breaking news
sensitive
-
పాకిస్థాన్ వ్యవస్థలకు డిజిటల్ షాక్!
సరిహద్దుల్లో కవ్వింపులకు దిగుతూ, భారత్‌పై పదే పదే విషం చిమ్మే పాకిస్థాన్‌కు ఇప్పుడు దాని సొంత వ్యవస్థలోనే పెద్ద ఎదురుదెబ్బ తగులుతోంది. దేశంలోని కీలకమైన ప్రభుత్వ సంస్థల డేటా లీక్ అయినట్లు ‘ఇండియన్ సైబర్ ఫోర్స్’ (Indian Cyber Force) అనే హ్యాకింగ్ గ్రూప్ ప్రకటించింది. ఈ హ్యాకింగ్‌కు సంబంధించిన వివరాలు కూడా బహిరంగంగా వెల్లడిస్తోంది. పాకిస్థాన్ ప్రభుత్వ వ్యవస్థల్లో ఉన్న బలహీనతలు, నిర్లక్ష్య వైఖరిని ఈ ఘటన ఎత్తిచూపుతోంది. భారత సైబర్ నిపుణుల ధాటికి పాకిస్థాన్ ప్రభుత్వ సంస్థల గోప్యత అల్లకల్లోలం అవుతోంది.ఏమేమి లీక్ అయ్యాయి?‘ఇండియన్ సైబర్ ఫోర్స్’(ICF) అందించిన వివరాల ప్రకారం, ఈ హ్యాకింగ్ ఆపరేషన్‌లో పాకిస్థాన్‌కు చెందిన పలు కీలక విభాగాల నుంచి భారీ మొత్తంలో సమాచారం లీక్ అయింది. ఇది కేవలం ఒక సర్వర్ హ్యాక్ కావడం కాదు, ఆ దేశ వ్యవస్థాగత భద్రతపై జరిగిన డిజిటల్ దాడి.పోలీసు రికార్డులు, పాస్‌పోర్ట్ డేటా: పౌరుల వ్యక్తిగత, గోప్యమైన సమాచారం, పోలీసు రికార్డు వెరిఫికేషన్ డేటా (2.2 జీబీ), పాస్‌పోర్ట్ వివరాలు బహిర్గతమయ్యాయి.Pakistan Railway Employee Data (name, father name, mother name, employee, cnic, address ) & Land Management(name, father name, mother name, shop name, cnic, address ) Data Breached! (Maintenance system)Remember the name "Indian Cyber Force" #PakistanRailwayHacked… pic.twitter.com/kWR1eF5srZ— Indian Cyber Force (@CyberForceX) November 20, 2025ఆర్థిక డేటా: ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ (FBR) ఐరిస్ పోర్టల్ నుంచి 150 జీబీకి పైగా డేటా లీక్ అయింది. ఇందులో పౌరుల CNIC (జాతీయ ఐడీలు), పేర్లు, ఫోన్ నంబర్లు, చిరునామాలు, అత్యంత గోప్యమైన ట్యాక్స్ రికార్డులు ఉన్నాయి.Police Record Verification Data OF Pakistan Breached! 2.2 GB Data Le*akedIncluded: Passports, Electricity Bills etc Greetz to: solveig#IndianCyberForce#OperationHuntDownPorkies pic.twitter.com/Z4NtYVl2ZB— Indian Cyber Force (@CyberForceX) November 19, 2025రైల్వే: పాకిస్థాన్ రైల్వే ఉద్యోగుల వివరాలు (పేరు, తల్లిదండ్రుల పేర్లు, CNIC, చిరునామా), ల్యాండ్ మేనేజ్మెంట్ (భూమి నిర్వహణ) డేటా లీక్ అయ్యింది.విద్యుత్తు, ఫార్మసీ: విద్యుత్ బిల్లుల సమాచారం, నెక్స్ట్ ఫార్మాస్యూటికల్స్ వంటి ఫార్మసీ కంపెనీల నుంచి 24 జీబీకి పైగా సున్నితమైన డేటా (బ్యాంకు ఖాతాలు, ప్రైవేట్ ఈమెయిల్స్, పాస్వర్డ్లు) బహిర్గతమైంది.We have breached Pakistan Pharmacy Company, Next Pharmaceutical pk 24 GB+ data exfiltrated. Exposes: Company name, Bank Account, Private Emails, Passwords, Documents Check: https://t.co/fL4C6GJPNW#IndianCyberForce pic.twitter.com/TqXG4Ag4KR— Indian Cyber Force (@CyberForceX) November 5, 2025విద్య: టెక్నికల్ ఎడ్యుకేషన్, ఒకేషనల్ ట్రైనింగ్ అథారిటీ (TEVTA) సైట్ కూడా హ్యాక్ చేశారు.