breaking news
Singer ABHIJEET
-
ఆయన అభిప్రాయాలను తప్పుపట్టను
‘‘సింగర్ అభిజీత్ అంటే నాకెంతో అభిమానం. నాపై ఎన్ని విమర్శలు చేసినా ఆయన్ను గౌరవిస్తూనే ఉంటాను. ఆయన అభిప్రాయాలను తప్పుపట్టను. ఒక్కొక్కరికీ ఒక్కో అభి్ప్రాయం ఉంటుంది. నా పని తీరుపై ఆయనకు ఉన్న అభిప్రాయాన్ని ఆ విధంగా బయటపెట్టారు’’ అని పేర్కొన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. విషయం ఏంటంటే... ఏఆర్ రెహమాన్ డిజిటల్ టూల్స్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నారని, దీంతో సంప్రదాయ సంగీత వాద్యకారులకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయని అభిజీత్ పేర్కొన్నారు. ఈ విషయంపై రెహమాన్ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ...‘‘దుబాయ్ వేదికగా 60మంది మహిళలతో ఓ ఆర్కెస్ట్రా బృందాన్ని ఏర్పాటు చేసి, వారికి ఉద్యోగాలు కల్పించి, ప్రతి నెలా జీతాలు ఇస్తున్నాను. వారికి ఆరోగ్య, జీవిత బీమా సౌకర్యాలనూ కల్పించాను. అది ‘ఛావా’ కావొచ్చు... ‘΄పొన్నియిన్ సెల్వన్’ కావొచ్చు... నా ప్రతి సినిమాలో 200 నుంచి 300 మంది వరకు మ్యూజీషియన్స్ ఇన్వాల్వ్ అవుతారు. కొన్ని పాటలపై 1000 మంది మ్యూజీషియన్స్ వర్క్ చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయను. సో... నా వర్కింగ్ స్టైల్‌పై అందరికీ అవగాహన ఉండకపోవచ్చు’’ అన్నారు. అందుకే ‘వండర్మెంట్’ అని పెట్టా: రెహమాన్, ఆయన భార్య సైరా భాను విడి విడిగా ఉండటం, అలాగే ఇటీవల అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడం వంటి విషయాలు చర్చనీయాంశం కావడం పట్ల ఆ ఇంటర్వ్యూలో రెహమాన్ స్పందిస్తూ... ‘‘ఇది అమానవీయం. నా జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. ప్రతి ఒక్కరిలోనూ ఓ ప్రత్యేకమైన గుణం ఉంటుంది. వాళ్ల ఇంట్లో వారే సూపర్‌హీరో. కానీ.. నేను సూపర్ హీరో అయ్యేలా చేసింది మాత్రం నా అభిమానులే. నేను ఆస్పత్రిలో చేరాననగానే ఎంతో ప్రేమతో సందేశాలు పంపారు. ఇంతమంది అభిమానం సొంతం చేసుకోవడం నాకు ‘వండర్’గా అనిపించింది. అందుకే నా తర్వాతి మ్యూజికల్ టూర్‌కి ‘వండర్మెంట్’ అని పేరు పెట్టుకున్నాను’’ అన్నారు. -
ఫుట్ పాత్ లు ఉన్నది పడుకోవడానికా?
ముంబై: సల్మాన్ ఖాన్ కు జైలు శిక్ష విధించిన నేపథ్యంలో డిజైనర్ ఫరా అలీఖాన్, గాయకుడు అభిజిత్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఫుట్ పాత్ లు ఉన్నది జనాలు నిద్రించడానికి కాదని అభిజిత్ ట్వీట్ చేశాడు. ఫుట్ పాత్ లపై ఏదైనా ప్రమాదం జరిగితే అందుకు బాధ్యత డ్రైవర్లు లేదా మద్యానికి కాదని పేర్కొన్నాడు. ఆత్మహత్య నేరం, మరి ఫుట్ పాత్ లపై పడుకోవడం నేరం కాదా అని ప్రశ్నించాడు. 80 శాతం మంది నిరాశ్రయులు ఎంతో కష్టపడి బాలీవుడ్ లో స్టార్ డమ్ సాధించారని వారెప్పుడూ ఫుట్ పాత్ లపై నిద్రించలేదని వ్యాఖ్యానించాడు. 'హిట్ అండ్ రన్'కు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిజైనర్ ఫరా అలీఖాన్ ట్వీట్ చేశారు. పేదలను నిరాశ్రయులను చేయడం వల్లే వారు ఫుట్ పాత్ లపై పడుకుంటున్నారని తెలిపారు. నిరాశ్రయులు ఫుట్ పాత్ పై నిద్రించకుండా ఉంటే సల్మాన్ వారిపై కారు ఎక్కించేవాడు కాదని పేర్కొన్నారు. పట్టాలు దాటుతున్న వ్యక్తిపై రైలు పోనిచ్చినందుకు రైలు డ్రైవర్ ను శిక్షించిన చందంగా సల్మాన్ ఖాన్ కు శిక్ష విధించారని అన్నారు. రోడ్డు లేదా ఫుట్ పాత్ లపై ఎవరూ నిద్రించరాదని... ఇది రైలు పట్టాలు దాటడం లాంటిదని ఆమె వర్ణించారు. అయితే తన వ్యాఖ్యలపై వివాదం రేగడంతో ఆమె వివరణ ఇచ్చారు. పేదలను అవమానించడం తన ఉద్దేశం కాదని, పాలకుల చేతగాని తనాన్ని ఎద్దేవా చేశానని చెప్పారు. పేదలకు ఇళ్లు నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. అభిజిత్ కూడా తన వ్యాఖ్యలను సమర్థించుకున్నాడు. మనుషులు కుక్కల్లా ఫుట్ పాత్ లపై పడుకోరాదన్నదే తన ఉద్దేశమని వివరణయిచ్చాడు. తన దృష్టిల్లో ప్రతి మనిషి గౌరవింపదగిన వాడేనని చెప్పాడు.