత ఓ ఫైన్ డే సూర్య కోసం స్టోరీ రెడీ చేశానని, తన 25వ సినిమాకి నేనే దర్శకుణ్ణి అని హరి చెప్పారు. అలా ‘సింగమ్’ మొదలైంది. ఇది హరికి పదో సినిమా. సూర్యకు 25వ సినిమా కాబట్టి, న్యాచురల్‌గా అంచనాలు పెరిగాయి. 2009 ద్వితీయార్థంలో షూటింగ్ మొదలుపెట్టారు. 2010 ఫిబ్రవరిలో ట్రైలర్ రిలీజ్ చేశారు. అంతకుముందు ‘కాక్క కాక్క’ (తెలుగులో వెంకటేశ్ నటించిన ‘ఘర్షణ’)లో సూర్య పోలీస్‌గా కనిపించినా అతను క్లాస్ పోలీస్. ఇక్కడ ఊర మాస్. ట్రైలర్ ఆ విషయాన్ని స్పష్టం చేసింది. పైగా సూర్య చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాడు. సింహంలాంటి వేగం, చురకత్తిలాంటి చూపులు, పంచ్ డైలాగులు... చిన్న ట్రైలర్లో ఇవన్నీ చూపించేశారు హరి. దాంతో అంచనాలు పెరిగిపోయాయి. ఒకవైపు సింహం వాడి... మరోవైపు వేసవి వేడి! 2010 మే 28... ‘సింగమ్’ విడుదలైంది. సినిమాల రిలీజుకు సమ్మర్ మంచి సీజన్. పిల్లలకు సెలవులు. సుమారు 20 శాతం కలెక్షన్స్ వాళ్లిచ్చేస్తారు. మాస్ సినిమాలంటే పడి చచ్చిపోయేవాళ్లు, సూర్య ఫ్యాన్స్ మాగ్జిమమ్ చూసేస్తారు. ఓ 60, 70 శాతం వసూళ్లు వాళ్లే ఇస్తారు. లేడీస్ వాటా కూడా కొంత ఉంటుంది. సినిమా బాగుంటే చూసినవాళ్లే మళ్లీ మళ్లీ చూస్తారు. ‘సింగమ్’కి అదే జరిగింది. మొదటి రోజే హిట్ టాక్. పోలీస్ అంటే ‘దురైసింగమ్’ (తెలుగులో ‘నరసింహ’ం)లా ఉండాలన్నారు. ‘సింగమ్’లో సూర్య పాత్ర పేరిది. కథ చాలా చిన్నది. చిన్న పల్లెటూరికి చెందిన దురైసింగమ్ సిటీకి వస్తాడు. ఎలాంటి ప్రలోభాలకూ లొంగడు. వృత్తిని దైవంగా భావిస్తాడు. సమాజంలోని చీడపురుగులను ఏరిపారేస్తాడు. ఈ పాయింట్ చుట్టూ హరి అల్లిన సన్నివేశాలు, దురైసింగమ్గా సూర్య నటన హైలైట్. హీరో–విలన్ల ఎత్తుకు పై ఎత్తులు ఆసక్తికరంగా ఉంటాయి. ఇవి సినిమాని నిలబెట్టేసాయి. అప్పటి సూర్య మార్కెట్‌కి తగ్గట్టుగా సుమారు 15 కోట్ల రూపాయల ఖర్చుతో తీశారు. దాదాపు 65 కోట్లు వసూళ్లు సా«ధించింది. తెలుగులో ‘యముడు’గా విడుదలై, ఇక్కడ కూడా మంచి ఆదరణ పొందింది. అందుకే ‘సింగమ్’ అంటే సూర్య– హరిలకు స్పెషల్ లవ్. దీన్ని ఇలానే వదలకూడదు.. మరిన్ని సింహాలను తెర మీదకు వదలాలను కున్నారు. అలా సెకండ్ పార్ట్ స్టార్ట్. మూడేళ్ల తర్వాత రెండో సింహం ‘సింగమ్’ చేశాక సూర్య–హరి ఎవరి సినిమాలతో వాళ్లు బిజీ అయిపోయారు. రెండో భాగం మొదలుపెట్టే లోపు సూర్య దాదాపు ఏడు సినిమాలు చేసేశారు. అయితే ‘సింగమ్’ ఇచ్చినంత రిజల్ట్‌ని అవేవీ ఇవ్వలేకపోయాయి. మరోవైపు హరి పరిస్థితి కూడా అంతే. ఆయన చేసిన ఒకే ఒక్క సినిమా ఫర్వాలేదనిపించుకుంది. ఇలాంటి టైమ్‌లో మళ్లీ ఇద్దరూ సినిమా చేయాలనుకున్నారు. 