breaking news
Sengottaiyan
-
దినకరన్ షాకింగ్ నిర్ణయం!
అసెంబ్లీ ఎన్నికలకు ఏడు నెలలే సమయం ఉండడంతో తమిళనాట రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికార డీఎంకే పార్టీని ఓడించేందుకు ప్రతిపక్ష అన్నాడీఎంకే అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో జట్టు కట్టింది. ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి (ఈపీఎస్) దాదాపు ఖరారయ్యారు. దీనికి తమిళ బీజేపీ నాయకులు కూడా ఒప్పుకున్నారు. అయితే తాను మాత్రం ఒప్పుకోనంటున్నారు అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం చీఫ్ టీటీవీ దినకరన్ (TTV Dhinakaran).ఎన్డీఏ కూటమి నుంచి కొద్దిరోజుల క్రితం దినకరన్ బయటకు వెళ్లిపోయారు. ఆయనను మళ్లీ ఎన్డీఏలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం సెప్టెంబర్ 21న స్వయంగా దినకరన్ ఇంటికి వెళ్లి భేటీ అయ్యారు. తమతో చేతులు కలపాలని కోరారు. భేటీ తర్వాత అన్నామలై మీడియాతో మాట్లాడుతూ.. ''మా భేటీలో రహస్యాలు ఏమీ లేవు. దినకరన్ ఎన్డీఏ కూటమిలోనే ఉన్నారు. హఠాత్తుగా బయటకు వెళ్లడంతో ఆయనను కలిసి మాట్లాడాను. ఎన్డీఏలోనే కొనసాగాల''ని కోరినట్టు వెల్లడించారు. నవంబర్ తర్వాత టీటీవీ దినకరన్ తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని ఆయన చెప్పారు.ఈపీఎస్‌ను ఓడిస్తాంఅయితే దినకరన్ మాత్రం మూడు రోజుల్లోనే తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈపీఎస్ ఉన్నంత కాలం తాను తిరిగి కూటమిలోకి రానని తెగేసి చెప్పేశారు. అయితే దినకరన్ మాత్రం మూడు రోజుల్లోనే తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈపీఎస్ ఉన్నంత కాలం తాను తిరిగి కూటమిలోకి రానని తెగేసి చెప్పేశారు. "నేను 2021లో కూడా ఆయనను వ్యతిరేకించాను. సీనియర్ నాయకులు నన్ను కోరినందున మాత్రమే నేను ఆయనను అంగీకరించాను. ఈసారి, మా పార్టీ ప్రత్యేకంగా ఈపీఎస్‌ను ఓడించడానికి పోరాడుతుంద"ని మీడియాతో చెప్పారాయన. తనను ఎన్డీఏ కూటమిలోకి తిరిగి తీసుకురావడానికి మధ్యవర్తుల ద్వారా బీజేపీ ఢిల్లీ పెద్దలు చేసిన ప్రయత్నాలను తాను తిరస్కరించినట్టు వెల్లడించారు.బీజేపీకి ఎదురుదెబ్బతమిళనాడులో డీఎంకే ప్రభుత్వాన్ని ఓడించేందుకు దృఢమైన కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీకి దినకరన్ నిర్ణయం ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. దివంగత అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత సన్నిహిత స్నేహితురాలు వీకే శశికళ (VK Sasikala) మేనల్లుడు దినకరన్‌కు తమిళనాడులో అంతో ఇంతో ఓటు బ్యాంకు ఉంది. అన్నామలై చొరవతో 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమితో కలిశారు. బీజేపీ పెద్దలు ఈపీఎస్‌ను సీఎం అభ్యర్థిగా దాదాపు ఖరారు చేయడంతో దినకరన్ జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేస్తున్నట్టు ప్రకటించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దినకరన్ నిష్క్రమణ కమలనాథులకు సంకటంగా మారింది. ఆయనను ఎలాగైనా కూటమిలో కొనసాగేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నారు.