శంషాబాద్ లో 700 గ్రాముల బంగారం పట్టివేత
శంషాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో బుధవారం ఉదయం ఇద్దరు ప్రయాణికుల నుంచి 700 గ్రాముల బంగారం బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఇద్దరు ప్రయాణికులు వస్త్రాల లోపల బంగారం బిస్కెట్లను దాచుకుని వస్తుండగా స్కానింగ్‌లో విషయం బయట పడింది. బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇద్దరు ప్రయాణికుల్ని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.