ఆపరేషన్ సింధూర్-ర్యాన్సమ్వేర్ దాడి: ఈ బృందం ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్ అధికారిక వెబ్సైట్ల సర్వర్లపై రాన్సమ్వేర్ దాడిని కూడా నిర్వహించినట్లు ప్రకటించింది. సిస్టమ్‌లను ఎన్‌క్రిప్ట్ చేసినప్పటికీ దాని తీవ్రతను గోప్యంగా ఉంచింది.వ్యవస్థల నిర్లక్ష్యం: పాకిస్థాన్ వైఫల్యంఈ భారీ డేటా ఉల్లంఘన పాకిస్థాన్ ప్రభుత్వ సంస్థల డిజిటల్ భద్రతా వైఫల్యాన్ని స్పష్టం చేస్తోంది. CNICలు(జాతీయ ఐడీలు), పన్ను రికార్డులు, పోలీసు డేటా వంటి అత్యంత సున్నితమైన సమాచారాన్ని భద్రపరచడంలో పాకిస్థాన్ ప్రభుత్వ సంస్థలు కనీస భద్రతా ప్రమాణాలను పాటించలేదన్నది బహిరంగ రహస్యం.ఆర్థిక అనిశ్చితి ప్రభావంఆర్థికంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్న పాకిస్థాన్ సైబర్ భద్రతా మౌలిక సదుపాయాలపై తగినంత పెట్టుబడి పెట్టడం లేదు. వ్యవస్థలను అప్డేట్ చేయకపోవడం, నిపుణులను నియమించకపోవడం వంటి నిర్లక్ష్యం కారణంగానే ఈ వ్యవస్థలు హ్యాకర్లకు లక్ష్యాలుగా మారుతున్నాయి.పౌరుల గోప్యతకు ప్రమాదంఈ లీక్‌ల ద్వారా పాకిస్థాన్ పౌరుల వ్యక్తిగత వివరాలు, ఆర్థిక సమాచారం, వారి గుర్తింపు కార్డుల డేటా అంతా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లింది. ఇది ఐడెంటిటీ థెఫ్ట్, ఆర్థిక మోసాలు, పౌరుల పట్ల శత్రు దేశాల గూఢచర్య కార్యకలాపాలకు సులభతరం చేసే అవకాశం ఉంది. ఇండియన్ సైబర్ ఫోర్స్ జరిపిన ఈ దాడి భారత సైబర్ నిపుణుల బలం, సామర్థ్యాన్ని చాటుతోంది. భారత్ పట్ల పాకిస్థాన్ కవ్వింపులకు దిగితే, సరిహద్దుల్లోనే కాకుండా డిజిటల్ వేదికపై కూడా దీటైన సమాధానం ఇవ్వగలదని ఈ సంఘటన రుజువు చేసింది.ఈ ఆపరేషన్ పాకిస్థాన్ వ్యవస్థాగత బలహీనతలకు హెచ్చరిక. నిత్యం భారత్‌పై ద్వేషాన్ని పెంచి పోషిస్తూ, ఉగ్రవాదానికి ఆశ్రయం ఇస్తున్న పాకిస్థాన్.. తమ సొంత దేశ పౌరుల అత్యంత గోప్యమైన డేటాను కూడా కాపాడుకోలేకపోవడం ఆ దేశ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట. భారత్ తనపై జరుగుతున్న ప్రతి దాడికి భౌతికంగానే కాకుండా, డిజిటల్ రంగంలో కూడా గట్టి సమాధానం ఇవ్వగలదనే సంకేతాన్ని పంపుతుంది.ఇదీ చదవండి: జీవిత బీమా వెనుక భారీ సంపద రహస్యం -
టైగర్ రిజర్వుల చుట్టూ ఈఎస్జెడ్లు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న టైగర్ రిజర్వుల పరిరక్షణకు సంబంధించి సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. టైగర్ రిజర్వుల చుట్టూ ఉన్న ప్రాంతాన్ని సున్నిత పర్యావరణ జోన్లు(ఈఎస్‌జెడ్)లుగా ప్రకటించాలని, బఫర్ జోన్లలో కిలోమీటర్ పరిధిలో మైనింగ్ కార్యకలాపాలపై పూర్తి నిషేధం విధించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.