పళనిస్వామి పంతంమరోవైపు జయలలిత (Jayalalithaa) మరణం తర్వాత అన్నాడీఎంకేను తన గుప్పిట్లో పెట్టుకున్న పళనిస్వామి మాత్రం దినకరన్‌తో పాటు మాజీ సీఎం పన్నీర్ సెల్వం (ఓపీఎస్)ను మళ్లీ చేరదీయకూడదని భీష్మించుకుని కూర్చుకున్నారు. పార్టీని వదిలివెళ్లిన వారు, బహిష్కరణకు గురైన వారిని మళ్లీ అక్కున చేర్చుకోవాలని అన్నాడీఎంకే సీనియర్ నేత సెంగోట్టయన్ చేసిన ప్రతిపాదనపై పళనిస్వామి తీవ్రంగా స్పందించారు. పార్టీ పదవుల నుంచి సెంగోట్టయన్, ఆయన మద్దతుదారులను పీకిపారేశారు. తనకు వ్యతిరేకంగా వ్యహరిస్తే చర్యలు తప్పవని పరోక్షంగా హెచ్చరికలు పంపారు. దీంతో పళనిస్వామిపై సెంగోట్టయన్ (Sengottaiyan) మద్దతురాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అటు ఓపీఎస్, దినకరన్ కూడా సెంగోట్టయన్‌కు బాసటగా నిలిచారు.చదవండి: అన్నాడీఎంకేలో కలకలం.. రంగంలోకి అమిత్ షా!ఈ పరిణామాల నేపథ్యంలో దినకరన్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. తమిళనాడులో డీఎంకేను ఓడించడానికి ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకూడదని బీజేపీ భావిస్తోంది. అటు చూస్తే అన్నాడీఎంకే పార్టీలో లుకలుకలు, ఇటు చూస్తే దినకరన్ నిష్క్రమణతో కాషాయ పార్టీకి కలవరం తప్పడం లేదు. అయితే దినకరన్ ఇదే మాట మీద ఉంటారా, దిగివస్తారా అనేది వేచిచూడాలి. -
మంతనాల్లో సెంగోట్టయన్ బిజీ
సాక్షి, చైన్నె: గోబి చెట్టి పాళయంలోని తన నివాసంలో రాజకీయ భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి మద్దతు దారులతో సెంగ్టోయన్ బుధవారం నుంచి మంతనాలలో మునిగారు. అందరి అభిప్రాయాలను స్వీకరిస్తూ వస్తున్నారు. ఆయన వద్దకు పెద్దసంఖ్యలో మద్దతు దారులు తరలి వస్తున్నారు. అన్నాడీఎంకేలో సమన్వయం, సమష్టి, ఐక్యత నినాదాన్ని అందుకున్న పదవులను సీనియర్ నేత సెంగోట్టయన్ పోగొట్టకున్న విషయం తెలిసిందే. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళని స్వామి చర్యలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న సెంగ్టోయన్ మంగళవారం ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్‌లను కలిసి వచ్చారు. ఢిల్లీ పెద్దల ముందు తన వాదనను, అభిప్రాయాలను ఉంచి ఈరోడ్‌కు వచ్చిన సెంగ్టోయన్ బుధవారం ఉదయం నుంచి పొద్దు పోయే వరకు మద్దతు దారులతో సమావేశాలతో బిజీ అయ్యారు. తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణ గురించి మద్దతు దారులతో మాట్లాడుతూ, వారి అభిప్రాయాలను సెంగోట్టయన్ స్వీకరిస్తూ వస్తున్నారు. అలాగే పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలందర్నీ ఒక చోట చేర్చే దిశగా పోన్ మంతనాలు సైతం ఆయా నేతలతో సాగుతున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. పళణి స్వామికి సెంగోట్టయన్ విధించిన పది రోజుల గడువు ఈనెల 15వతేదీ ముగియనుంది. ఆ తదుపరి సెంగోట్టయన్ పరిణామాలు, బాట ఎలా ఉంటుందో అన్న చర్చ ఊపందుకుంది.సూపర్ చైన్నె పోటీలకు దరఖాస్తుల ఆహ్వానంసాక్షి, చైన్నె : చైన్నె భవిష్యత్తును, సృజనాత్మకతను, అత్యాధునిక సాంకేతికతను ఒకే వేదిక మీదకు తెచ్చే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో (ఏఐ) కళా పోటీలకు అవకాశం కల్పించారు. రీ ఇమాజిన్ చైన్నె ఏఐ ఆర్ట్ ఎగ్జిభిషన్గా జరగనున్న ఈ కార్యక్రమ వివరాలను బుధవారం సూపర్ చైన్నె ఎండీ రంజీత్ రాథోడ్ స్థానికంగా ప్రకటించారు. ఏఐ మేళవింపుతో చైన్నె భవిష్యత్తును ఊహించడం లక్ష్యంగా, నిరంతర అభివృద్ధిని కాంక్షిస్తూ స్కైలైన్ నుంచి శక్తి వంతమైన సంస్కృతి వరకు ఏఐ సాధానాల శక్తిగా వ్యక్తికరించే విధంగా జరగనున్న ఈ పోటీలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు వివరించారు. సెప్టెంబరు 30 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నామని, విశిష్ట ప్యానెల్ ద్వారా ఎంపిక చేసే టాప్ 25 కళాకృతులను ది ఏఐ ఆర్ట్ షోలో ప్రదర్శించడం జరుగుతుందని వివరించారు. దరఖాస్తులను, ఆవిష్కరణలను హెలో ఎట్ సూపర్ చైన్నె .కామ్‌కు పంపించాలని సూచించారు.ఐదు చోట్ల ఈడీ దాడులుసాక్షి, చైన్నె : చైన్నెలో బుధవారం ఉదయం నుంచి ఈడీ అధికారులు ఐదుచోట్ల సోదాలలో నిమగ్నమయ్యారు. ఇటీవల కాలంగా రాష్ట్రంలో ఎన్పోర్సుమెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు తరచూ ఎవరో ఒకర్ని టార్గెట్ చేసి సోదాలు నిర్వహిస్తూ రావడం రోజురోజుకూ పెరుగుతోంది. ఈ పరిస్థితులలో బుధవారం ఉదయాన్నే చైన్నెలో ఐదుప్రాంతాలను ఈడీ అధికారులు ఎంపిక చేసుకున్నారు. అడయార్, వేళచ్చేరి ,వెస్ట్ మాంబళం, మేడవాక్కం తదితర ఐదు చోట్ల పొద్దుపోయే వరకు సోదాలు జరిగాయి. ఈ నివాసాలను ఓ ప్రముఖ పారిశ్రామిక వేత్త బిష్ణోయ్ , ఓ ప్రముఖ వైద్యురాలు ఇందిరకి సంబంధించినవిగా విచారణలో వెలుగు చూశారు. మనీ లాండరింగ్ వ్యవహారంలో వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ సోదాలు నిఘా నీడలో జరుగుతున్నాయి.