పబ్లిక్ క్లబ్లో షటిల్ కోర్టు ప్రారంభం
సూర్యాపేటటౌన్ : అత్యాధునిక హంగులతో పట్టణంలోని పబ్లిక్ క్లబ్లో నిర్మించిన ఉడెన్ షటిల్ కోర్టును సోమవారం క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ. 42లక్షలతో జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా షటిల్ కోర్టును నిర్మించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు యాదేశ్వర్రావు, కార్యవర్గ సభ్యులు రవి, శ్రీనివాసరావు, కేశవరెడ్డి, శంకర్‌రెడ్డి, బాబు, సయ్యద్‌సలీం, గోపాల్‌రావు, భీష్మారెడ్డి, చకిలం రాజేశ్వర్‌రావు, బైరు వెంకన్నగౌడ్, గోపగాని వెంకటనారాయణగౌడ్, అబ్దుల్‌రహీం, అయూబ్‌ఖాన్, అంజద్‌అలీ, చెంచల శ్రీను, తోట శ్యాం, స్వామినాయుడు, షేక్ జహీర్, ఆలేటి మాణిక్యం, ఎన్.దశరథ తదితరులు పాల్గొన్నారు.