ఏడాదిలోగా వీటిని అమలు చేయాలని స్పష్టం చేసింది. జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వులో అక్రమంగా చెట్ల నరికివేత, నిర్మాణ పనుల కారణంగా జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు చర్యలు తీసుకోవాలని, అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని ఉత్తరఖాండ్ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ సారథ్యంలోని ధర్మాసనం 80 పేజీల తీర్పు వెలువరించింది. జిమ్ కార్బెట్కు తీవ్ర నష్టం టైగర్ రిజర్వుల్లో పర్యావరణ ఉల్లంఘనలు, నష్టం తీవ్రత, పునరుద్ధరణ చర్యలతోపాటు ప్రఖ్యాత జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వులో జరిగిన విధ్వంసానికి బాధ్యులైన అధికారుల గుర్తింపు తదితరాలపై 2024 మార్చిలో నియమించిన నిపుణుల కమిటీ తాజాగా ఇచి్చన నివేదికను ధర్మాసనం ఆమోదించింది.కార్బెట్ టైగర్ రిజర్వులో సుమారు రూ.30 కోట్ల మేర విధ్వంసం జరిగినట్లు కమిటీ అంచనా వేసిందని ధర్మాసనం పేర్కొంది. దెబ్బతిన్న పర్యావరణ వ్యవస్థలను తిరిగి పునరుద్ధరించేందుకు రూ.4.3 కోట్ల వరకు ఖర్చవుతుందని తేలి్చనట్లు కూడా ధర్మాసనం తెలిపింది. ఈ నివేదిక సూచనల మేరకు జిమ్‌కార్బెట్ టైగర్ రిజర్వు పునరుద్ధరణ కోసం చేపట్టాల్సిన చర్యలపై రెండు నెలల్లోగా ఒక ప్రణాళికను రూపొందించాలని ఉత్తరాఖండ్ చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్‌ను ధర్మాసనం ఆదేశించింది. నిపుణుల కమిటీ నివేదికలో పేర్కొన్న అనధికారి నిర్మాణాలను మూడు నెలల్లోగా కూల్చి వేయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. తమ తీర్పు మేరకు అమలు చేసిన చర్యలతో ఏడాదిలోగా అఫిడవిట్ దాఖలు చేయాలంది. -
‘యెమెన్ లీక్ ఎపిసోడ్’లో బిగ్ ట్విస్ట్
యెమెన్‌పై భీకర దాడులకు సంబంధించి అమెరికా ప్రణాళికలు ముందుగానే బయటపడడం చర్చనీయాంశమైన వేళ.. విస్మయం కలిగించే విషయం ఒకటి వెలుగు చూసింది. హౌతీ రెబల్స్‌పై దాడుల సమాచారాన్ని అమెరికా రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్సెత్ తన భార్య, కుటుంబ సభ్యులు, వ్యక్తిగత లాయర్‌తోనూ పంచుకున్నట్లు బయటపడింది. సమాచారం లీక్ విషయంలో ఈయన ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.న్యూయార్క్: సమాచారం లీక్ అవ్వడానికి కారణమైన ‘సిగ్నల్’ గ్రూప్‌ను తానే క్రియేట్ చేశానని, దీనికి పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు అమెరికా జాతీయ భద్రత సలహాదారు మైక్ వాల్జ్ (Mike Waltz) ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ గ్రూప్‌లో సమాచారం ఎలా లీక్ అయ్యిందో అర్థం కావడం లేదని, దీనిపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరుగుతోందని అన్నారాయన. ఈలోపు.. అమెరికా రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్సెత్(Pete Hegseth) తన కుటుంబ సభ్యులతోనూ ఆ కీలక సమాచారం పంచుకున్నారనే విషయం వెలుగు చూసింది.యెమెన్‌లోని హౌతీ రెబల్స్‌ను టార్గెట్ చేస్తూ జరిగిన F/A-18 హార్నెట్ దాడుల షెడ్యూల్ల వివరాలను ఆయన మరో ఛాట్‌లో భార్య, తన సోదరుడు, స్నేహితులతోనూ పంచుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్ ఆదివారం ఒక కథనం ప్రచురించింది. అంతేకాదు హెగ్సెత్ భార్య, ఫాక్స్ న్యూస్ ప్రొడ్యూసర్ అయిన జెన్నిఫర్.. సైన్యానికి సంబంధించిన కీలక సమావేశాలకూ హాజరయ్యారని వాల్ స్ట్రీట్ జనరల్ విడిగా మరో కథనం ఇచ్చింది.