breaking news
Seetha Ramam Movie
-
డిప్రెషన్లోకి వెళ్లిన మృణాల్.. చనిపోవాలనుకుందట!
టీవీలో ‘కుంకుమ‘ పెట్టుకొని ప్రారంభించి, నేడు సిల్వర్ స్క్రీన్ పై ‘సూపర్’గా మెరుస్తోంది. బ్యూటీకి బ్రెయిన్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఆమెను చూస్తే చాలు, ఎమోషన్ , ఎలిగెన్స్, ఎక్స్ప్రెషన్– అన్నింటికీ చిరునామా! మారిన మృణాల్ చెప్పిన ముచ్చట్లు!మృణాల్ ఠాకూర్ ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ సరసన నటించబోతుందనే వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.నటి కావాలనేది మృణాల్ చిన్నప్పటి కోరిక. కానీ సినిమా రంగంపై అపోహల వల్ల ఆమె తల్లిదండ్రులు మొదట అందుకు అంగీకరించలేదు. ఒకరోజు ఆమె తండ్రికి ‘త్రీ ఇడియట్స్’ సినిమాను చూపించి, నటి అయితే ఇలాంటి మంచి సినిమాల్లో నటించే అవకాశం ఉంటుందని నచ్చజెప్పింది.అందుకే ప్రతి సినిమా చేసేముందు, తన తల్లిదండ్రులు గర్వపడేలా పాత్ర ఉందా లేదా అని చూసుకుని గ్రీన్ సిగ్నల్ ఇస్తానని మృణాల్ చెబుతుంది.మృణాల్ టీవీ సీరియల్స్‌తో కెరీర్ ప్రారంభించింది. ‘కుంకుమ రేఖ’ సీరియల్ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. కాని, ఆడిషన్లకు వెళ్లేటప్పుడు టీవీ నటి అనే ట్యాగ్‌తో చాలామంది చులకనగా చూసేవారు. కొన్నిసార్లు డిప్రెషన్‌ను తట్టుకోలేక, లోకల్ ట్రైన్ నుంచి దూకేయాలనిపించినా, తల్లిదండ్రులు గుర్తొచ్చి ఆగిపోయేదట!హృతిక్ రోషన్, షాహిద్ కపూర్ అంటే మృణాల్‌కు విపరీతమైన అభిమానం. హృతిక్‌తో ‘సూపర్ 30’, షాహిద్‌తో ‘జెర్సీ’ సినిమాల్లో నటించే అవకాశం వచ్చినప్పుడు ఆనందంతో పొంగిపోయింది.తెలుగు ఇండస్ట్రీలో ఆమెకు మొదటి పరిచయం దర్శకుడు నాగ్ అశ్విన్ ద్వారా. అప్పుడే తెలుగు పరిశ్రమపై ఒక స్పష్టమైన అభిప్రాయం ఏర్పడిందట! హను రాఘవపూడి ‘సీతారామం’ కథ చెప్పగానే, ఆ కథలో హీరోయిన్ పాత్రతో ప్రేమలో పడిపోయిందట. ఆ తర్వాత ‘హాయ్ నాన్న’, ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాల్లో నటించింది. ఆమె పెర్ఫార్మెన్స్కి మంచి పేరు వచ్చింది.తన టీవీ కాలంలో పని చేసిన కొంతమంది నటులు, రచయితలు, మ్యూజిక్ డైరెక్టర్లు, హీరోలతో మృణాల్ పేరు కలిపి డేటింగ్ రూమర్లు వచ్చాయి. వాటిపై ఆమె స్పందిస్తూ, ‘నేను ఎవరితో రిలేషన్లో ఉన్నాను, ఎవరితో బ్రేకప్– ఇవన్నీ పబ్లిక్‌కి చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లి చేసుకున్నప్పుడు ఎలాగైనా చెబుతాను’ అని చెప్పింది.హీరోయిన్గా సినిమాల్లో బిజీగా ఉన్నా, వెబ్ సిరీస్‌లకు కూడా ఆసక్తి చూపుతోంది. ఇందుకు ప్రధాన కారణాలుగా తక్కువ పని రోజులు, విభిన్నమైన పాత్రలు, ఎక్కువ రీచ్ వస్తుందని చెప్పింది.