breaking news
shantha kumar
-
అమ్మ ప్రేమకు ప్రతిరూపం
కొవ్వూరు రూరల్ : అమ్మ.. అంటేనే త్యాగం. ఈ మాటకు నిలువెత్తు నిదర్శనం శాంతకుమారి. తనకు ఎంతో ఇష్టమయిన పిన్నికూతురు (వరుసకు అక్క) ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలో ఆమెకున్న ఇద్దరు పిల్లలూ అనాథలుగా మిగిలారు. అంతే క్షణం ఆలోచించకుండా ఆమె వారిని అక్కున చేర్చుకుంది. సమాజం ఏమనుకున్నా ఫర్వాలేదనుకుని.. పెళ్లి కాకుండానే తల్లిగా మారింది. ‘అమ్మ’.. అన్న ఆ పిల్లల పిలుపులోనే సంతోషాన్ని వెతుక్కుంటూ 16 ఏళ్లు గడిపేసింది. పిల్లలే సర్వస్వంగా జీవిస్తోన్న ఆ మహిళ వివరాలు ఆమె మాటల్లోనే.. ‘నా పేరు నేతుల శాంతకుమారి. మాది కొవ్వూరు మండలం మద్దూరు. నేను ప్రస్తుతం గ్రామంలోనే అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్నాను. మా తల్లిదండ్రులు నేతుల రూతమ్మ, గమరిఏలు. నాన్న దైవసేవ చేసేవారు. ఈ క్రమంలో మా పిన్ని కూతురు రాణికి మద్దూరులోనే సంబంధం చూసి అమ్మా నాన్న పెళ్లి చేశారు. వారి సంసారం సుమారు ఐదేళ్లు సాఫీగానే సాగింది. వారికి ఇద్దరు పిల్లలు కలిగారు. కొన్ని కారణాలతో మా అక్క రాణి 16 ఏళ్ల క్రితం కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. అప్పటికి వారి పిల్లలు దివ్యతేజకు మూడేళ్లు, రాజబాబుకు 6 నెలలు. తండ్రి పిల్లలను పట్టించుకోలేదు. అప్పటికి సమారు నాకు 22 ఏళ్లు. అక్క రాణి నాతో చాలా బాగా ఉండేది. ఇద్దరం ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్లం. ఆ ప్రేమతోనే నేను అక్క పిల్లలను చేరదీశాను. అప్పుడే అంగన్వాడీలో టీచర్ ఉద్యోగం వచ్చింది. దాంతో ఆ పిల్లలే జీవితం అనుకున్నాను. ఈ క్రమంలో పెళ్లి ప్రసక్తి పక్కన బెట్టాను. ఇంట్లో ఎవరూ వత్తిడి చేయకపోయినా, బంధువులు, స్నేహితులు పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చారు. అయినా నేను పిల్లలే లోకం అనుకున్నాను. ఇప్పుడు రాజబాబుకు 17 ఏళ్లు. మద్దూరు హైస్కూలులో 10వ తరగతి చదువుతున్నాడు. కూతురు దివ్యతేజ 10వ తరగతి వరకూ చదివి ఆపేసింది. వాళ్లే నా సర్వస్వం.. నాకు వాళ్లను చూస్తుంటే నా పిల్లలుగానే అనిపిస్తారు. వాళ్లూ అలానే ఉంటారు. అందుకే ఎప్పుడూ పెళ్లి చేసుకోకుండా జీవితాన్ని త్యాగం చేశానని అనిపించదు. కంటేనే తల్లి అనుకుంటే ఎలా.. మనసు ఉంటే ఎవరైనా మన పిల్లలే.. నా శక్తి మేరకు వాళ్ల కోసం ఇంకా కష్టపడతాను.’ -
ఎట్టకేలకు
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని ఎట్టకేలకు మెడికల్ కళాశాలకు అనుసంధానం చేయనున్నారు. ప్రస్తుతం ఈ ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యవిధాన పరిషత్ సిబ్బందిని బోధన్ ఆస్పత్రికి తరలించనున్నారు. వచ్చే ఏడాది జనవరి ఒకటిలోగా ఆస్పత్రిని మెడికల్ కళాశాలకు అనుసంధానం చేయాలని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ సహానీ డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ), ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన పరిషత్ (ఏపీవీపీ) ఉన్నతాధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రి అనుసంధానం వేగంగా చేపట్టాలని సూచించారు. ఇప్పటికే ఆలస్యం అయ్యింద నీ, రోగులకు ఇబ్బందులు కలుగుతున్నందున ఆస్ప త్రి మార్పుపై దృష్టి పెట్టాలన్నారు. దీనికి సంబంధించిన విధివిధాలను వివరించారు. మెడికల్ కళాశాలకు అవసరమైన వైద్య సిబ్బంది, వైద్యులు, పరిపాల న వ్యవహారాలకు సంబంధించి ఉద్యోగులను నియమించాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరి యా ఆస్పత్రులకు చెందిన వైద్య సిబ్బందిని కళాశాల కు బదిలీ చేయాలన్నారు. దశలవారీగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. కొత్తగా నిర్మించిన భవనాలను, వివిధ విభాగాలను స్వాధీనం చేసుకోవాలని ఆదే శించారు. దీంతో 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జిల్లాకు మంజూరు చేసిన కళాశాలకు తుది రూపం వస్తోంది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతితో ఈ ఏడాది జూన్‌లో వైద్య కళాశాలలో మొదటి బ్యాచ్ ప్రారంభమైన విషయం తెలి సిందే! ఇక మెరుగైన వైద్య సేవలు ఆస్పత్రి వైద్యకళాశాల పరిధిలోకి వెళ్తే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందే అవకాశముంది. 123 మంది నిపుణులైన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, వివిధ విభాగాలకు నిపుణులైన టెక్నికల్ సిబ్బంది అందుబాటులోకి వస్తారు. దీంతో అత్యవసర సేవలు, దీర్ఘకాలి క వ్యాధులకు వైద్యం అందే అవకాశం ఉంది. రోజూ ఆస్పత్రికి వచ్చే 700 మంది అవుట్ పేషెంట్లు, 550 ఇన్ పేషెంట్లకు ఇబ్బంది లేకుండా సేవలు అందుతా యి. పరిపాలనలో విభాగంలోకి ముగ్గురేసి సూపరిం టెండెంట్లు, ఆర్‌ఎంఓలు, నర్సింగ్ సూపరింటెండెంట్లు వస్తారు. పర్యవేక్షణ పెరిగి వైద్యసేవలు అందుతాయి. వైద్యులు షిప్టులవారీగా రోగులకు అందుబాటులో ఉంటారు. జనవరిలోగా మార్పు చేస్తాం -శాంతకుమార్, డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆస్పత్రిని జనవరిలోగా మార్పు చేస్తాం. ఈ మేరకు వైద్యవిధాన పరిషత్, డీఎంఈ అధికారులకు ఆదేశా లు అందాయి. ఈ ప్రక్రియ అమలుకు కృషి చేస్తున్నాం. పరిపాలన వ్యవహారాలు, వైద్యులు, సిబ్బంది ఇతర పనుల మార్పులు, కేటాయింపులను పరిశీలిస్తున్నాం.