breaking news
Severe rainfall
-
Telangana: కొత్త బోర్లు బంద్.. ఉల్లంఘిస్తే భారీ జరిమానా!
సాక్షి, హైదరాబాద్: తీవ్ర వర్షాభావం రీత్యా భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతున్నాయి. క్యూర్ పరిధిలో అపార్టుమెంట్లలోని బోర్లు మొరాయిస్తున్నాయి. వచ్చే రుతుపవనాల వరకు ఉన్న 8 నెలలు అత్యంత కీలకం. దీంతో అధికార యంత్రాంగం నీటి వృథాపై చర్యలకు దిగింది. కొత్త బోర్ల తవ్వకాలపై నిషేధం విధించింది. విషయంలో క్షేత్రస్థాయి తనిఖీలకూ సిద్ధమైంది. నిర్మాణ రంగానికి శుద్ధి చేసిన నీటి వినియోగాన్ని తప్పనిసరి చేసింది. ఈ ఆంక్షలు తాగునీటికే కాక నిర్మాణాలు, ఇతర అవసరాలకు వర్తిస్తాయి.రోజుకు 200 పైనే తవ్వకం.. క్యూర్లో సుమారు 13 నుంచి 15 లక్షలకు పైగా బోర్లున్నాయని అంచనా. రికార్డుల్లో మాత్రం 2.43 లక్షల బోర్లే. నిబంధనలకు విరుద్ధంగా రోజుకు సగటున 200పైగా కొత్త బోర్ల తవ్వకాలు జరుగుతున్నాయని సమాచారం. రోజుకు 100 బోర్లు ఎండిపోతున్నాయి. కొండాపూర్, బంజారాహిల్స్, బండ్లగూడ జాగీర్ వంటి ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్‌వాసులు 400 అడుగుల పరిమితిని దాటి తవ్వుతున్నారు. కొన్నిచోట్ల వెయ్యి అడుగులకు మించుతున్నారు. ఫలితంగా భూగర్భ జలాల వినియోగం 102 శాతానికి చేరింది. నేలలోకి చేరుతున్న నీటి కంటే ఎక్కువ తోడేస్తుండడంతో భూగర్భ జల లభ్యత ‘క్రిటికల్’గా ఉన్నట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. –భూగర్భ జల పరిరక్షణకు నీరు–భూమి–చెట్టు చట్టం (వాల్టా) పకడ్బందీ అమలుకు యంత్రాంగం సిద్ధమైంది. సొంతంగా బోరు వేసుకోవాలన్నా రెవెన్యూ శాఖ అనుమతి తప్పనిసరి. 400 అడుగుల పరిమితి ఉంది. కానీ, 500–1,500 అడుగుల వరకు తవ్వుతున్నారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్, భూగర్భ జల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఉల్లంఘనులపై కేసులు నమోదు చేయడంతో పాటు రూ.5 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానాలు విధించే అవకాశం ఉంది. -
88 ఏళ్ల రికార్డు బ్రేక్
♦ 1927 సెప్టెంబరు 15న 36.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు ♦ ఆ తరవాత గురువారమే (సెప్టెంబరు 3న) 36.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు సాక్షి, హైదరాబాద్ : ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా 88 ఏళ్ల తరవాత రాజధానిలో వర్షాకాలంలోనూ రికార్డు ఉష్ణోగ్రత నమోదైంది. గురువారం గరిష్టంగా 36.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం విశేషం. గతంలో 1927 సెప్టెంబరు 15న 36.1 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తరవాత ఇప్పుడే ఈ స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైనట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. తీవ్ర వర్షాభావం, పొడి వాతావరణ పరిస్థితుల వల్లే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వాతావరణ కేంద్రం డెరైక్టర్ వెకై రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. మరో 48 గంటల్లో ఉపరితల ద్రోణి ప్రభావంతో హైదరాబాద్‌తోపాటు తెలంగాణ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని అన్నారు.