మురుగు నీటి శుద్ధీకరణకు స్వదేశీ సాంకేతికత– ఐఐటీ మద్రాసు ఆవిష్కరణసాక్షి, చైన్నె: దేశీయంగా తదుపరి తరం మురుగు నీటి శుద్ధీకరణ సాంకేతికతను ఐఐటీ మద్రాసు స్టార్టప్ జేఎస్పీ ఎన్విరో అభివృద్ధి చేసింది. ఈ వివరాలను బుధవారం ఐఐటీ మద్రాసు వర్గాలు ప్రకటించాయి. తమిళనాడు ఈరోడ్ జిల్లాలోని పరిశ్రమలలో ఈ పరిశోధనను విజయవంతంగా అమలు చేశారు. ఈ సాంకేతికత ప్రయోజనాలను లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పొందిన జెఎస్పీ ఎన్విరో సహ వ్యవస్థాపకురాలు డాక్టర్ ప్రియదర్శిని మణి వివరించారు. స్వదేశీ పరిజ్ఞానంతో మురుగునీటిని శుద్ధి చేసే సాంకేతికత ఇది అని పేర్కొన్నారు. స్టార్టప్ సహ వ్యవస్థాపకుడు, ఐఐటీ మద్రాసు పూర్వ విద్యార్థి డాక్టర్ విటీ ఫిదాల్కుమార్ పేర్కొంటూ, ప్రస్తుత సాంకేతికతలతో ఉన్న ముఖ్యమైన తేడాలను వివరించారు. సాంప్రదాయ ఏరోబిక్ వ్యవస్థలు మురుగు నీటిలోకి ఆక్సిజన్‌ను పంప్ చేయడానికి పెద్ద మొత్తంలో విద్యుత్‌ను వినియోగిస్తుందని పేర్కొన్నారు. అయితే ఈ దేశీయ సాంకేతికత బెడ్స్టీఎం ఆక్సిజన్ లేకుండా పనిచేస్తుందని, ఎలక్ట్రోడ్ భర్తీలు తరచూ అవసరం లేదన్నారు. బీఈఏడీఎస్(బెడ్స్) విద్యుత్, రసాయనాలను ఉపయోగించకుండా మురునీటిని శుభ్ర పరుస్తుందని వివరించారు. ఈరోడ్, పెరుందురైలలోని రెండు పారిశ్రామిక యూనిట్లలో విజయవంతంగా ఈ టెక్నాలజీ అమలు చేశామన్నారు. -
అన్నాడీఎంకేలో కలకలం.. రంగంలోకి అమిత్ షా!
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో తమిళనాట రాజకీయ కార్యకలాపాలు జోరందుకుంటున్నాయి. ఎన్నికల బరిలో దిగేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. అధికార డీఏంకే మరోసారి గెలుపు కోసం ప్రయత్నిస్తుండగా, ప్రతిపక్ష అన్నాడీఎంకే ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని విశ్వప్రయత్నం చేస్తోంది. అగ్ర కథానాయకుడు విజయ్.. తొలిసారిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నాయకుడు టీటీవీ దినకరన్ తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు.ఎంకే స్టాలిన్ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలని అన్నాడీఏంకే గట్టిగానే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా బీజేపీతో జట్టు కట్టింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి కె పళనిస్వామితో (Edappadi K Palaniswami) పాటు బీజేపీ అగ్ర నేతలు ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ జాతీయ నాయకుడు అమిత్ షా.. తమిళనాడుకు వరుస పర్యటనలు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా నవంబర్ నుంచి వరుస పర్యటనలు చేపట్టేలా కసరత్తు జరుగుతోంది.ఇదిలావుంటే పార్టీలో అంతర్గత విభేదాలు అన్నాడీఎంకేకు తల నొప్పిగా మారాయి. పళనిస్వామి వ్యవహారంపై సొంత పార్టీ నాయకులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి, సీనియర్ నేత కేఏ సెంగోట్టయన్ (KA Sengottaiyan) పట్ల వ్యవహరించిన తీరును అన్నాడీఎంకే నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనను పార్టీ పదవుల నుంచి తప్పిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. పళనిస్వామి ఒంటెత్తు పోకడలతో నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు.