breaking news
Shechalam forest
-
శేషాచల కొండల్లో అగ్నిప్రమాదం
-
శేషాచలంలో పోలీసులపై ‘ఎర్ర’ కూలీల దాడి
* తుంబురుతీర్థం మార్గంలో ఎనిమిది మంది కూలీల లొంగుబాటు * రూ.30 లక్షల విలువైన 20 దుంగల స్వాధీనం సాక్షి, తిరుమల : తిరుమల శేషాచలంలో శనివారం రెండు వేర్వేరు ఘటనల్లో ఎర్ర కూలీలు పోలీసులపై దాడులకు తెగబడ్డారు. ఈ సందర్భంగా కొందరు లొంగిపోగా మరికొందరు పరారయ్యారు. తుంబురు తీర్థం మార్గంలో.. తిరుమలలోని పాపవినాశం డ్యామ్ నుంచి ఉత్తరదిశలోని తుంబురు తీర్థం మార్గంలో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతోందన్న సమాచారంతో శనివారం టూటౌన్ పోలీసులు అక్కడికి వెళ్లారు. పోలీసులను చూసిన కూలీలు వారిపై రాళ్ల దాడికి దిగారు. ఎస్ఐ వెంకట్రమణ తన పిస్తోల్‌ను బయటకు తీయడంతో ఎనిమిది మంది కూలీలు లొంగిపోయారు. వారి నుంచి 300కిలోల బరువుగల 9 మేలిమి రకానికి చెందిన ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.20 లక్షలు ఉంటుందని సీఐ రామలింగం తెలిపారు. లొంగిపోయిన వారిలో తమిళనాడుకు చెందిన సుందర్ (18), చంద్రశేఖర్ (18), తిరుపతి (18), దొరై (28), తంగరాజు (30), అశోక్ (28), కుమార్(28), శంకర్ (30) ఉన్నారు. కేపీ డ్యామ్.. మామిళ్లమంద ప్రాంతంలో.. తిరుమలలోని కేపీ డ్యామ్, మామిళ్ల మంద ప్రాంతంలో టాస్క్ఫోర్సు, అటవీశాఖ సిబ్బంది శుక్రవారం రాత్రి నుంచి కూంబింగ్ చేపట్టారు. శనివారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను తీసుకెళుతున్న కూలీలను గమనించారు. వారిని పట్టుకునేందుకు టాస్క్ఫోర్సు సిబ్బంది ప్రయత్నించగా రాళ్లు, ఆయుధాలతో దాడికి ప్రయత్నించి అడవిలోకి పారిపోయారు. కూలీలు వాడిన ఆయుధాలు, రూ.10 లక్షల విలువ కలిగిన 11 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్టు టాస్క్ఫోర్సు ఆర్ఎస్ఐ లక్ష్మణ్, డీఆర్వో వెంకటస్వామి తెలిపారు. -
ఆ ముగ్గురి వాంగ్మూలాలు తీసుకోండి
-
ఆ ముగ్గురు సాక్షుల వాంగ్మూలాలను నమోదుచేయండి
సాక్షి, హైదరాబాద్: శేషాచలం అడవుల్లో జరిగిన ఎర్ర చందనం కూలీల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి హైకోర్టులో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. బస్సులో వెళుతున్న కూలీలను పట్టుకొచ్చి ఎన్కౌంటర్లో కాల్చి చంపారన్న ఆరోపణల నేపథ్యంలో, బస్సులో మిగిలిన కూలీలతో పాటు ఉండి పోలీసులకు చిక్కకుండా తప్పికుంచుకున్న ముగ్గురు కూలీల వాంగ్మూలాల నమోదుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయవాది సమక్షంలో వారి వాంగ్మూలాలను నమోదు చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు నేతృత్వం వహిస్తున్న అధికారికి స్పష్టం చేసింది. తరువాత ఆ వాంగ్మూలాలను తమ ముందుంచాలంటూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. తమిళనాడు వచ్చే ఈ ముగ్గురు సాక్షుల వాంగ్మూలాలు తిరుపతిలో నమోదు చేయాలని, ఈ సందర్భంగా వారికి తగిన భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. బస్సులో వెళుతున్న వారిని పట్టుకుని వచ్చుంటే ఇది ఖచ్చితంగా బూటకపు ఎన్‌కౌంటరే అవుతుందని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. బస్సులో వెళుతున్న వారిని పట్టుకొచ్చారా లేదా అన్న