ఈ కథనాలపై ఇటు అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్.. అటు వైట్‌హౌజ్ వర్గాలు స్పందించాల్సి ఉంది. మరోవైపు.. అత్యంత సున్నితమైన భద్రతా వివరాలను పంచుకోవడానికి ట్రంప్ పేషీ ‘‘సిగ్నల్’’ లాంటి యాప్‌ను వాడడంపై అమెరికాలో తీవ్ర చర్చ నడుస్తోంది.అమెరికా బలగాలు కిందటి నెలలో యెమెన్(Yemen Attacks Plan Leak)పై భీకర దాడులు చేయడానికి సంబంధించిన ప్రణాళికలు ముందుగానే ఓ పాత్రికేయుడికి తెలియడం అమెరికాలో కలకలం రేపింది. సిగ్నల్‌లో గ్రూప్‌చాట్ కోసం తనను రెండు రోజుల ముందే యాడ్ చేశారని ‘అట్లాంటిక్ మ్యాగజైన్’ ఎడిటర్-ఇన్-చీఫ్ జెఫ్రీ గోల్డ్బర్గ్ ప్రకటించారు. లక్ష్యాలు, అమెరికా ఆయుధాల మోహరింపు, దాడులు చేసే దిశ వంటి అంశాలపై గ్రూపులో చర్చించారని, ఆ ప్రకారమే దాడులు జరిగాయని ఆయన వెల్లడించారు. అయితే తన వద్ద ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ.. తాను ఎలాంటి కథనాలు ఇవ్వలేదంటూ చెప్పారాయన.అమెరికా రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్సెత్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇతర ముఖ్య అధికారులు యెమెన్‌పై చర్చించిన సిగ్నల్ యాప్ గ్రూప్చాట్లో ఈ జర్నలిస్టును యాడ్ చేశారు. దాడుల విషయాలు ఆ పాత్రికేయునికి తెలుసని శ్వేతసౌధం ధ్రువీకరించింది.మరోవైపు.. ఈ ప్రణాళిక లీకైన అంశంపై తనకెలాంటి సమాచారం లేదని అధ్యక్షుడు ట్రంప్ అంటున్నారు. ఈ భద్రతా ఉల్లంఘనను ట్రంప్ సాధారణ విషయంగా తీసుకున్నప్పటికీ.. డెమోక్రట్లు తీవ్రంగా ఖండించారు. నూతన పాలకవర్గం అజాగ్రత్త వల్లే ఇది జరిగిందని వ్యాఖ్యానించారు.ఇక.. ఈ ఉదంతంపై ఉన్నతస్థాయి నిఘా అధికారులను అమెరికా సెనెట్ విచారిస్తోంది. ఇప్పటికే ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్, సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్, జాతీయ నిఘా డైరెక్టర్ తులసీ గబ్బార్డ్‌లు సెనెట్ నిఘా కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చారు. అయితే గ్రూప్‌ను తానే క్రియేట్ చేసినప్పటికీ సదరు జర్నలిస్టు ఫోన్ నెంబర్ తన వద్ద లేదని అన్నారు. ఫోన్లో లేని నెంబర్ ఎలా గ్రూప్‌లోకి వచ్చిందో తెలుసుకోవడానికి సాంకేతిక నిపుణులు కృషి చేస్తున్నారని .. విషయంలో తాము ఇలాన్ మస్క్ సహాయం కూడా తీసుకుంటున్నట్లు అమెరికా జాతీయ భద్రత సలహాదారు మైక్ వాల్జ్ వెల్లడించారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మార్చి 15న యెమెన్‌పై దాడులను ప్రకటించారు. ఇజ్రాయెల్ నౌకలపై దాడుల్ని పునరుద్ధరిస్తామని ప్రకటించిన యెమెన్ తిరుగుబాటు దళం హూతీలపై అమెరికా ఇటీవల పెద్దఎత్తున దాడులు చేసింది. ఉగ్రవాద స్థావరాలు, ఉగ్ర నేతలపై తమ దళాలు భీకర దాడులు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ దాడుల్లో 50 మందికి పైగా మృతిచెందగా.. అనేకమంది గాయపడ్డారు. -
సరిహద్దులు సురక్షితం.. కానీ కొంత సున్నితం
