breaking news
self mistake
-
ఇది బాధితురాలి స్వయంకృతాపరాధమే!
వక్షోజాలను తాకడం.. యువతి పైజామాను లాగడం లాంటి చేష్టలు అత్యాచార యత్నం కిందకు రావంటూ వివాదాస్పద తీర్పు ఇచ్చిన అలహాబాద్ హైకోర్టు(ఉత్తర ప్రదేశ్).. మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఓ అత్యాచార కేసులో బాధితురాలిది కూడా తప్పు ఉందని పేర్కొంటూ నిందితుడికి ఏకంగా బెయిల్ మంజూరు చేసింది.లక్నో: ఢిల్లీలో ఉంటూ పీజీ చదువుతున్న ఓ విద్యార్థిని తన క్లాస్మేట్ అత్యాచారం చేశాడని కేసు పెట్టింది. .. మద్యం మత్తులో ఉన్న తనను అతని బంధువుల ఇంటికి తీసుకెళ్లి రెండుసార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపించింది. అయితే సాక్ష్యాలు పరిశీలనలో అది అబద్ధమని, పరస్పర అంగీకారంతో ఇద్దరూ కలిశారని నిందితుడి తరఫు లాయర్ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న తర్వాత.. ధర్మాసనం కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుంది.ఈ కేసులో బాధితురాలుగా ఉన్న యువతి ఎంఏ చదువుతోంది. ఏది తప్పో..ఏది ఒప్పో.. నైతికత గురించి ఆమెకు తెలియంది కాదు. ఒకవేళ బాధితురాలి ఆరోపణే నిజం అనుకున్నా.. ఇక్కడ సమస్యను స్వయంగా ఆమెనే ఆహ్వానించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి, జరిగిన దానికి ఆమె కూడా ఓ బాధ్యురాలే. ఇది ముమ్మాటికీ బాధితురాలి స్వయంకృతాపరాధమే!.పైగా వైద్య పరీక్షలో కన్నెపొర(Hymen) చిరిగిపోయినట్లు తేలింది. కానీ లైంగిక వేధింపులు జరిగినట్లుగా వైద్యులు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదు. ఇక ఈ కేసులో నిందితుడికి ఎలాంటి నేర చరిత్ర లేదు. బెయిల్ షరతులను ఉల్లంఘించడని హామీతో పాటు, సాక్ష్యాలను ప్రభావితం చేయలేడన్న నమ్మకం కుదిరిన తర్వాతే నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తున్నాం అని జస్టిస్ సంజయ్ కుమార్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు.ఈ ఘటన కిందటి ఏడాది సెప్టెంబర్‌లో జరిగింది. పీజీ చదువుతున్న బాధితురాలిని ఆమె స్నేహితులు హౌజ్ ఖాస్‌లోని ఓ రెస్టారెంట్‌కు ఆహ్వానించారు. అయితే అర్ధరాత్రి 3గం.దాకా ముగ్గురు స్నేహితులతో కలిసి ఆమె చిత్తుగా తాగింది. ఈ క్రమంలో మత్తులో ఉన్న ఆమె తన గదికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఓ స్నేహితుడిని అతని ఇంటికి తీసుకెళ్లాలని ఆమె కోరింది. అయితే.. బాగా మత్తులో ఉన్న ఆమెను నిందితుడు తన బంధవులు ప్లాట్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడన్నది ఆమె ఆరోపణ. ఈ కేసులో కిందటి ఏడాది డిసెంబర్ నుంచి నిందితుడు జైల్లోనే ఉన్నాడు. ఇక.. ఈ కేసులో ఇలాంటి వ్యాఖ్యలు చేసి మరీ నిందితుడికి అలహాబాద్ హైకోర్టు బెంచ్ బెయిల్ మంజూరు చేసింది మార్చి 11వ తేదీనే. కానీ, పలు ఆంగ్ల మీడియా వరుస కథనాలతో ఇప్పుడు హైలైట్ అవుతోంది. అంటే..