మాతృభాష మరాఠీ అయినా, తెలుగు భాష కూడా దగ్గరగా ఉందని, కొద్దిగా బ్రోకెన్ తెలుగులో మాట్లాడగలనని మృణాల్ చెప్పింది.తన కాలేజ్ ఫ్రెండ్స్ క్షేమ, అనుశ్రీ జైన్ ఆమెకు బెస్ట్ ఫ్రెండ్స్. షూటింగ్‌లతో బిజీగా ఉన్నా వాళ్లతో తరచు ట్లాడుతుంటుందట!టీవీ సీరియల్స్‌లో పనిచేస్తున్న రోజుల్లో తరచు అపార్ట్మెంట్లు మార్చాల్సి వచ్చేది. ఒక్కో సీరియల్ నెలల తరబడి, ఏళ్ల తరబడి సాగేది. షూటింగ్ లొకేషన్‌కి దగ్గరగా, తక్కువ రెంటులో ఉండే ఫ్లాట్లను ఎంచుకునేది. ఆ సమయంలో వంట పని యాక్టింగ్ కంటే కష్టంగా అనిపించేదట!తెలుగు షూటింగ్లకి వచ్చినప్పుడు ఇడ్లీ, వడ ఆమె ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్. టిఫిన్ కంటే చట్నీలు తినడానికి ఇష్టపడుతుంది మృణాల్.మృణాల్‌కు చెందిన డేట్స్, రెమ్యునరేషన్ వంటి విషయాలు ఆమె సోదరి లోచన్ చూసుకుంటుంది. షూటింగ్లలో బిజీగా ఉన్నప్పుడు గంటన్నర, రెండు గంటలకంటే ఎక్కువ నిద్రపోయే అవకాశం ఉండదట. ఎక్కువగా ఫ్లైట్ జర్నీల్లోనే నిద్రపోతుంటుందట మృణాల్. -
రిలేషన్షిప్ కష్టం.. ఎగ్ ఫ్రీజింగ్ గురించి ఆలోచిస్తున్నా: మృణాల్
తెలుగు సినిమాల్లోకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు. అలా వచ్చిన ముంబయి బ్యూటీ మృణాల్ ఠాకుర్. 'సీతారామం'తో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. 'హాయ్ నాన్న', 'ఫ్యామిలీ స్టార్'తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. కొత్త ప్రాజెక్టులు ఒప్పుకొనే విషయంలో ఆచితూచి వ్యహరిస్తున్న మృణాల్.. రిలేషన్, పిల్లలు కనడం గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. హ్యుమన్స్ ఆఫ్ బాంబే అనే యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో తన అభిప్రాయల్ని బయటపెట్టింది.'కెరీర్, జీవితం.. ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేయడం చాలా ముఖ్యం. కానీ మనం ఎప్పుడూ దానిని ఎలా చేయాలనే దాని గురించి ఆలోచిస్తూనే ఉంటాం. రిలేషన్షిప్ అంటే కష్టమనే విషయం నాకు తెలుసు. మనం చేసే పనిని అర్థం చేసుకునే భాగస్వామి దొరకడం చాలా అవసరం. అలానే ఎగ్ ఫ్రీజింగ్ గురించి కూడా ఆలోచిస్తున్నాను' అని మృణాల్ ఠాకుర్ చెప్పుకొచ్చింది.మృణాల్ చెప్పిన దానిబట్టి చూస్తే.. ఇప్పట్లో బాయ్ ఫ్రెండ్, పెళ్లి లాంటివి ఉండవనమాట. ఇక ఎగ్ ఫ్రీజింగ్ అనే మాట మనకు కొత్తేమో కానీ హీరోయిన్లకు ఈ మధ్య కాస్త కామన్ అయిపోతుంది. ఓ దశ దాటిన తర్వాత నిల్వ చేసిన తమ అండాలతో పిల్లల్ని కనడాన్నే ఎగ్ ఫ్రీజింగ్ అంటారు. వయసులో ఉన్నప్పుడు పిల్లల్ని కంటే కెరీర్ ఇబ్బందుల్లో పడొచ్చనే భయంతో ఈ విధానంపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ల దారిలోనే మృణాల్ కూడా వెళ్లబోతుందనమాట. -
ఏడ్చేసిన సీతారామం బ్యూటీ.. ఎందుకో తెలుసా?
బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత సినిమాల్లో క్రేజ్ తెచ్చుకున్న సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్. బాలీవుడ్లో కొన్ని సినిమాలే చేసినా సీతారామం సినిమాతోనే ఫేమ్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో ఆమె అందానికి యూత్ ఫిదా అయ్యారు. ఆ సినిమాతో ఏకంగా దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ పెంచుకుంది బ్యూటీ. అయితే తాజాగా మృణాల్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది తాజాగా తన ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫోటోలో మృణాల్ ఠాకూర్ ఏడుస్తూ కనిపించింది. ఇది చూసిన ఆమె అభిమానులు ఏంటా అని ఆరా తీస్తున్నారు. అయితే గతంలో తనకెదురైన చేదు అనుభవాలను వివరించేందుకే ఆ ఫోటోను షేర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం సంతోషంగానే ఉన్నానని వివరించింది. మృణాల్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాస్తూ.. 'నిన్న చాలా కష్టంగా గడిచింది. కానీ ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నా. ప్రతి ఒక్కరి కథలో కొన్ని చదవని పేజీలు కూడా ఉంటాయి. కానీ నేను వాటిని అందరితో పంచుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే నేను నేర్చుకున్న పాఠాన్ని ఇతరులకు నేర్పాలి.' అంటూ ఏడుస్తున్న ఆ ఫోటోను పంచుకున్నారు. మరో వీడియోను షేర్ చేస్తూ.. 'నాకు కఠిన పరిస్థితులు ఎదురైన రోజుల్లో ఆ ఫోటో తీసుకున్నా. కానీ ఈ రోజు మాత్రం అలా లేదు. చాలా సంతోషంగా ఉన్నా. నేను అనుకున్నది సాధించా.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: మృణాల్ ఠాకూర్‌కు బెదిరింపులు.. అసలేం జరిగింది!) కాగా..మృణాల్ 2012లో ముజ్సే కుచ్ కెహ్తీ...యే ఖామోషియాన్ అనే టీవీ షోతో తన ద్వారా నటన జీవితాన్ని ప్రారంభించింది. కుంకుమ్ భాగ్యతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 2018లో లవ్ సోనియాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. బాలీవుడ్లో సూపర్ 30, బాట్లా హౌస్, ఘోస్ట్ స్టోరీస్, తుఫాన్, ధమాకా వంటి చిత్రాలలో కనిపించింది. ఆ తర్వాత మరాఠీ, తెలుగు చిత్రాలలో కూడా కనిపించింది. అయితే దుల్కర్ సల్మాన్ సరసన నటించిన చివరి తెలుగు చిత్రం సీతారామం సూపర్ హిట్ అయ్యింది.మృణాల్ ఇటీవల అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీల చిత్రం సెఫ్లీలో కనిపించింది. ఇవే కాకుండా పూజా మేరీ జాన్, ఆంఖ్ మిచోలీ, తెలుగు నటుడు నానితో కలిసి నటించనుంది. -
Fashion: జెట్ బ్లాక్ చీరలో మృణాల్! సారీ ధర ఎంతంటే..!