అసలేం జరిగింది?పార్టీని వదిలిపెట్టిన వారిని, బహిష్కరించిన వారిని మళ్లీ అక్కున చేర్చుకోవాలని సెంగోట్టయన్ పిలుపు ఇవ్వడంతో అన్నాడీఏంకేలో ఒక్కసారిగా కలకలం రేగింది. పార్టీ అధినేత పళనిస్వామికి సెంగోట్టయన్ వ్యాఖ్యలు ఏమాత్రం రుచించలేదు. దీంతో ఆయనను పార్టీ పదవుల నుంచి తప్పించారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఈరోడ్ రూరల్ పశ్చిమ జిల్లా కార్యదర్శి పదవి నుంచి సెంగోట్టయన్‌ను తీసిపారేశారు. అక్కడితో ఆగకుండా ఆయన మద్దతుదారులపైనా కొరడా ఝళిపించారు. సెంగోట్టయన్ మద్దతురాలైన మాజీ ఎంపీ సత్యభామను పార్టీ పదవుల నుంచి తొలగించారు.పార్టీ మంచి కోరే..పళనిస్వామి నిర్ణయంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతా కలిసి సమిష్టిగా పోరాడితే అధికారంలోకి వస్తామన్న ఉద్దేశంతోనే తాను మాట్లాడానని అన్నారు. పార్టీ మంచి కోరే ఐక్యత రాగం అందుకున్నానని, మరో అభిప్రాయం లేదని స్పష్టం చేశారు. ఎటువంటి వివరణ అడకుండానే తనను పార్టీ పదవులకు దూరం చేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, సెంగోట్టయన్ వ్యాఖ్యలను బహిష్కృత నేతలతో పాటు బీజేపీ, డీఎండీకే పార్టీలు స్వాగతించగా.. పళనిస్వామి ఫైర్ కావడం చర్చనీయాంశంగా మారింది.ఓపీఎస్ భరోసా!సెంగోట్టయన్‌కు మాజీ సీఎం పన్నీర్ సెల్వం, టీటీవీ దినకరన్ బాసటగా నిలిచారు. సెంగోట్టయన్‌కు తన మద్దతు ఉంటుందని, ఆయనను త్వరలో కలుస్తానని పన్నీర్ సెల్వం (Panneerselvam) ప్రకటించారు. జయలలిత ప్రాణ స్నేహితురాలు శశికళ కూడా తెర ముందుకు వస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అన్నాడీఎంకే అసంతృప్త నాయకులందరూ ఒక వేదికపైకి వచ్చే అవకాశముందన్న వాదనలు విన్పిస్తున్నాయి.చదవండి: డీఎంకేకు నిద్రలేకుండా చేస్తున్న విజయ్!రంగంలోకి అమిత్ షా!అన్నాడీఎంకే పార్టీలో రేగిన దుమారాన్ని కట్టడి చేసేందుకు బీజేపీ అగ్రనేత అమిత్ షా (Amit Shah) రంగంలోకి దిగినట్టు కనబడుతోంది. మంగళవారం సెంగోట్టయన్‌ను ఢిల్లీకి పిలిపించుకుని ఆయనతో మాట్లాడారు. అమిత్ షాతోపాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయినట్టు సెంగోట్టయన్ వెల్లడించారు. 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీని బలోపేతం చేయడానికి, బహిష్కృత అన్నాడీఎంకే నేతలను తిరిగి చేర్చుకోవడంపై తన అభిప్రాయాలను వారితో పంచుకున్నానని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో సెంగోట్టయన్ భవిష్యత్ కార్యాచరణపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. -
ఆన్లైన్ క్లాస్‌లు వద్దు.. ఓకే!