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాదీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి భారత్–చైనా సరిహద్దుల్లో పరిస్థితులు ప్రస్తుతం సాధారణంగా, స్థిరంగానే ఉన్నప్పటికీ, కొంత సున్నితమైనవేనని భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే చెప్పారు. సరిహద్దుల్లో ఎప్పుడు ఎలాంటి సవాలు ఎదురైనా గట్టిగా తిప్పికొట్టడానికి మన సైనిక దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఉన్నతస్థాయి సన్నద్ధతను పాటిస్తున్నాయని వెల్లడించారు. తగినన్ని సైనిక రిజర్వ్ దళాలు సరిహద్దుల్లో మోహరించాయని పేర్కొన్నారు. సరిహద్దుల్లో భద్రతాపరమైన వైఫల్యాలు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. సైనిక దినోత్సవం నేపథ్యంలో జనరల్ మనోజ్ పాండే గురువారం మీడియాతో మాట్లాడారు. సరిహద్దు వివాదం సహా ఇతర అంశాలకు పరిష్కారం కనుగొనడానికి భారత్, చైనా మధ్య సైనిక, దౌత్యవర్గాల స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఇక భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి చొరబాట్లను కట్టడి చేస్తున్నామని తెలిపారు. జమ్మూకశీ్మర్‌లో హింసాకాండ తగ్గుముఖం పట్టిందని, రాజౌరీ–పూంచ్ సెక్టార్లో మాత్రం హింసాత్మక సంఘటనలు కొంతమేరకు పెరిగాయని వివరించారు. సరిహద్దుకు అవతలివైపు ఉగ్రవాద సంస్థలు చురుగ్గా కార్యకలాపాలు సాగిస్తున్నాయని చెప్పారు. జమ్మూకశీ్మర్‌లో కాల్పుల విరమణ కొనసాగుతోందన్నారు. సరిహద్దు అవతలి వైపు నుంచి భారత్‌లోకి ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా జరగకుండా పటిష్టమైన యాంటీ డ్రోన్ వ్యవస్థను తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇండియా–మయన్మార్ సరిహద్దులో.. రెండు దేశాల నడుమ సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకొనే దిశగా భూటాన్–చైనా మధ్య కొనసాగుతున్న చర్చలపై జనరల్ మనోజ్ పాండే స్పందించారు. ఈ పరిణామాన్ని నిశితంగా గమనిస్తున్నామని చెప్పా రు. భూటాన్‌తో భారత్‌కు బలమైన సైనిక సంబంధాలు ఉన్నాయని గుర్తుచేశారు. ఇక ఇండియా–మయన్మార్ సరిహద్దులో పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని అంగీకరించారు. అక్కడి పరిస్థితిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని అన్నారు. -
పాక్‌కు భారత రహస్యాలు చేరవేస్తున్న కానిస్టేబుల్ అరెస్టు
న్యూఢిల్లీ: దాయాది పాకిస్తాన్‌కు భారత్ భద్రత పరమైన విషయాలను చేరవేస్తున్న ఒక బీఎస్ఎఫ్ కానిస్టేబుల్‌ను గుజరాత్‌లోని గాంధీనగర్‌లో యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ (ఏటీఎస్)పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. కాగా, జమ్ముకశ్మీర్ రాజౌరీకి చెందిన మహమ్మద్ సజ్జద్ అనే వ్యక్తి బీఎస్ఎఫ్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో కొంతకాలంగా భారత్ భద్రతపర రహస్యాలను ఫోన్ మెసెజ్ ద్వారా పాక్‌కు చేరవేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిందితుడు బీఎస్ఎఫ్లో చేరక ముందు 46 రోజులు పాక్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇతను డబ్బుల కోసం