2012లో రెండో సింహానికి శ్రీకారం చుట్టారు. 2013 జూలై 5న విడుదలైంది. డబుల్ మాస్... ఫస్ట్ పార్ట్‌లో ఉద్యోగానికి రాజీనామా చేసి, ప్రేయసితో ఊరు వెళతాడు దురైసింగమ్. కానీ, అది ఉత్తుత్తి రాజీనామా. సెకండ్ పార్ట్‌లో ఎన్.సి.సి. టీచర్‌గా చేస్తుంటాడు. అండర్ కవర్ డి.ఎస్.పి అన్నమాట. సముద్ర తీర ప్రాంతంలో జరుగుతున్న మాదక ద్రవ్యాల అక్రమ రవాణాని అంతం చేయాలనే మిషన్ మీద పని చేస్తుంటాడు. వాటి వెనక ఉన్నది అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా అని కనుగొంటాడు. కానీ, టీచర్ ముసుగు నుంచి బయటకు రావాల్సి వస్తుంది. దురైసింగమ్ పోలీసాఫీసర్ అని తెలిశాక విలన్లకూ అతనికీ మధ్య అసలు యుద్ధం మొదలవుతుంది. అక్కణ్ణుంచి సినిమా ఊపందుకుంటుంది. చివరికి విలన్ని పట్టుకుని జైలులో పెట్టడంతో సినిమాకి ఎండ్ కార్డ్ పడుతుంది. ఫస్ట్ పార్ట్‌కన్నా సెకండ్ పార్ట్ మరింత మాస్‌గా ఉంటుంది. పవర్ఫుల్ డైలాగ్స్ రూపంలో సూర్య అరుపులు, అతను కొట్టే దెబ్బలకు విలన్ల అరుపులు, మధ్యలో రిలీఫ్ కోసం అనుష్కతో లవ్ ట్రాక్, హన్సిక వన్ సైడ్ లవ్, అంజలి ఐటమ్ సాంగ్‌తో సెకండ్ పార్ట్ మాస్‌కి ఎక్కేసింది. దాంతో సూపర్ హిట్టయింది. తెలుగులో ‘యముడు–2’గా వచ్చి, ఇక్కడా హిట్టయింది. ఆరంభం వాయిదా... విడుదల వాయిదా! ఎప్పుడైతే రెండు భాగాలు హిట్టయ్యాయో అప్పుడు ‘సింగమ్’ ఓ బ్రాండ్ అయిపోయింది. మూడో భాగం ఎప్పుడు మొదలవుతుందా అని ‘సింగమ్’ ప్రేమికులు ఎదురు చూశారు. సెకండ్ పార్ట్ విడుదలైన ఏడాదికి (2014) మూడో భాగానికి అధికారికంగా ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత ఏడాదికి సినిమాని మొదలు పెట్టాలనుకున్నారు. 2015 డిసెంబర్లో షూటింగ్ ప్లాన్ చేశారు. అదే సమయంలో చెన్నైలో భారీ తుపాను. వేరే దారి లేక షూటింగ్‌ను వాయిదా వేశారు. విచిత్రంగా సినిమా విడుదల కూడా పలుమార్లు వాయిదా పడింది. గతేడాది దీపావళికి విడుదల చేయాలనుకున్నారు. ఆ తర్వాత క్రిస్మస్కి అనుకున్నారు. అదీ మిస్సయింది. ఈలోపు 2016 అయిపోయింది. 2017 రానే వచ్చింది. జనవరిలో విడుదల చేయాలనుకుంటే.. తమిళనాడు సంప్రదాయ క్రీడ ‘జల్లికట్టు’ వివాదం కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. ఒకవేళ వాయిదాల పర్వం లేకపోయి ఉంటే మొదటి భాగానికీ, రెండో భాగానికీ ఉన్నట్లుగానే రెండో భాగానికీ మూడో భాగానికీ మూడేళ్లు గ్యాప్ ఉండేది. వాయిదాల వల్ల నాలుగేళ్ల గ్యాప్ వచ్చింది. ఏదైతేనేం గురువారం ‘సింగమ్ 3’ విడుదలైంది. తిరుగు లేని సింహం ఈసారి దురైసింగమ్ మిషన్ ఏంటంటే... మంగళూరులో ఓ కమిషనర్ హత్యకు గురవుతాడు. ఆ హత్య చేసింది ఎవరు? అని ఛేదించడంతో పాటు అక్కడ జరుగుతున్న అక్రమాల