సాక్షి, చెన్నై: ఆన్లైన్ తరగతుల నిర్వహణ గురించి ఒకే రోజు విద్యా మంత్రి సెంగోట్టయన్ చేసిన రెండు రకాల వ్యాఖ్యలు సర్వత్రా విస్మయంలో పడేశాయి. ఉదయాన్నే ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన మంత్రి, సాయంత్రం అనుమతులు ఇస్తున్నామని ప్రకటించడం గమనార్హం. లాక్డౌన్ సడలింపుల ప్రక్రియ సాగుతున్నా, ఇప్పట్లో విద్యా సంస్థలు తెరచుకునే అవకాశాలు లేవు. దీంతో ఆయా విద్యా సంస్థలు ఆన్లైన్ తరగతులపై దృష్టి పెట్టాయి. జూన్ నుంచి ప్రైవేటు విద్యా సంస్థలు మెజారిటీ శాతం ఆన్లైన్ తరగతుల నిర్వహణకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. పాఠశాలలు, కళాశాలల పునఃప్రారంభం, విద్యా వ్యవహారాల పర్యవేక్షణకు ఓ ఉన్నత స్థాయి కమిటీని సీఎం పళనిస్వామి రంగంలోకి దించారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక మేరకు స్కూళ్ల రీ ఓపెనింగ్ ఆగస్టులో ఉండ వచ్చన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ సమాచారంతో ప్రైవేటు సీబీఎస్ఈ, మెట్రిక్యులేషన్ యాజమాన్యాలు ఆన్లైన్ తరగతులు అంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు ఎస్ఎంఎస్లు పంపించే పనిలో పడ్డాయి. (వారిద్దరూ అమ్మ వారసులే) మాట మార్చేశారు.. జూన్ ఒకటి నుంచి ఈ తరగతుల నిర్వహణ వేగం పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో బుధవారం ఉదయం విద్యా మంత్రి సెంగోట్టయన్ మీడియాతో మాట్లాడుతూ ఆన్లైన్ తరగతులపై ఆగ్రహన్ని వ్యక్తం చేశారు. ప్రైవేటు విద్యా సంస్థలు ఆన్లైన్ క్లాసులు అంటూ వేధింపులు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఇబ్బందులు కల్గించే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవన్న హెచ్చరికలు చేశారు. అయితే, సాయంత్రానికి మాట మార్చేశారు. ఆన్లైన్ తరగతుల నిర్వహణకు అనుమతి ఇస్తున్నట్టు ప్రకటించారు. (విమానం ఎక్కుతానని ఎప్పుడూ అనుకోలేదు ) అయితే, ఉపాధ్యాయుల్ని స్కూళ్లకు రప్పించడం, అక్కడి నుంచి తరగతులు నిర్వహించే రీతిలో చర్యలు తీసుకుంటే చర్యలు తప్పదన్న హెచ్చరిక చేశామని దాట వేశారు. ఉన్న చోట నుంచే ఆన్లైన్లో తరగతుల్ని నిర్వహించుకోవచ్చని, ఇందుకు ప్రభుత్వం ఎలాంటి అడ్డంకులు విధించలేదన్నారు. పాఠశాలలను తెరిచే విషయంగా ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఉన్నత స్థాయి కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా, అన్ని సమీక్షల మేరకు సీఎం పళనిస్వామి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఉన్న చోటే పరీక్షలు.. పదో తరగతి విద్యార్థులకు ఊరట కల్గించే ఉత్తర్వులు వెలువడ్డాయి. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జూన్ 15 నుంచి జరగనున్న విషయం తెలిసిందే. కంటైన్మెంట్ జోన్లలో ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా పరీక్షా కేంద్రాల ఏర్పాటు సాగుతున్నాయి. అలాగే, అనేక మంది విద్యార్థులు పరీక్షలు ఓ చోట రాయాల్సి ఉండగా, వారు మరో చోట నివాసం ఉండడం, మరో ప్రాంతానికి వెళ్లి ఉండడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్రం తాజాగా ఓ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులు ప్రస్తుతం ఎక్కడైతే ఉన్నారో, అక్క డి పరీక్షా కేంద్రంలోనే పరీక్షలు రాసుకోవచ్చని కేంద్ర మానవ వనరుల శాఖ ప్రకటించింది. ఇక, పదీ పరీక్షలు రాయనున్న విద్యార్థుల్ని మానసికంగా సిద్ధం చేయడానికి తగ్గట్టు వారికి ప్రత్యేకంగా కథల్ని వినిపించే రీతిలో సరికొత్త యాప్‌లు తెరపైకి రావడం విశేషం. -