‘లవ్ సోనియా’తో బాలీవుడ్లో మెరిసిన తార మృణాల్ ఠాకూర్. తాజాగా ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. స్క్రీన్ మీద తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటున్నట్టే ఫ్యాషన్‌లోనూ తనకంటూ ఓ స్టయిల్‌ను క్రియేట్ చేసుకుంది మృణాల్. ఆ స్టయిల్ క్రియేషన్‌లో ఈ బ్రాండ్స్ కూడా భాగమే! పిచ్చిక నెమలి పింఛంలోని ఈకలను తలపించేంత మృదువైన ఫాబ్రిక్స్, ప్రకృతిని మరపించేన్ని రంగులు, డిజైన్లు పిచ్చిక లేబుల్ ప్రత్యేకతలు. ఆ డిజైన్స్ అన్నీ కూడా జైపూర్ హ్యాండ్ పెయింటింగ్స్, హ్యాండ్ ప్రింట్స్, ఎంబ్రాయిడరీలే. తన కళాత్మక దృష్టితో ఈ లేబుల్‌కు వన్నెలు అద్దిన డిజైనర్ ఊర్వశి సేథీ. ఈ బ్రాండ్ దుస్తులు ఆన్లైన్లో లభ్యం. ధరలు ఓ మోస్తరు రేంజ్లో ఉంటాయి. ఓలియో ఆష్నా సింగ్, స్నేహా సక్సేనా అనే ఇద్దరు స్నేహితులు కలసి ఏర్పాటుచేసిన బ్రాండ్ ‘ఓలియో’. ఈ జ్యూవెలరీ బ్రాండ్‌ను స్థాపించక ముందు ఆష్నా మీమ్స్ క్రియేటర్‌గా పాపులర్. స్నేహా.. నిఫ్ట్‌లో ఫ్యాషన్ డిగ్రీ చేసింది. దుస్తులు, యాక్సెసరీస్, జ్యూవెలరీ డిజైనింగ్‌లో దిట్ట. ఈ ఇద్దరూ కలసి సొంతంగా ఓ ఫ్యాషన్ బ్రాండ్‌ను స్టార్ట్ చేయాలనుకుని 2015లో ‘ఓలియో’కు రూపమిచ్చారు. స్నేహ.. డిజైనింగ్ చూసుకుంటే, ఆష్నా.. బ్రాండ్ వ్యవహార బాధ్యతలను నిర్వర్తిస్తోంది. ఓలియో జ్యూవెలరీ ఆన్లైన్లో లభ్యం. ధరలూ అందుబాటులోనే. బ్రాండ్ వాల్యూ జెట్ బ్లాక్ చీర బ్రాండ్: పిచ్చిక ధర: రూ. 21,500 ఇయర్ రింగ్స్ బ్రాండ్: ఓలియో ధర: రూ. 8,050 ఇండియన్ కర్దాషియాన్ అని పిలిచారు నటిగా కొనసాగాలంటే ఫిట్నెస్ అవసరమని అనుభవం ద్వారా తెలుసుకున్నాను. ఒకసారి అమెరికా వెళ్లినప్పుడు అక్కడ నన్నంతా ఇండియన్ కర్దాషియాన్ అని పిలిచారు. నాలాంటి శరీరాకృతి తెచ్చుకోవడానికి వాళ్లు లక్షల్లో డబ్బు ఖర్చు పెడతారట. ఆ మాట విన్నాక నా మీద నాకు ఎక్కడలేని కాన్ఫిడెన్స్ పెరిగింది – మృణాల్ ఠాకూర్. -దీపికా కొండి చదవండి: Fashion-Velvet Long Jacket: సింపుల్ లుక్‌ను ‘రిచ్’గా మార్చేయగల వెల్వెట్ లాంగ్ జాకెట్! Nazriya Nazim Saree Cost: నజ్రియా ధరించిన ఈ చీర ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! స్పెషాలిటీ? -
పాన్ఇండియా స్టార్డమ్ కోసం రష్మిక పక్కా ప్లాన్!