వెనక ఉన్న వ్యక్తి ఎవరు? అని తెలుసుకుని అతని సామ్రాజ్యాన్ని కూలగొట్టడానికి దురైసింగమ్ ఏం చేశాడు? అనేది కథ. ముందు అనుకున్న తేదీకి విడుదలై ఉంటే, రెండింతల క్రేజ్ ఉండేది. వాయిదాల మీద వాయిదా ఓ మైనస్. ఈ విషయాన్ని స్వయంగా సూర్య కూడా ఒప్పుకున్నారు. అయినప్పటికీ పాజిటివ్‌గానే ఉన్నట్లు పేర్కొన్నారు. వాయిదా ఎఫెక్ట్ కాస్త కనిపించినా రానున్న రోజుల్లో ‘సింగమ్’కి తిరుగుండదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మొదటి రోజు పాజిటివ్ టాక్ తెచ్చుకోగలిగింది. అది చాలు సినిమా నిలబడటానికి. అన్నట్లు ‘సింగమ్’ దూకుడు ఇంతటితో ఆగదు. ‘సింగమ్ 4’ కూడా ఉంటుంది. సౌత్‌లో సీక్వెల్స్ తక్కువ. హిందీలో మాత్రం మూడు, నాలుగు, ఐదు.. ఇలా తీస్తుంటారు. ఉదాహరణకు ‘గోల్మాల్’. సౌత్‌లో ‘సింగమ్’ సిరీస్ ఆ రికార్డ్‌ని సొంతం చేసుకుంటుందని చెప్పొచ్చు. మరి.. నాలుగో భాగం ఎప్పుడు? వెయిట్ అండ్ సీ. విడుదలకు ముందే 100 కోట్లు! ‘సింగమ్’ మొదటి భాగం బడ్జెట్ 15 కోట్లు. రెండో భాగాన్ని 45 కోట్లతో తీశారు. ఈ సిరీస్‌కి వచ్చిన ఆదరణ దృష్ట్యా మూడో భాగాన్ని దాదాపు 65 కోట్లతో తీశారు. కానీ, విడుదలకు ముందే సినిమా 100 కోట్ల క్లబ్లో చేరింది. ఎలాగంటే... తమిళనాడు బిజినెస్ 41 కోట్లు, తెలుగు 18 కోట్లు, ఓవర్సీస్ 15.5 కోట్లు, కేరళ–కర్నాటక 9 కోట్లు, అన్ని భాషల శాటిలైట్ రైట్స్ ఇంచుమించు 22 నుంచి 25 కోట్లు, తమిళ మ్యూజికల్ రైట్స్ 1 కోటీ 75 లక్షలు. ఇవన్నీ కూడితే 115 నుంచి 120 కోట్లు పై చిలుకే. ఇతర భాషల్లో సింగమ్ ‘సింగమ్’, ‘సింగమ్2’ తెలుగులో డబ్ అయ్యాయి. ‘సింగం’ హిందీలో రీమేక్ అయింది. మాస్ హీరో అజయ్ దేవగణ్‌తో రోహిత్ శెట్టి తెరకెక్కించారు. సుమారు 20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన హిందీ ‘సింగమ్’ 140 కోట్ల రూపాయలు వసూలు చేయడం రికార్డ్. బాక్సాఫీస్‌కి పూనకం పట్టిందా అని ఆశ్చర్యపోయారంతా. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టయిన నేపథ్యంలో రెండో భాగం తీశారు. అయితే దీనికీ, తమిళ సీక్వెల్‌కీ సంబంధం లేదు. వేరే కథతో ‘సింగమ్ రిటర్న్స్’ తీసి మళ్లీ హిట్ సాధించారు. ‘సింగమ్’ కన్నడ రీమేక్ ‘కెంపెగౌడ’లో సుదీప్ హీరోగా నటించి, దర్శకత్వం వహించారు. తమిళంలోలానే కన్నడంలోనూ సినిమా సూపర్ హిట్. ‘కెంపెగౌడ’ వసూళ్ల సునామీ సృష్టించింది. బెంగాలీలో ‘షోత్రు’ పేరిట రీమేక్ అయిన ‘సింగమ్’ అక్కడ కూడా ఘనవిజయం సాధించింది. అరిగిపోయిన ఫార్ములాకి ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లే తయారు చేసుకుంటే హిట్ ఖాయం అని ‘సింగమ్’ సిరీస్ నిరూపించింది. – డి.జి. భవాని