ఓపీఎస్.. ఈపీఎస్.. మధ్యలో సెంగొట్టియాన్
-
ఓపీఎస్.. ఈపీఎస్.. మధ్యలో సెంగొట్టియాన్
చెన్నై : తమిళనాట రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ ఉత్కంఠ రేపుతున్నాయి. విలీనమైన ఈపీఎస్-ఓపీఎస్లు చిన్నమ్మ శశికళ కుటుంబాన్ని పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి వెలివేశారు. అమ్మ జయలలిత మరణం తర్వాత ముఖ్యమంత్రిగా రాత్రికి రాత్రి పదవి స్వీకరించి, అనంతరం జరిగిన పరిణామాల్లో పార్టీకి, సీఎం పదవికి కూడా దూరమైన పన్నీర్ సెల్వం.. ఎలాగైనా ఆ పదవిని మరోసారి చేపట్టాలన్న ఆశతో ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి పదవి తనకే ఉంచి.. ప్రధాన కార్యదర్శి పదవి తీసుకోవాలని ఓపీఎస్‌కు పళనిస్వామి ఆఫర్ ఇచ్చారు. సరిగ్గా ఇదే అంశం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ప్రధాన కార్యదర్శి పదవి మీద సీనియర్ నాయకుడు సెంగొట్టియాన్ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ పదవిని పన్నీర్ సెల్వానికి ఇస్తే ఆయన సంగతి ఏమవుతుందో తెలియాల్సి ఉంది. తాను ఈ పదవికి పోటీలో ఉన్నానని సెంగొట్టియాన్ ముందునుంచే చెబుతున్నారు. కానీ ఆయనకు ఇప్పుడు కొత్త చిక్కులు ఎదురయ్యేలా ఉన్నాయి. రెండు వర్గాల డిమాండ్లతో తమిళ రాజకీయాలు మరోమారు ఆసక్తికరంగా మారాయి. ఈ డిమాండ్ల నేపథ్యంలో చర్చలకు ప్రత్యేక కమిటీ ఏర్పాటుచేయాలని రెండు వర్గాలు నిర్ణయించాయి. -
మధుసూదనన్ ను తొలగించిన చిన్నమ్మ
-
మధుసూదనన్ ను తొలగించిన చిన్నమ్మ
తమిళనాట రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ క్షణక్షణం ఉత్కంఠ రేపుతున్నాయి. ఇన్ని రోజులు శశికళ వర్గంలో ఉంటూ వచ్చిన, పార్టీ సీనియర్ నేత ఇ.మధుసూదనన్ గురువారం పన్నీర్ సెల్వం గూటికి చేరడంతో ఆయనపై చిన్నమ్మ కొరడా ఝుళిపించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో మధుసూదనన్‌ను అన్నాడీఎంకే నుంచి తప్పించింది. ప్రిసీడియం చైర్మన్ పదవితో పాటు పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తున్నట్టు అన్నాడీఎంకే శుక్రవారం ప్రకటించింది. మధుసూదనన్ స్థానంలో సెంగొట్టయ్యన్‌ను నియమిస్తున్నట్టు ప్రటించింది. శశికళ వర్గంలో ఉంటూ వచ్చిన మధుసూదనన్ ఒక్కసారిగా అమ్మ విశ్వాసపాత్రుడు పన్నీర్ వర్గంలో చేరారు. శశికళ కుటుంబసభ్యులు పెత్తనం భరించలేకే తాను అక్కడి నుంచి వచ్చేశానని, పన్నీర్ సెల్వానికి జరిగిన అవమానం రేపు తనకూ జరగొచ్చన్న అంచనాయే తనను బయటకు రప్పించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మధుసూదనన్ పన్నీర్ వర్గంలోకి వెళ్లడంతో ఆయనకు అనూహ్య మద్దతు పెరుగుతూ వస్తోంది. దీంతో మధుసూదనన్‌ను పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు అన్నాడీఎంకే పేర్కొంది. అయితే పార్టీ నిబంధనల ప్రకారం అన్నాడీఎంకేకు ప్రధాన కార్యదర్శిగా పదవి చేపట్టే వాళ్లు ఐదేళ్లు పార్టీలో యాక్టివ్ మెంబర్‌గా ఉండాలని, యాక్టివ్ మెంబర్ కాకుండానే శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదా చేపట్టినట్టూ మరోవైపు నుంచి చిన్నమ్మపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే శశికళకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి కూడా చేజారే అవకాశముంటోంది. -
