breaking news
Sikhs for Justice
-
సిక్కులకు న్యాయం కోసం కృషి
నవీ ముంబై: సిక్కులకు గౌరవం, న్యాయం దక్కేలా కృషి చేసేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధాని మోదీ చెప్పారు. అందుకే, 1984లో ఇందిర మరణానంతరం సిక్కులపై జరిగిన దాడులపై ప్రత్యేక విచారణ జరిపేందుకు తమ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిందన్నారు. మూసివేసిన ఎన్నో కేసులను తిరిగి తెరిచి, విచారణ చేపట్టామని తెలిపారు. బాధిత కుటుంబాలకు పరిహారం అందజేశామన్నారు. జాతీయ మైనారిటీ కమిషన్‌లో సిక్కులకు మరింత ప్రాముఖ్యతను కల్పించామన్నారు. గురు తేజ్ బహదూర్ అమరత్వం పొంది 350 ఏళ్లయిన సందర్భంగా ముంబైలోని ఖర్గార్‌లో ఆదివారం జరిగిన ‘హింద్–ది–చదర్’ను ఉద్దేశించి ప్రధాని వర్చువల్‌గా మాట్లాడారు. అఫ్గానిస్తాన్‌లో పవిత్ర గురుగ్రంథ్ సాహిబ్ ప్రతులు, సిక్కు కుటుంబాల భద్రత ప్రమాదంలో పడగా ప్రభుత్వం తక్షణమే స్పందించి సురక్షితంగా స్వదేశానికి తరలించిందని గుర్తు చేశారు. అఫ్గాన్‌లో యాతనలు పడిన సిక్కులకు సీఏఏ ద్వారా పౌరసత్వం కల్పించామని తెలిపారు. జమ్మూకశ్మీర్‌కు చెందిన సిక్కు కుటుంబాల పునరావాసానికి చర్యలు తీసుకున్నట్లు గుర్తు చేశారు. వేలాది మంది సిక్కుల పేర్లను బ్లాక్ లిస్టు నుంచి తొలగించడంతోపాటు వీసా నిబంధనలను సడలించినట్లు ప్రధాని వివరించారు. భవిష్యత్తుకు బాటలు పరిచేవి..హింద్–ది–చాదర్ వంటి కార్యక్రమాలు కేవలం గతాన్ని గుర్తు చేసుకోవడానికి కాకుండా భవిష్యత్తుకు దారులు వేస్తాయన్నారు. ‘గురు తేజ్ బహదూర్ కాలంలో ధైర్యం, సత్యసంధతకు ఎంతటి ప్రాముఖ్యం ఉందో, నేటికీ అంతే సందర్భోచితంగా ఉంది. మన కొత్త తరం ఇటువంటి విలువలని అందిపుచ్చుకున్నప్పుడు, సంప్రదాయం అనేది కేవలం ఒక జ్ఞాపకంలా మిగిలిపోదు; అది భవిష్యత్తుకు మార్గదర్శకంగా మారుతుంది. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం కూడా ఇదే. మనం చరిత్రను కేవలం స్మరించుకోవడమే కాదు, దానిని మన జీవితాల్లోకి కూడా తెచ్చుకోవాలి’అని ప్రధాని మోదీ తన వర్చువల్ ప్రసంగంలో పేర్కొన్నారు.మన గురువుల త్యాగాలు..దేశ చరిత్ర పరాక్రమం, సమన్వయం మరియు సహకారంతో నిండి ఉందని ఆయన అన్నారు. గురువుల అత్యున్నత త్యాగం దేశ ఐక్యతను మరింత బలోపేతం చేసిందని ప్రధాని చెప్పారు. సమాజంలోని ప్రతి వర్గం వారి నుంచి స్ఫూర్తిని పొందిందని, అది సమాజం సత్య మార్గంలో ముందుకు స్థిరంగా సాగడానికి సాయపడిందని ప్రధాని తెలిపారు. ‘దేశానికి సామాజిక ఐక్యత ఎంతో అవసరమైన ఈ సమయంలో, మన గురువులు, సాధువుల ఆశీస్సులు మనకు ఉన్నాయనే నమ్మకాన్ని ఈ కార్యక్రమం కలిగిస్తోంది. ఈ ప్రయాణం గత ఏడాది నాగ్‌పూర్ నుంచి ప్రారంభమైంది, ఆ తర్వాత నాందేడ్ వరకు సాగింది. నేడు నవీ ముంబైలో ఈ ప్రయాణం ఒక ముఖ్యమైన దశకు చేరుకుంది’అని ప్రధాని అన్నారు. -
సోనియాపై కేసు పిటిషన్ కొట్టివేత