ఇదే కోర్టుకు చెందిన జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా ఇచ్చిన వివాదాస్పద తీర్పు కంటే ముందు ఈ కేసు విచారణ జరిగిందన్నమాట!. మార్చి 17వ తేదీన ఓ మైనర్ బాలికపై జరిగిన అత్యాచార యత్నం కేసు విచారణలో జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా సంచలన తీర్పు వెల్లడించారు. మహిళ ఛాతీని తాకినంత మాత్రాన.. పైజామా తాడు తెంపినంత మాత్రాన అత్యాచార యత్నం కిందకు రాదంటూ పేర్కొన్నారు. తద్వారా నిందితులు చేసిన నేరాలు పోక్సో చట్టంలోని సెక్షన్ 18, సెక్షన్ 376 కిందకు రావని చెబుతూనే.. అదే చట్టంలోని సెక్షన్ 9/10 (తీవ్రమైన లైంగిక వేధింపులు), సెక్షన్ 354బి (మహిళల గౌరవాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో దాడి) కింద కేసులు నమోదు చేసి విచారించాలని ఆదేశించారాయన. అయితే ఈ తీర్పును సుమోటోగా స్వీకరించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం.. తీర్పును, న్యాయమూర్తి తీర్పు సందర్భంగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ స్టే విధించింది కూడా. -
స్వయంకృతం
జీవన కాలమ్ బాధ్యతారాహిత్యంగా తనని దోచుకునే మానవాళిని ప్రకృతి ఎప్పటికప్పుడు నిశ్శబ్దంగా హెచ్చరిస్తూనే ఉంది. ఇటీవల దోపిడీ ఎక్కువయింది కనుక, హెచ్చరికలు తరుచుగా వినవస్తున్నాయి. మనకి ధర్మం అంటే బూతు మాట. మన నైమిత్తిక జీవ నంలో ఒకరు చెప్ప కుండానే మనం పాటిం చాల్సిన విధి ధర్మం. మతం అంటే మరో పెద్ద బూతు. మానవుని జీవన సరళి సజావుగా సాగడానికి మానవుడే ఏర్పరచుకున్న ప్రణాళిక మతం. మనకు 33 కోట్ల మంది దేవతలు. ఎలుక, కుక్క, పాము, భూమి, చెట్టు, నీరు, వర్షం- అన్నీ మనకు దేవతలే. నేటి ఇంగ్లిష్ చదువులు చదువుకుంటున్న మీ అబ్బాయే ఈ మాట చెప్తే మిమ్మల్ని వెక్కిరిస్తాడు- మా నాన్న తరం మరీ ఇంత ఆటవిక సంస్కృతిలో జీవించారని. మనకి ఉపకారం చేసే ప్రతి ప్రాణినీ, శక్తినీ దేవతగా భావించడం ఆనాటి తరాల సంస్కారమని ఆ కుర్రాడికి ఎవరూ నేర్పలేదు. ఇవాళ తమిళనాడులో గత శతాబ్దంలో ఎన్నడూ కురవనంత వర్షం కురిసింది. మరి శతాబ్దం కిందట ఇంత అనర్థం ఎందుకు జరగలేదు? 125 సంవత్సరాల కిందట ఉత్తరాంధ్రలో హుద్‌హుద్ వంటి తుపాను వచ్చిందన్నారు చదువుకున్న పెద్దలు. అప్పుడు ఇంత అనర్థం ఎందుకు జరగలేదు? ఇప్పుడు వేల మంది చెన్నైలోనే చచ్చిపోయారు. మృతదేహాలను ఇంట్లో పెట్టుకుని, వాటికి సంస్కారం ఎలా చెయ్యాలో తెలీక గిజగిజలాడారు. కొన్ని వేల ఇళ్లు మునిగిపోయాయి. నదులు పొంగి వీధుల్లోకి, ఇళ్లల్లోకి దూకాయి. సమాచార సాధనాలు దెబ్బతిన్నాయి. ఆ మధ్య హైదరాబాద్‌లో, ఇటీవల ముంబైలో, మొన్ననే కేదార్‌నాథ్‌లో జరిగిన అనర్థాల గురించి మనం చదువుకున్నాం. ఇప్పుడు టీవీలలో, చదువుకున్న చాలా గొప్పగొప్ప వారు- పర్యావర