breaking news
Scorpene class submarines
-
ఐఎన్ఎస్ కరంజ్ శత్రు దుర్భేధ్యం
సాక్షి, ముంబై : ప్రతిష్టాత్మక స్కార్పిన్ శ్రేణి సబ్ మెరైన్లలో మూడో సబ్ మెరైన్ ఐఎన్ఎస్ కరంజ్ బుధవారం జల ప్రవేశం చేసింది. ముంబైలోని మజ్గావ్ డాక్ యార్డ్‌లో కరంజ్ జల ప్రవేశాన్ని నేవీ అధికార లాంఛనాలతో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి నేవీ చీఫ్ సునీల్ లాంబా చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఫ్రాన్స్ సాంకేతిక సహకారంతో మజ్గావ్ డాక్లో స్కార్పిన్ తరగతికి చెందిన ఆరు సబ్ మెరైన్లను భారత్ రూపొందిస్తోంది. నీటి లోపల శత్రువుల సోనార్‌కు తన ఉనికిని తెలియనివ్వకుండా, దాడులు చేయగలగడం కరంజ్ సామర్ధ్యం. కరంజ్ నుంచి విడుదలయ్యే ధ్వని, రేడియేషన్ చాలా తక్కువగా ఉంటుంది. ఇతర సబ్మెరైన్లతో పోల్చితే నీటి లోపల కరంజ్‌ను గుర్తించడం అతి కష్టం. సముద్ర లోతుల్లో ఉండే నీటిలో దీని రంగు కలిసిపోవడమే ఇందుకు కారణం. ఆరు స్కార్పిన్ తరగతి సబ్మెరైన్లలో ఐఎన్ఎస్ కరంజ్ మూడోది. 2017 డిసెంబర్లో ఐఎన్ఎస్ కల్వరి(స్కార్పిన్ క్లాస్ తొలి సబ్ మెరైన్) నేవీలోకి రంగ ప్రవేశం చేసింది. 2017 జనవరిలో ఖండేరీ సబ్‌మెరైన్‌ను సీ ట్రయల్స్ కోసం లాంచ్ చేశారు. ప్రస్తుతం దీని ట్రయల్స్ ఇంకా కొనసాగుతున్నాయి. త్వరలోనే ఖండేరీ కూడా భారత నేవీలోకి అధికారికంగా చేరనుంది. కాగా, ఇప్పటివరకూ పాత తరాలకు చెందిన సబ్మెరైన్లతో ఇబ్బందులు పడుతున్న భారత నేవీకి స్కార్పిన్ తరగతి సబ్మెరైన్ల రాక కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. స్కార్పిన్ శ్రేణి ప్రత్యేకత ఇదే.. స్కార్పిన్ శ్రేణి జలాంతర్గాములను రకరకాల మిషన్ల కొరకు వినియోగించుకునే అవకాశం ఉంది. నీటిలోపల నుంచి ఉపరితలంపై గల లక్ష్యాలను చేధించేందుకు, శత్రువుల జలాంతర్గాములను నాశనం చేసేందుకు, గూఢచర్యం రీత్యా, శత్రువులపై డేగ కన్ను వేయడానికి స్కార్పిన్ తరగతి సబ్మెరైన్లు ఉపయోగపడతాయి. అంతేకాకుండా ప్రత్యేక పరిస్థితుల్లో నావల్ టాస్క్ ఫోర్స్ వద్ద ఉన్న పలు ఆయుధాలను ప్రయోగించగల సామర్ధ్యం వీటి సొంతం. -
మహా సాగరంలో కల్వరి అద్భుతం
న్యూఢిల్లీ : మహా సాగరంలో ఐఎన్ఎస్ కల్వరి అద్భుత విన్యాసాల వీడియోను భారతీయ నేవీ విడుదల చేసింది. జల ప్రవేశం చేసి 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా సాగరంలో కల్వరి ట్రయల్స్‌ను విడుదల చేస్తున్నట్లు నేవీ పేర్కొంది. భారత్ అమ్ములపొదిలో ఉన్న నాన్ న్యూక్లియర్ సబ్మెరైన్లలో కల్వరి అత్యంత శక్తిమంతమైనది. ఫ్రాన్స్ దేశం డిజైన్ చేసిన స్కార్పిన్ తరగతికి చెందిన కల్వరిని ఈ నెల ప్రారంభంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేవీలోకి కమిషన్ చేసి, జాతికి అంకితం చేశారు. వాస్తవానికి కల్వరిని 1967లో నేవీలోకి కమిషన్ చేశారు. 30 ఏళ్ల సేవల అనంతరం 1996 మే 31న కల్వరిని నేవీ డీ కమిషన్ చేసింది. అయితే, ప్రాజెక్టు -75లో భాగంగా ఆరు స్కార్పిన్ తరగతికి చెందిన సబ్మెరైన్లను డిజైన్ చేసేలా ఫ్రాన్స్-భారత్‌ల మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో వాటి శ్రేణిలో వచ్చిన తొలి సబ్‌మెరైన్‌కు ‘కల్వరి’ అని నామకరణం చేశారు. 2015లో ట్రయల్స్ కోసం తొలిసారి కల్వరి జల ప్రవేశం చేసింది. కల్వరికి 50 పూర్తి కావడంతో ట్రయల్స్‌లో అది చేసిన అద్భుతాలను నేవీ విడుదల చేసిన వీడియోలో చూపింది. సముద్ర లోతుల్లో తిరుగులేని చేపగా పేరున్న టైగర్ షార్క్‌ను దృష్టిలో పెట్టుకుని కల్వరి అనే పేరును పెట్టారు. డిజిల్ ఎలక్ట్రిక్ ఇంజిన్‌తో నడిచే కల్వరి అతి తక్కువ శబ్దం చేస్తూ శత్రువుల రేడార్కు దొరకదు. అంతేకాకుండా కల్వరి సముద్ర అంతర్భాగం నుంచి ఉపరితలం మీదుగా క్షిపణులను ప్రయోగించగలదు. 2020 కల్లా ప్రాజెక్టు - 75 కింద రూపొందే సబ్ మెరైన్లు అన్ని నేవీ చేతికి అందనున్నాయి. -
కల్వరి అద్భుత విన్యాసాలు