breaking news
shashavali
-
కలహాలకు నిండు ప్రాణం బలి
- భర్త మృతితో భార్య మనస్తాపం - పురుగుమందు తాగి తనూ ఆత్మహత్యాయత్నం కుటుంబ కలహాలు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. భార్యాభర్తల మధ్య చిన్నపాటి ఘర్షణలు చినికి చినికి గాలివానలా మారాయి. జీవితంపై విరక్తి చెందిన భర్త ఆత్మహత్య చేసుకోగా.. మనస్తాపానికి గురైన భార్య కూడా పురుగుమందు తాగి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ సంఘటన తాడిపత్రిలో మంగళవారం చోటు చేసుకుంది. - తాడిపత్రి టౌన్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుడు షాషావలీ (30) కుటుంబాల కలహాలతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. భర్త మృతితో మనస్థాపం చెంది భార్య రమీజాబీ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన పట్టణంలోని చేనేత కాలనీలో మంగళవారం చోటు చేసుకుంది. రమీజాబీ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పట్టణ సీఐ రామకృష్ణారెడ్డి వివరాల మేరకు పట్టణంలోని చేనేత కాలనీకి చెందిన షాషావలీకి కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రమీజాబీకి నాలుగేళ్ల క్రితం వివాహైంది. వీరికి కౌషర్ రెండేళ్ల పాప ఉంది. షాషావలీ ప్రైవేట్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రమీజా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈనేపథ్యంలో భార్యాభర్తలు ఇరువురూ తరచూ ఘర్షణ పడేవారు. రమీజా గతంలో రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మంగళవారం కూడా భార్యాభర్తలు ఘర్షణ పడ్డారు. దీంతో షాషావలీ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే షాషావలి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మనస్థాపంతో భార్య రమీజ భర్త తాగి వదిలేసిన పురుగుల మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడింది. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ రామకృష్ణారెడ్డి తెలిపారు. -
భార్య హత్యకేసులో అరెస్టు
తాడిపత్రి : పట్టణంలోని శాస్త్రినగర్లో నివాసం ఉంటున్న చాందిని అనే వివాహిత హత్య కేసులో ఆమె భర్త షాషావలిని మంగళవారం అరెస్ట్ చేసినట్లు పట్టణ సీఐ రామకృష్ణారెడ్డి తెలిపారు. 2015 మార్చి 18వ తేదీన భార్యకు నిప్పటించిన కేసులో షాషావలి పరారీలో ఉన్నాడు. అప్పట్లో› కేసునమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఎట్టకేలకు మంగళవారం అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.