breaking news
Shraddhanjali
-
పర్వత పుత్రి సాహు శ్రద్ధాంజలి సాహు...
ఒడిశాలో పుట్టి, హైదరాబాద్‌లో పెరిగిన పంతొమ్మిదేళ్ల అమ్మాయి. బీటెక్ ఫైనలియర్. చదివేది సాఫ్ట్వేర్ కోర్సే అయినా తన పరిజ్ఞానాన్ని దేశ రక్షణరంగం కోసం అంకితం చేయాలనుకుంటోంది. ‘ఆ కల కోసమే ఎన్సీసీలో చేరాను, ఆ కల నెరవేర్చుకునే క్రమంలో నన్ను నేను నిరూపించుకోవడం కోసమే పర్వతాన్ని అధిరోహించాను’ అంటోంది. గత జూన్ నెల 21వ తేదీన కాంగ్ యాత్సే 2 పర్వతాన్ని అధిరోహించి, శిఖరం మీద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించింది. ‘నా కల చాలా పెద్దదని నాకు తెలుసు. ఆ కలను సాకారం చేసుకోవడానికి శ్రద్ధగా ఒక్కో అడుగు వేస్తున్నాను’ అంటూ ‘సాక్షి ఫ్యామిలీ’తో తన పర్వతారోహణ అనుభవాల్ని పంచుకుంది శ్రద్ధాంజలి సాహు. కాంగ్ యాత్సే పర్వతశ్రేణి హిమాలయాల్లో లధాక్ రీజియన్‌లో ఉంది. కాంగ్ యాత్సే పర్వత శిఖరం ఎత్తు 6,250 మీటర్లు. నా మౌంటెనీరింగ్ జర్నీ చాలా తమాషాగా జరిగి΄ోయింది. ఎయిత్‌లోనో, నైన్త్ క్లాస్‌లోనో గుర్తులేదు. హిందీలో ‘ఎవరెస్ట్ మేరీ శిఖర్’ అనే ΄ాఠం ఉండేది. మా హిందీ టీచర్ ఆ ΄ాఠాన్ని ఎంత అద్భుతంగా చె΄్పారంటే... బచేంద్రి΄ాల్‌లాగ నేను కూడా పర్వతారోహణ చేయాలనుకున్నాను. పర్వతాల గురించి తెలుసుకోవడం కూడా అప్పటి నుంచే మొదలైంది. గత ఏడాది ఏప్రిల్‌లో ఎన్సీసీ, హైదరాబాద్ కమాండర్ కల్నల్ అనిల్ ఆధ్వర్యంలో మౌంటెనీరింగ్ అవకాశం రాగానే మరేమీ ఆలోచించకుండా ట్రైనింగ్‌కి వెళ్లాను. హెచ్ఎమ్ఐ (హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇన్స్టిట్యూట్) ఆధ్వర్యంలో డార్జిలింగ్‌లో నెల రోజులు బేసిక్ ట్రైనింగ్, ఆ తర్వాత ఈ ఏడాది మార్చిలో అడ్వాన్స్డ్ ట్రైనింగ్, సెర్చ్ అండ్ రెస్యూ్క మెథడ్స్ ట్రైనింగ్ ఉత్తరాఖండ్‌లో పూర్తి చేసుకుని ఎక్స్‌పెడిషన్‌కు సిద్ధమయ్యాను. అమ్మకు దూరంగా యాభై రోజులుఢిల్లీలో మే 28న ఫ్లాగ్ ఆఫ్, జూన్ 29న ఫ్లాగ్ ఆన్ జరిగింది. ముందు, వెనుక ప్రయాణాలన్నీ కలిపి యాభై రోజులు ఇంటికి దూరంగా ఉండడం అదే మొదటిసారి. అమ్మానాన్నల దగ్గర ఉన్నప్పుడు వాళ్ల ప్రేమను ఆస్వాదిస్తూ ఉంటాం. వాళ్లకు దూరంగా ఉండడం ఎంత కష్టమో దూరంగా ఉన్నప్పుడే తెలుస్తుంది. అమ్మానాన్నల ప్రేమ ఎంత అమూల్యమైనదో తెలిసి వచ్చిన క్షణాలవి. ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగానికి వెళ్లాలనుకున్నప్పుడు అమ్మ ఒప్పుకోలేదు. మౌంటెనీరింగ్‌కీ ఒప్పుకోలేదు. అమ్మను ఒప్పిస్తే నాన్న ఆటోమేటిగ్గా ఒప్పుకుంటాడని, అమ్మను బాగా కన్విన్స్ చేశాను. ఈ టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేశాను. ఇక రక్షణరంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవడం గురించి ఒప్పించి, నాకున్న డిఫెన్స్ యూనిఫామ్ కల నెరవేర్చుకోవాలి. ఇప్పుడు ఒప్పుకుంటారనే నమ్మకం ఉంది. ఆరోహణలో అవరోధాలు కాంగ్ యాత్సే 2 పర్వతారోహణ మర్ఖా వ్యాలీ దగ్గర మొదలవుతుంది. మౌంటెనీరింగ్ బూట్స్, క్రాంపన్స్‌లలో ఐదు కేజీల బరువులుంటాయి. అవసరమైన వస్తువులతో ఇరవై కేజీల బ్యాగ్ మోస్తూ నడక మొదలవుతుంది. ఐదువేల మీటర్లు దాటిన తర్వాత బేస్‌క్యాంప్ ఉంటుంది. అక్కడి వరకు మన అన్నం, పప్పు ఉంటాయి. ఆంతకు పైకి వెళ్లే కొద్దీ అన్నం ఉడకదు, చ΄ాతీలు కాల్చడం కుదరదు. డ్రై రేషన్... అంటే డ్రై ఫ్రూట్స్, నట్స్, చాక్లెట్లు, న్యూట్రిషన్ బిస్కట్లు, ఓఆర్ఎస్ ΄్యాకెట్‌లతో ప్రయాణం కొనసాగుతుంది. నడక... నడక... ధ్యానంలాగ తదేక దీక్షతో సాగుతుంది. అడుగు పడిన చోట గట్టిగా ఉందా జారుతోందా అని మన ముందు వాళ్ల అడుగులను గమనిస్తూ వెళ్లాలి. ఈ నడక సమయంలో అనేక ఆలోచనలు వస్తాయి. ముందుకెళ్లి ఏం సాధిస్తాం, వెనక్కి వెళ్తే నష్ట΄ోయేదేముంది... అని కూడా అనిపిస్తుంది. ఆరోహణ పూర్తయ్యేటప్పటికి ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా మారుతాం. పరస్పరం సహకరించుకోవడంతో΄ాటు ఉద్వేగాలకు లోనుకాకుండా ప్రశాంతంగా ఉండడం, ఎదుటి వారు చెప్పేది శ్రద్ధగా వినే లక్షణం కూడా అలవడుతుంది. శిఖరాన్ని చేరినప్పుడు సమయం ఉదయం ఏడున్నర. సూర్యోదయం అయింది. చుట్టూ తెల్లని వలయం ఆవరించినట్లు ఉంది. వైట్ అవుట్ అంటారు. మేఘాలు ఆవరించి ఉంటాయి. పది మీటర్ల దూరాన ఉన్న మనిషి కూడా కనిపించడు. శిఖరాన్ని అధిరోహించినప్పుడు కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించగలిగినంత సాహిత్యాన్ని చదవలేదు’’ అని నవ్వుతూ ముగించింది శ్రద్ధాంజలి సాహు. మౌంటెనీరింగ్‌లో వచ్చే ఏడాది జరిగే మౌంట్ ఎవరెస్ట్ ఇంటర్నేషనల్ ఎక్స్‌పెడిషన్‌కు ఆమెకు ఆహ్వానం వచ్చింది. ఎంపిక ప్రక్రియ మొదలు కావాల్సి ఉంది. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి -
మంగళంపల్లికి తెలుగు కమ్యూనిటీ ఘననివాళి
గాన గంధర్వుడు, కర్నాటక సంగీత విద్వాంసుడు, పద్మవిభూషణ్ డాక్టర్. మంగళంపల్లి బాలమురళీకృష్ణ మృతిపై డల్లాస్ తెలుగు కమ్యూనిటీ ఘన నివాళి అర్పించింది. టెక్నాస్‌లోని ఇర్వింగ్‌లో అమరావతి ఇండియన్ రెస్టారెంట్లో నవంబర్ 22న భేటీ అయిన తెలుగు కమ్యూనిటీ ఆయనతో ఉన్న గత స్మృతులను గుర్తుచేసుకుంది. ఆయన మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని ముఖ్యంగా డల్లాస్‌లోని తెలుగు కమ్యూనిటీ ఆయనను మరచిపోలేదని టాంటెక్స్(ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం) అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ చెప్పారు. లోకల్ కమ్యూనిటీకి మురళీకృష్ణ చాలా దగ్గర వ్యక్తన్ని పేర్కొన్నారు. తన అధ్యక్ష ఎన్నికల సమయంలో టాంటెక్స్తో కలిసి తానా 2011 అక్టోబర్‌లో నిర్వహించిన సంగీత సదస్సులో బాలమురళికృష్ణ చేసిన సంగీత కచేరీ మంత్రముగ్థుల్ని చేసిందంటూ ఆయన సన్నిహిత వ్యక్తి డాక్టర్. ప్రసాద్ తోటకూర చెప్పారు. 1990లో న్యూజెర్సీ కచేరి నుంచి మురళీకృష్ణ తనకు తెలుసని, కర్నాటక మ్యూజిక్‌లో బాలమురళీకృష్ణ ఎంతో ఖ్యాతి గడించినప్పటికీ, ఆయన చాలా సాధారణ వినయపూర్వక వ్యక్తిలాగా మెలిగేవారని రావ్ కల్వాలా కొనియాడారు. ఎలాంటి సాధారణ విద్య లేనప్పటికీ, సంగీత ప్రపంచాన్ని చిరస్థాయికి తీసుకెళ్లారని, అలాంటి వ్యక్తిని మనం ఎక్కడా చూడలేమని చంద్రహాస్ మధుకురి చెప్పారు. ఆయన పేరుని, ఆయన అందించిన సంగీతాన్ని ఎప్పటికీ మరచిపోమని పేర్కొన్నారు. విజయవాడలో తన చిన్నతనం నుంచే బాలమురళీకృష్ణ తెలుసని, కర్నాటక గాయనిగా పలు సార్లు ఆయనను కలిసి, ఆశీర్వచనాలు తీసుకున్నట్టు మీనాక్షి అనిపింది గుర్తుచేసుకున్నారు. మంగళంపల్లితో ఆమెకున్న గత స్మృతులను ఈ సందర్భంగా ఆమె షేర్ చేసుకున్నారు. మంగళంపల్లి మృతికి కొద్దిసేపు మౌనం పాటించిన తెలుగు కమ్యూనిటీ, తన కుటుంబానికి సంతాపం తెలిపింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ నివాళులర్పించింది.