breaking news
Shooter Vijay Kumar
-
లాక్డౌన్లో ‘లా’...
న్యూఢిల్లీ: లాక్డౌన్ కాలాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా సరదాగా గడుపుతుంటే ఒలింపిక్ రజత పతక విజేత, భారత స్టార్ షూటర్ విజయ్ కుమార్ చదువుపై దృష్టి కేంద్రీకరించాడు. 2017లో ఇండియన్ ఆర్మీ నుంచి రిటైరయ్యాక హిమాచల్‌ప్రదేశ్ పోలీసు విభాగంలో డీఎస్పీగా చేరిన విజయ్ ఈ ఖాళీ సమయాన్ని ‘లా’ చదివేందుకు వినియోగించుకుంటున్నాడు. ఆన్లైన్ తరగతుల సహాయంతో న్యాయవిద్యను అభ్యసిస్తున్నట్లు విజయ్ తెలిపాడు. ‘డీఎస్పీ ట్రెయినింగ్‌లో భాగంగా శారీరక వ్యాయామాలు, న్యాయవిద్య తరగతులకు హాజరు కావాల్సి ఉంది. కానీ లాక్డౌన్ కారణంగా డోరాలోని ట్రెయినింగ్ సెంటర్లో జరగాల్సిన శారీరక శిక్షణ వాయిదా పడింది. కానీ ఆన్లైన్లో ‘లా’ తరగతులకు హాజరు అవుతున్నా’ అని 34 ఏళ్ల విజయ్ కుమార్ తెలిపాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ షూటింగ్ ఈవెంట్లో విజయ్ రజతం సాధించాడు. -
విజయ్ కుమార్ విఫలం
గ్లాస్గో: భారత షూటర్, ఒలింపిక్ కాంస్య పతాక విజేత విజయ్ కుమార్ 20వ కామన్వెల్త్ గేమ్స్ లో నిరాశపరిచాడు. 25 మీటర్ల రాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్ లో ఫైనల్ రౌండ్ కు అర్హత సాధించకుండానే వెనుదిరిగాడు. రెండు క్వాలిఫైయింగ్ రౌండ్లలో 555 పాయింట్లు సాధించి ఏడో స్థానంలో నిలిచాడు. మొదటి ఆరు స్థానాల్లో నిలిచిన వారు మాత్రమే ఫైనల్ రౌండ్ లో అడుగుపెడతారు. మరో భారత షూటర్ హర్‌ప్రీత్ సింగ్ 14 హిట్స్ తో 573 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియి షూటర్లు బ్రూస్ క్విక్(572), డేవిడ్ జే చాప్మన్(568) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.