అన్నాడీఎంకేతోనే గ్రామీణాభివృద్ధి సాధ్యం
వేలూరు, న్యూస్‌లైన్: అన్నాడీఎంకే ప్రభుత్వంతోనే గ్రామీణాభివృద్ధి సాధ్యమని వేలూరు పార్లమెంట్ అభ్యర్థి సెంగొట్టవన్ తెలిపారు. శనివారం ఉదయం నియోజక వర్గం లోని మేల్ మనూర్, కీల్ మనూర్, పొయిగై, అమ్ముండి తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. మూడేళ్ల అమ్మ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు పలు సంక్షేమ పథకాలను పొందారని వీటిని ప్రతి ఓటరు గుర్తించుకోవాలన్నారు. ప్రస్తుతం అన్ని గ్రామాల్లోను సిమెంట్ రోడ్లు, తాగునీటి ట్యాంకర్లున్నాయంటే అందుకు ముఖ్యమంత్రి జయలలితనే కారణమన్నారు. ఎన్నికల సమయంలో పలు పార్టీలు ఎన్నో ఉచిత హామీలిస్తుంటారని వాటిని ప్రజలు నమ్మవద్దన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి కూడా పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత అన్నాడీఎంకే ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఓటర్లు ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాష్ట్ర, గ్రామీణాభివృద్ధిని గుర్తు తెచ్చుకొని ఓటు వేయాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో డెప్యూటీ మేయర్ ధర్మలింగం, జిల్లా జాయింట్ కార్యదర్శి మునెమ్మ, ఆవిన్ పాలడెరుురీ చైర్మన్ వేలయగన్, సర్పంచ్ సెల్వి, మాజీ కౌన్సిలర్ జిజిఆర్ రవి, కాట్పాడి యూనియన్ చైర్మన్ రాజ, అన్నాడీఎంకే నాయకులు పాల్గొన్నారు. -
పథకాలను చూసి ఓటేయండి
వేలూరు, న్యూస్‌లైన్: రాష్ట్రంలో అమ్మ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను చూసి ప్రజలు ఓట్లు వేయాలని అన్నాడీఎంకే పార్లమెంట్ అభ్యర్థి సెంగొట్టవన్ ఓటర్లను అభ్యర్థించారు. వేలూరు కార్పొరేషన్లో గురువారం ఉదయం ప్రచారం నిర్వహించారు. అమ్మ పథకాలు దేశ వ్యాప్తంగా అమలు చేయాలంటే ఓటర్లు రెండాకుల గుర్తుపై ఓట్లు వేయాలని కోరారు. ఒక్క అవకాశం కల్పిస్తే వేలూరు కార్పొరేషన్‌లోని తాగునీటి సమస్యతోపాటు పలు సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే డాక్టర్ విజయ్ మాట్లాడుతూ కార్యకర్తలందరూ ఇంటింటికీ వెళ్లి అమ్మ సంక్షేమ పథకాల కరపత్రాలను ఆయుధంగా తీసుకొని ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లు వేయాలని కోరాలన్నారు. ఈ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాటిని పరిష్కరించడంలో ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారని నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే వారితో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆయనతో పాటు మేయర్ కార్తియాయిని, డెప్యూటీ మేయర్ ధర్మలింగం, మాజీ కౌన్సిలర్ జీజీ రవి, జననీ బిగ్ బజార్ అధినేత సతీష్‌కుమార్, విజయకుమార్, కౌన్సిలర్లు, అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.