న్యూయార్క్: 1984నాటి సిక్కుల ఊచకోత ఘటనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై అమెరికాలో దాఖలైన ఓ పిటిషన్‌ను అక్కడి కోర్టు కొట్టివేసింది. ఆరోపణ దారులు దాఖలు చేసిన పిటిషన్లో పరిపక్వత కలిగిన అంశాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. సిక్కుల ఊచకోత ఘటన విషయంలో సోనియాగాంధీ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని, ఆమెపై కేసులు నమోదు చేయాలంటూ న్యూయార్క్‌లోని సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) అనే సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టన ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లో కొత్తగా అభివృద్ధి ఏమి లేదని, గతంలో పేర్కొన్న అంశాలే మళ్లీ చెప్తున్నారంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. -
మన్మోహన్‌కు సమన్లు ఇవ్వండి
సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థకు అమెరికా కోర్టు ఆదేశం వాషింగ్టన్: భారత ప్రధానమంత్రి మన్మోహన్‌కు జూన్ 18లోగా సమన్లు అందివ్వాలని సిక్కుల మత సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే)ను అమెరికా కోర్టు ఆదేశించింది. జూన్ 18లోగా ఆయనకు సమన్లు అందించనట్లయితే మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపిస్తూ మన్మోహన్పై పెట్టిన కేసును కొట్టివేయాల్సి వస్తుందని స్పష్టం చేసింది. మన్మోహన్‌కు సమన్లు అందించినట్టుగా ఆధారాలను జూన్ 18లోగా తమకు సమర్పించాలని అమెరికా జిల్లా జడ్జి జేమ్స్ ఈ బోస్బెర్గ్ ఈ నెల 18న ఎస్ఎఫ్జేకు ఆదేశాలు జారీ చేశారు. 1990ల్లో పంజాబ్‌లో సిక్కులపై దాడులు, హత్యాకాండకు మన్మోహన్ సహకరించారంటూ ఎస్ఎఫ్జే వాషింగ్టన్ ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గత ఏడాది సెప్టెంబర్‌లో మన్మోహన్ అమెరికా పర్యటన సందర్భంగా వాషింగ్టన్ ఫెడరల్ కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. ఈ సమన్లను మన్మోహన్‌కు అందివ్వాల్సిందిగా కోర్టు ఆదేశించింది. -
జూన్ 18లోగా మన్మోహన్ కు సమన్లు ఇవ్వండి
వాషింగ్టన్: భారత ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు జూన్ 18లోగా సమన్లు అందివ్వాలని అమెరికా కోర్టు సిక్కుల మత సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే)ను ఆదేశించింది. జూన్ 18లోగా ఆయనకు సమన్లు అందించనట్లయితే మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపిస్తూ మన్మోహన్పై పెట్టిన కేసును కొట్టివేయాల్సి వస్తుందని స్పష్టం చేసింది. మన్మోహన్‌కు సమన్లు అందించినట్టుగా ఆధారాలను జూన్ 18వ తేదీలోగా తమకు సమర్పించాలని అమెరికా జిల్లా జడ్జి జేమ్స్ ఈ బోస్బెర్గ్ ఈ నెల 18న ఎస్ఎఫ్జేకు ఆదేశాలు జారీ చేశారు. 1990ల్లో పంజాబ్‌లో సిక్కులపై దాడులు, హత్యాకాండకు మన్మోహన్ సహకరించారంటూ ఎస్ఎఫ్జే వాషింగ్టన్ ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గత ఏడాది సెప్టెంబర్‌లో మన్మోహన్ అమెరికా పర్యటన సందర్భంగా వాషింగ్టన్ ఫెడరల్ కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. ఈ సమన్లను మన్మోహన్‌కు అందివ్వాల్సిందిగా తాజాగా కోర్టు షరతు విధించింది.