విషయాన్ని తెలుసుకునేందుకే ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న ఆ ముగ్గురు వాంగ్మూలాల నమోదుకు ఆదేశాలు ఇస్తున్నామని ధర్మాసనం తెలిపింది. ఎర్ర చందనం కూలీల ఎన్‌కౌంటర్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని, అలాగే మృతులకు రీపోస్టుమార్టం నిర్వహించాలంటూ ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం, బాధిత కుటుంబ సభ్యులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలను పలుమార్లు విచారించిన ధర్మాసనం, గత విచారణ సమయంలో ఈ కేసు దర్యాప్తును 60 రోజుల్లో పూర్తి చేయాలని సిట్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే. శనివారంతో 60 రోజుల గడువు పూర్తయిన నేపథ్యంలో తాజాగా ఈ వ్యాజ్యాలు సోమవారం విచారణకు వచ్చాయి. వీటిని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ కేసుకు సంబంధించి తాము ఇప్పటి వరకు ఏం చేశాం.. ఇక ఏం చేయాలని భావిస్తున్నాం.. తదితర వివరాలను పొందుపరుస్తూ ఓ నివేదికను అదనపు అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టుకు సమర్పించారు. వీటిని పరిగణనలోకి తీసుకుని దర్యాప్తును పూర్తి చేసేందుకు తమకు మరింత గడువునివ్వాలని ధర్మాసనాన్ని కోరారు. ఈ సమయంలో పిటిషనర్ల తరఫు న్యాయవాది రఘునాథ్ జోక్యం చేసుకుంటూ, ఎన్‌కౌంటర్‌పై ప్రత్యేక ధర్యాప్తు బృందం (సిట్)ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఇందులో ఎన్కౌంటర్లో చనిపోయిన కూలీలపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల గురించిన ప్రస్తావనే ఉందే తప్ప, కూలీలను కూల్చి చంపిన ఘటనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ గురించిన ప్రస్తావన లేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో సిట్ ఏర్పాటు జీవోను పరిశీలించిన ధర్మాసనం, కూలీల ఎన్‌కౌంటర్‌పై నమోదైన ఎఫ్ఐఆర్ గురించి ప్రస్తావన లేకపోవడంపై అదనపు ఏజీని ప్రశ్నించింది. ఎన్కౌంటర్ ఎఫ్ఐఆర్ ప్రస్తావన లేకపోయినా కూడా మూడు కేసుల్లోనూ సిట్ దర్యాప్తు చేస్తుందని శ్రీనివాస్ సమాధానమిచ్చారు. అసలు ఈ ఘటనకు ఎవరైనా ప్రత్యక్ష సాక్షులున్నారా..? అని ధర్మాసనం ప్రశ్నించగా, ఎన్కౌంటర్ జరిగినప్పుడు చూసిన వారెవ్వరూ లేరని రఘునాథ్ తెలిపారు. అయితే ఎన్కౌంటర్లో మృతి చెందిన కూలీలు బస్సులో వెళుతున్నప్పుడు వారిని పోలీసులు పట్టుకుని వచ్చి కాల్చి చంపారని, బస్సులో మిగిలిన కూలీలతో ఉన్న వారిలో ముగ్గురు తప్పించుకున్నారని. వెనుక ఆడవాళ్ల పక్కన కూర్చోవడంతో బతికిపోయారని వివరించారు. అయితే వారి వాంగ్మూలాలను నమోదు చేశారా..? అని ధర్మాసనం అదనపు ఏజీని ప్రశ్నించింది. లేదని, విచారణకు వారు సహకరించడం లేదని చెప్పడంతో, అయితే వారిని వాంగ్మూలాలు ఇవ్వాలని ఆదేశాలిస్తామని స్పష్టం చేసింది. బస్సులో నుంచి పట్టుకొచ్చారన్న ఆరోపణలు నిజమైతే, ఇది ఖచ్చితంగా బూటకపు ఎన్‌కౌంటరే అవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఓ న్యాయవాది సమక్షంలో వారి వాంగ్మూలాలను నమోదు చేయాలని, వాంగ్మూలాల నమోదు సమయంలో ఆ న్యాయవాది ఏ విధంగా జోక్యం చేసుకోరాదని తేల్చి చెప్పింది. నమోదు చేసిన వాంగ్మూలాలను తమ ముందుంచాలంటూ విచారణను జూలై 6కు వాయిదా వేసింది.