breaking news
server injured
-
పీఎన్బీ ఖాతాదారులకు షాక్... 18 కోట్ల మంది డేటా లీక్ ?
Punjab National Bank server exposed customer data : ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సర్వర్‌లోని (పీఎన్బీ) ఒక లోపం కారణంగా సుమారు 18 కోట్ల మంది కస్టమర్ల వ్యక్తిగత, ఆర్థిక వివరాలు బహిర్గతమయ్యే పరిస్థితి ఏర్పడిందని సైబర్ సెక్యూరిటీ సంస్థ సైబర్ఎక్స్9 వెల్లడించింది. సుమారు ఏడు నెలల పాటు ఇలాంటి పరిస్థితి కొనసాగిందని వివరించింది. అడ్మినిస్ట్రేషన్ అధికారాలతో పీఎన్బీకి చెందిన మొత్తం డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థను బైటి వ్యక్తులు అందుబాటులోకి తెచ్చుకునేందుకు దోహదపడేలా ఈ లోపం ఉందని పేర్కొంది. దీన్ని తాము గుర్తించి సైబర్ సెక్యూరిటీ ప్రాధికార సంస్థలు సీఈఆర్టీ–ఇన్, ఎన్సీఐఐపీసీ ద్వారా హెచ్చరించిన తర్వాత, పీఎన్బీ లోపాన్ని సరిదిద్దిందని సైబర్ఎక్స్9 వ్యవస్థాపకుడు హిమాంశు పాఠక్ తెలిపారు. మరోవైపు, లోపం ఉన్న మాట వాస్తవమేనని నిర్ధారించినప్పటికీ దీని వల్ల కీలకమైన డేటా ఏదీ బైటికి పోలేదని బ్యాంక్ తెలిపింది. - న్యూఢిల్లీ -
ఎస్సై రివాల్వర్ మిస్ ఫైర్.. సర్వర్‌కు గాయాలు
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో ఎస్ఐ రివాల్వర్ మిస్ ఫైర్ అయిన సంఘటనలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఉన్నాయి. కరీంనగర్ జిల్లా రాయికల్ ఎస్సై రాములు నాయక్‌తో పాటు జిల్లాకు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు నిర్మల్‌లోని మయూరి హోటల్‌కు విందుకు వెళ్లారు. రాములు నాయక్ రివాల్వర్ కిందపడటంతో మిస్ ఫైర్ అయ్యింది. ఈ ప్రమాదంలో హోటల్లో పనిచేసే సర్వర్‌కు గాయాలయ్యాయి.