breaking news
Shopian town
-
షోపియాన్లో కొనసాగుతొన్న కర్ఫ్యూ
దక్షిణ కాశ్మీర్లోని షోపియాన్ పట్టణంలో విధించిన కర్ప్యూ నేడు కూడా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ బషీర్ అహ్మద్ భట్ట్ గురువారం ఇక్కడ వెల్లడించారు. పట్టణంలో ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా అదుపులో ఉన్నాయని తెలిపారు.ఈ నేపథ్యంలో కర్ఫ్యూను ఈ రోజు మధ్యాహ్నం కొద్ది సేపు సడలించే అవకాశం ఉందని తెలిపారు. అయితే పట్టణంలో విధించిన కర్ప్యూ గురువారం ఎనిమిదో రోజుకు చేరుకుంది. సెప్టెంబర్ 8, 11 తేదీల్లో జరిగిన నేపథ్యంలో షోపియాన్ పట్టణంలో నిరవధిక కర్ఫ్యూని విధించారు. ఆ రెండు ఘటనలపై ఇప్పటికే ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. -
షోపియాన్ పట్టణంలో నిరవధిక కర్ప్యూ
గగరన్ క్యాంప్ వద్ద సీఆర్పీఎఫ్ కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించడం అనంతరం జరిగిన ఆందోళనల నేపథ్యంలో షోపియాన్ పట్టణంలో నేటి నుంచి నిరవధిక కర్ఫ్యూ విధిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారి గురువారం ఇక్కడ వెల్లడించారు. మృతుడు ముహ్మద్ రాఫి రాథర్ (28)గా గుర్తించినట్లు తెలిపారు. అతడు బస్సు డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సీఆర్పీఎఫ్ కాల్పుల్లో మరో ఇద్దరు గాయపడ్డారని, వారిలో బాలిక కూడా ఉందని తెలిపారు. ఆమెకు బుల్లెట్ తగిలి గాయాలయ్యాయన్నారు. వారిరువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. ఆ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. అలాగే శుక్రవారం గగరన్ వద్ద కాల్పుల ఘటనలో నలుగురు మరణించారని, వారిలో ముగ్గురు నగర పౌరులు కాగ, ఓ తీవ్రవాది కూడా ఉన్నాడు తెలిపారు. అయితే తీవ్రవాది కాదని బీహార్ నుంచి వచ్చి అతడు ఇక్కడ జీవనం సాగిస్తున్నాడని స్థానికులు తమ దర్యాప్తులో వెల్లడించారు. కాగా తమకు అందిన సమాచారం మేరకు అతడు తీవ్రవాదీ అని రూఢీ అయిందని పేర్కొన్నారు. ఆ ఘటనపై కూడా విచారణ జరుగుతుందన్నారు. సీఆర్పీఎఫ్ కాల్పుల్లో ఓ స్థానికుడు మరణించడంతో కాశ్మీర్ వ్యాలీ, చినాబ్ వ్యాలీలతోపాటు కిష్ట్వారా, దోడ, రామ్బన్ జిల్లాల్లో గురువారం బంద్కు వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ గిలానీ పిలుపునిచ్చారు. షోపియాన్ పట్టణంలో నెలకొన్న పరిస్థితిపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బుధవారం సాయంత్రం ఉన్నతాస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.