భారత్ సున్నిత అంశాలను దాయాది పాక్‌కు చేరవేస్తున్నాడని ఏటీఎస్ డిప్యూటి ఎస్పీ చవ్దా తెలిపారు. Gujarat: BSF constable Mohammad Sajjad held from Gandhinagar for allegedly passing sensitive information to Pakistan "A resident of J&K's Rajouri, he went to Pakistan& stayed there for 46 days before joining BSF. He used to send information on WhatsApp," says ATS Dy SP BM Chavda pic.twitter.com/3sUQIoVoNy — ANI (@ANI) October 25, 2021 చదవండి: భర్త పోస్టులకు మరో మహిళ లైక్‌లు .. చిర్రెత్తుకొచ్చిన ఆ భార్య.. -
ఏకగ్రీవాలపై నిమ్మగడ్డ మరో వివాదాస్పద నిర్ణయం
సాక్షి, అనంతరపురం: ఆంధ్రప్రదేవ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో గతంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవం అయిన ప్రాంతాలను హైసెన్సిటివ్ ఏరియాలుగా ప్రకటించారు. పంచాయతీ ఎన్నికల్లో వీటిని సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించారు. ఈ వివాదస్పద నిర్ణయంపై మీడియా నిమ్మగడ్డను ప్రశ్నించిగా.. సమాధానం చెప్పకుండా దాటవేశారు. (చదవండి: నిమ్మగడ్డ తీరు: నాడు అలా.. నేడు ఇలా.. ) అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర సిబ్బందిపై పూర్తి విశ్వాసం ఉంది. అత్యవసరమైతేనే కేంద్ర బలగాలు కావాలని కోరాం. రాష్ట్ర సిబ్బందితోనే పంచాయతీ ఎన్నికలు జరుపుతాం. ఏకగ్రీవాలపై గవర్నర్‌కు కొన్ని రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేశాయి. ఏకగ్రీవాలు గతంలో ఉన్నాయి.. ఇప్పుడు ఉన్నాయి. ఏకగ్రీవాలన్నీ తప్పు అని చెప్పట్లేదు. మీడియాలో యాడ్స్ ఇవ్వటం వల్లే సమాచార అధికారులకు నోటీసులు ఇచ్చాం. బలవంతపు ఏకగ్రీవాలు ఉండకూదన్నదే మా ఉద్దేశ్యం. ఏపీ పంచాయతీ యాప్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తాం’’ అని తెలిపారు. ఇక సమావేశం అనంతరం విలేకరుల ప్రశ్నలకు నిమ్మగడ్డ సమాధానం చెప్పకుండా వెళ్లిపోవడం గమనార్హం. -
సెన్సార్ల తయారీలో నూతన టెక్నాలజీ
సింగపూర్: సెన్సార్ల తయారీలో కొత్త టెక్నాలజీని సింగపూర్ శాస్త్రవేత్తలు రూపొందించారు. నూతన టెక్నాలజీ ద్వారా 'సూపర్ సెన్సిటీవ్ మ్యాగ్నటిక్ సెన్సార్'లను తయారు చేసినట్లు సింగపూర్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇప్పటివరకు వాడుతున్న సెన్సార్ల కంటే 200 రెట్లు సున్నితత్వం గల సూపర్ సెన్సార్లు ఎంతో ప్రభావవంతంగా పనిచేయనున్నట్లు తెలిపారు. కొత్త సాంకేతికతతో పరిమాణంలో చిన్నవిగా, తక్కువ ఖర్చులో సెన్సార్లు తయారు చేయడానికి వీలవుతుంది. ఎలక్ట్రానిక్, సమాచార సాంకేతిక, బయోటెక్నాలజీ రంగంలో విరివిగా ఉపయోగించే సెన్సార్లలో ఇప్పటివరకు సిలికాన్, ఇండియమ్ యాంటీమోనైడ్ అనే పదార్థాలను ఉపయోగిస్తుండగా సూపర్ మ్యాగ్నటిక్ సెన్సార్లలో గ్రాఫిన్, బోరాన్ నైట్రైడ్లను వాడారు. కొత్త సెన్సార్ల తయారీతో వినియోగ వ్యాపార రంగంలో కీలకమైన ముందడుగు పడిందని సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ శాస్త్రవేత్త కలోన్ గోపీనాథన్ తెలిపారు.