పాన్ ఇండియా స్టార్ డమ్ కోసం రష్మిక సీరియస్ గా ట్రై చేస్తోంది. సరిలేరు నీకెవ్వరు, పుష్ప చిత్రాలతో టాలీవుడ్ లో లీడింగ్ లేడీగా మారింది రష్మిక. త్వరలో పుష్ప2లో నటించబోతోంది. కోలీవుడ్ పై కూడా రష్మిక సీరియస్ గా ఫోకస్ పెట్టింది. బీస్ట్ హీరో విజయ్ తో కలసి కొత్త చిత్రంలో నటించబోతోంది. విజయ్ నటిస్తున్న ఈ తెలుగు,తమిళ చిత్రాన్ని వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నాడు. కోలీవుడ్ లో టాప్ ఫామ్ లో ఉన్న విజయ్ తో మూవీ ఛాన్స్ అంటే తమిళ సినీ పరిశ్రమలో రష్మికకు ఇన్ స్టెంట్ గా స్టార్ డమ్ కన్ ఫామ్ అన్నట్లే లెక్క. హిందీలోనూ రెండు పెద్ద సినిమాల్లో నటిస్తోంది. అమితాబ్ తో కలసి గుడ్ బై, సిద్ధార్ద్ మల్హోత్రా జతగా మిషన్ మజ్ను చిత్రాల్లో కనిపించనుంది. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదే బాలీవుడ్ ఆడియెన్స్ ముందుకు రానున్నాయి. పుష్పతో ఆల్రెడీ బాలీవుడ్ ఆడియెన్స్ కు దగ్గరైంది రష్మిక. ఈ రెండు స్ట్రెయిట్ హిందీ మూవీస్ కూడా వర్క్ అవుట్ అయితే మాత్రం నేషన్ క్రష్ అక్కడ మామూలుగా ఉండదు. సొంత ఇండస్ట్రీ శాండల్ వుడ్ లో ఎలాగూ రష్మికకు స్టార్ ఇమేజ్ ఉంది. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ సినిమా సీతారామం మూవీతో మాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో ఆఫ్రిన్ పాత్రలో కనిపించబోతోంది రష్మిక.పేరుకి తెలుగు చిత్రమే అయిన సీతారామం మూవీని మాలీవుడ్, కోలీవుడ్ లో కూడా విడుదల చేయబోతున్నారు. హను రాఘవపూడి మేకింగ్ లో తెరకెక్కుతున్న చిత్రమిది. మాలీవుడ్ డెబ్యూట్ మూవీనే అక్కడి హార్ట్ త్రోబ్ దుల్కర్ చిత్రం కావడంతో, రష్మిక ఆల్ మోస్ట్ పాన్ ఇండియా హీరోయిన్ గా దూసుకుపోతున్నట్లే లెక్క. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1141264918.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
దుల్కర్ సల్మాన్, రష్మికల కొత్త చిత్రం టైటిల్ ఇదే
దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్విని దత్, ప్రియాంక్ దత్ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో మృణాళిని ఠాకూర్ సీత పాత్ర లో కనిపించనుంది. అఫ్రీన్ అనే కశ్మీర్‌కు చెందిన ముస్లిం యువతిగా రష్మిక నటిస్తోంది. శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ని వెల్లడిస్తూ ఓ వీడియోని విడుదల చేశారు నిర్మాతలు. ఈ చిత్రానికి ‘సీతారామం’అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. రష్మిక పాత్రలో హనుమాన్ షేడ్స్ ఉన్నాయి. రామాయణంలో శ్రీరాముడికి ఆంజనేయుడు సహాయం చేసినట్లుగా.. యుద్దంలో మద్రాస్ ఆర్మీ ఆఫసర్ లెఫ్ట్‌నెంట్ రామ్( ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ పాత్ర పేరు)కు రష్మిక సహాయం చేస్తుంది. ఇది ఓ సైనికుడు శత్రువుకు అప్పగించిన యుద్దం అఫ్రీన్.. ఈ యుద్దంలో సీతారాములను నువ్వే గెలిపించాలి’అనే సుమంత్ వాయిస్ ఓవర్ ప్రారంభమైన ఈ స్పెషల్ వీడియో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తుండగా దివాకర్ మణి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.