ణాన్ని గురించీ, మరి కొందరు నగరంలో అక్రమకట్టడాల గురించీ చాలా ఆవేశంగా ప్రసంగించారు. ఇవి కాలిన చేతులకి చాలనన్ని ఆకులు. ఆ రోజుల్లోనే- కేదార్ విలయం జరిగినప్పుడు ఒక చానల్ శివుడు మూడో కన్ను తెరిచాడని చాలా హృదయ విదారకమైన పాటను వేసి ఆ దృశ్యాల్ని రక్తి కట్టించింది. శివుడు మూడో కన్ను, ముప్పయ్యవ కన్ను తెరిచేంత మూర్ఖుడు కాదు- ఆయన దేవుడని కొందరయినా నమ్మితే. శివుడు లాలూప్రసాద్ యాదవ్ కాదు. సోనియాగాంధీ కాదు. ములాయంసింగ్ కాదు. సంవత్సరాల తరబడి- తెలివైన స్వార్థపరులు- చెయ్యకూడని పనులు చేస్తూ, అక్రమంగా కట్టడాలను కట్టి డబ్బు చేసుకుంటూంటే- ధర్మానికీ, బాధ్యతకీ అర్థం తెలీని- నేలబారు ఉద్యోగులు, రాజకీయ నాయకులు, వ్యాపారులూ గడ్డికరుస్తూ ఉంటే- మానవాళిని కాపాడటానికి నీటి గమనానికి ఉద్దేశించిన ఆ స్థలాలలో భవనాలు లేస్తే- నూరేళ్ల తర్వాత మునిగిపోయాయని ఏడిస్తే ఏం లాభం? అడిగే నాథుడూ, సంజాయిషీ చెప్పే నాయకుడూ ఎక్కడ? ఎవరి హయాంలో ఎవరు గడ్డి తిన్నారు? మీనంబాక్కం విమానాశ్రయం, చెంబురు బాక్కం నదీ పరీవాహక ప్రాంతమట. ఇది నూరు సంవత్సరాలు మనకి తెలియని విషయం. చెన్నైలో కురిసిన 100 సెంటిమీటర్ల కనీవినీ ఎరుగని వర్షపు నీటిని అలవోకగా సముద్రానికి చేర్చగలిగిన కొన్ని వేల (కనీసం 2 వేలు!) నీటి మార్గాలలో ప్రస్తుతం భవనాలున్నాయని పెద్దలు నిన్న టీవీల్లో చెప్పారు. ఈ తిలాపాపం ఎవరిది? ప్రకృతికి నోరులేదు. చెప్పదు. చేసి చూపుతుంది. హెచ్చరించదు. తిరగబడుతుంది. తలవొంచు కోదు. తలవొంచుతుంది - అది ప్రాథమిక శక్తి కనుక.18 సంవత్సరాల కిందట- నేను చెన్నైలో కొనాలనుకున్న స్థలంలో ఒక నుయ్యి ఉండేది. అది మూసివేస్తే కాని కుదరని పరిస్థితి. పెద్దలు నా చేత శాంతి చేయించి, నష్టపోతున్న నీటి వనరుకి ప్రత్యామ్నాయాన్ని నిర్దేశింపజేసి- అప్పుడు మూయనిచ్చారు. ఒక చిన్న నుయ్యి అవసరాన్ని గుర్తుపట్టి హెచ్చరించిన సంస్కృతి మనది. దీనికి మరో పేరుంది - ధర్మం. ఈ సృష్టిలో భూమి మీద తిరిగే వానపాముకీ, పిచ్చుకకీ, పక్షికీ, సీతాకోకచిలకకీ, చెట్టుకీ, పుట్టకీ ఒక ప్రయోజనం ఉంది. మానవుడు నిస్వార్థంగా వాటిని కాపాడుతూ సహజీవనం చేశాడు. ఈ ప్రకృతిని దేవతలాగ భావించి, గౌరవించి, పూజించాడు. ఆ కారణానికే మానవుల శ్రేయస్సుని శతాబ్దాలుగా కాపాడింది ప్రకృతి. దీనికి మరో పేరుంది- మతం. బాధ్యతారాహిత్యంగా తనని దోచుకునే మాన వాళిని ప్రకృతి ఎప్పటికప్పుడు నిశ్శబ్దంగా హెచ్చరిస్తూనే ఉంది. ఇటీవల దోపిడీ ఎక్కువయింది కనుక, హెచ్చ రికలు తరుచుగా వినవస్తున్నాయి. ప్రకృతిది మౌనశక్తి. మహా ప్రళయం. దానికి శివుడూ, కాకరకాయా అని పేరు పెట్టి ‘మెలోడ్రామా’ని చానళ్లు అమ్ముకుంటే- అది మరో ఆత్మవంచన అవుతుంది. సృష్టి ప్రాథమిక శక్తి. ఏ వంచనకూ లొంగదు. నిన్నటి చెన్నై అందుకు పెద్ద ఉదాహరణ. - గొల్లపూడి మారుతిరావు