భార్య హత్యకేసులో అరెస్టు | husband arrest of wife murder case | Sakshi
Sakshi News home page

భార్య హత్యకేసులో అరెస్టు

Nov 22 2016 11:20 PM | Updated on Sep 4 2017 8:49 PM

పట్టణంలోని శాస్త్రినగర్‌లో నివాసం ఉంటున్న చాందిని అనే వివాహిత హత్య కేసులో ఆమె భర్త షాషావలిని మంగళవారం అరెస్ట్‌ చేసినట్లు పట్టణ సీఐ రామకృష్ణారెడ్డి తెలిపారు.

తాడిపత్రి : పట్టణంలోని శాస్త్రినగర్‌లో నివాసం ఉంటున్న చాందిని అనే వివాహిత హత్య కేసులో ఆమె భర్త షాషావలిని మంగళవారం అరెస్ట్‌ చేసినట్లు పట్టణ సీఐ రామకృష్ణారెడ్డి తెలిపారు. 2015 మార్చి 18వ తేదీన భార్యకు నిప్పటించిన కేసులో షాషావలి పరారీలో ఉన్నాడు. అప్పట్లో› కేసునమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఎట్టకేలకు మంగళవారం అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement