breaking news
Science fiction movie
-
టాలీవుడ్లో రాబోతున్న సైన్స్ ఫిక్షన్ సినిమాలివే
సైన్స్ ఫిక్షన్ స్టోరీస్ భలే ఉంటాయి. అందుకే అలాంటి కథలకు చాన్స్ వచ్చినప్పుడు స్టార్ హీరో నుంచి స్మాల్ హీరో వరకూ వెంటనే ‘సై’ అనేస్తారు. ప్రస్తుతం తెలుగులో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ సినిమాలు పది వరకూ ఉన్నాయి. ఆ సైన్స్ ఫిక్షన్స్ గురించి తెలుసుకుందాం.సత్యలోకం నేపథ్యంలో...చిరంజీవి హీరోగా రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్‌పై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాట నిర్మించారు. సోషియో ఫ్యాంటసీ, సైన్స్ ఫిక్షన్ జానర్లో రూపొందిన ‘విశ్వంభర’ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని ఫిల్మ్‌నగర్ టాక్. ‘‘మనకి తెలిసినవి 14 లోకాలు. కింద 7 లోకాలు, పైన 7 లోకాలు. ఆ 14 లోకాలకు పైన ఉన్న లోకమే సత్యలోకం. యమలోకం, స్వర్గం, పాతాళలోకం.. అన్నీ చూసేశాం. ‘విశ్వంభర’ కోసం వాటన్నింటిని దాటి నేను పైకి వెళ్లాను. బ్రహ్మదేవుడు ఉండే సత్యలోకాన్ని మా సినిమాలో చూపించాం. ఆ లోకంలో ఉండే హీరోయిన్ను వెతుక్కుంటూ హీరో 14 లోకాలు దాటి వెళ్లి తిరిగి భూమి మీదకు ఆమెను ఎలా తీసుకొచ్చాడు? అనేది ఈ చిత్రకథ’’ అంటూ ఓ ఇంటర్వ్యూలో ‘విశ్వంభర’ స్టోరీ లైన్ చెప్పారు డైరెక్టర్ వశిష్ట. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న విడుదల కావాల్సి ఉండగా 2026 వేసవిలో విడుదలకు వాయిదా వేశారు మేకర్స్. ‘‘విశ్వంభర’ ఒక చందమామ కథలా సాగిపోయే అద్భుతమైన కథ. చిన్నపిల్లలకు, పెద్దవాళ్లలో ఉండే చిన్న పిల్లలను సైతం ఇది అలరిస్తుంది.. వినోదపరుస్తుంది. ‘విశ్వంభర’లో సెకండ్ హాఫ్ మొత్తం వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ మీద ఆధారపడి ఉంది. ప్రేక్షకులకు అత్యున్నతమైన ప్రమాణాలతో బెస్ట్ క్వాలిటీ అందివ్వాలని మేం కష్టపడుతున్నాం’’ అని హీరో చిరంజీవి తెలిపిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ’సంక్రాంతికి రాజాసాబ్‘బాహుబలి’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్నారు ప్రభాస్ . ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఆ తర్వాత ‘సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి 2898 ఏడీ..’ ఇలా వరుసగా భారీ పాన్ ఇండియా సినిమాలు చే స్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. పీరియాడికల్ హారర్ కామెడీ, సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ప్రభాస్ స్టైల్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, హారర్, కామెడీ అంశాల సమ్మిళితంగా ఈ మూవీ రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా లుక్స్, టీజర్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇండస్ట్రీలోనూ మంచి బజ్ నడుస్తోంది. పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వస్తుందని చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘‘ప్రభాస్‌గారిని ‘బుజ్జిగాడి’ సినిమా స్టైల్లో ‘ది రాజా సాబ్’ ద్వారా వింటేజ్ లుక్‌లో చూపిస్తున్నాం’’ అంటూ మారుతి తెలిపారు. ‘‘మా సంస్థ నుంచి వస్తున్న బిగ్గెస్ట్ ఫిల్మ్ ‘ది రాజా సాబ్’. ఈ సినిమా కోసం బిగ్గెస్ట్ ఇండోర్ సెట్ వేశాం. 40 నిమిషాల కై్లమాక్స్ ఎపిసోడ్ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది’’ అని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ పేర్కొన్నారు. హాలీవుడ్ స్థాయిలో...‘పుష్ప: ది రైజ్, పుష్ప 2: ది రూల్’ వంటి చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటారు అల్లు అర్జున్. అంతేకాదు... ‘పుష్ప: ది రైజ్’కి గానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కూడా అందుకున్నారాయన. ‘పుష్ప’ ఫ్రాంచైజీ తర్వాత తమిళ దర్శకుడు అట్లీతో సినిమా చేస్తున్నారు అల్లు అర్జున్. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందుతోన్న ‘ఏఏ 22 ఏ 6’(వర్కింగ్ టైటిల్) చిత్రాన్ని కళానిధి మారన్ సమర్పణలో సన్‌పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్గా బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ ఫిక్స్ అయ్యారు. ఈ సినిమా కోసం లాస్ ఏంజిల్స్ వెళ్లి అక్కడ వీఎఫ్ఎక్స్ కంపెనీలతో, వీఎఫ్ఎక్స్ ఆర్టిస్టులతో సమావేశం అయింది చిత్రయూనిట్. సైన్స్ ఫిక్షన్ జానర్లో రూపొందుతోన్న ఈ సినిమా కోసం హాలీవుడ్ సినిమాలకు ధీటుగా ఓ కొత్త ప్రపంచం క్రియేట్ చేస్తోందట యూనిట్. పాన్ ఇండియా కాదు,.. పాన్ వరల్డ్ స్కేల్లో ఈ మూవీ రూపొందనుందనే వార్తలూ వినిపించాయి. ‘‘పుష్ప’ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా ఎలా ఉంటుంది? అనే ఆత్రుత అందరిలోనూ నెలకొంది. కొన్ని రోజులు వెయిట్ చేయండి. మీకు మేం ఓ కొత్త ప్రపంచం చూపించడానికి వర్క్ చేస్తున్నాం. ఇప్పటి వరకు మీరు చూడనిది వెండితెరపై చూపిస్తామని భరోసా ఇవ్వగలను. చాలా మంది హాలీవుడ్ టెక్నీషియన్లతో మేం వర్క్ చేస్తున్నాం. వాళ్లు సైతం తమకు ఈ సినిమా సవాల్‌గా ఉందని చెబుతున్నారు. అంటే మేం ఓ భారీ సినిమా చేస్తున్నామని అర్థం’’ అంటూ అట్లీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ‘‘అల్లు అర్జున్ తిరుగులేని ఎనర్జీ, అట్లీ విజన్, దీపికా పదుకోన్ బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్‌లతో ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులకు ఐకానిక్‌గా ‘ఏఏ 22 ఏ 6’ సినిమాను రూపొందిస్తున్నాం’’ అని సన్ పిక్చర్స్ సంస్థ పేర్కొంది. ఈ మూవీకి సాయి అభ్యంకర్ స్వరక్తర. జనవరిలో ఆరంభంకన్నడలో తెరకెక్కిన ‘కాంతార’ చిత్రంతో నటుడిగా, దర్శకుడిగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు రిషబ్ శెట్టి. ఆ సినిమాకి ప్రీక్వెల్‌గా రూపొందిన ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రం ఈ అక్టోబర్ 2న పలు భాషల్లో రిలీజ్ అయి సూపర్ హిట్‌గా నిలిచింది. ‘కాంతార’కు మించి వసూళ్లు సాధించింది ఈ మూవీ. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్న స్ట్రైట్ తెలుగు చిత్రం ‘జై హనుమాన్’. ‘హను–మాన్’ మూవీతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఆ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో హనుమంతుడి పాత్ర పోషిస్తున్నారు రిషబ్ శెట్టి. ‘‘కాంతార : చాప్టర్ 1’ విడుదలకు ముందే మరో సినిమాకు సైన్ చేయాలనుకోలేదు. కానీ, ప్రశాంత్ వర్మ చెప్పిన ‘జై హనుమాన్’ కథ నన్ను ఎంతలా ఆకట్టుకుందంటే, వెంటనే ఆయనకు ఓకే చెప్పాను. స్క్రిప్ట్ అద్భుతంగా ఉంది, కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పటికే ఫొటోషూట్ పూర్తి చేశాం’’ అంటూ ఇటీవల ఓ సందర్భంలో రిషబ్ శెట్టి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో రానా కూడా నటించనున్నారే వార్తలు వస్తున్నాయి. రిషబ్ శెట్టి, రానాతో కలిసి ఉన్న ఫొటోని ప్రశాంత్ వర్మ గతంలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. హనుమంతుడి పాత్ర పోషిస్తున్న రిషబ్ శెట్టిలాంటి నటుడికి ధీటుగా నిలబడాలంటే ఆ స్థాయి దేహం, ఆహార్యం ఉండాలంటే రానా కరెక్ట్ అని దర్శకుడి ఆలోచన అట. ‘బాహుబలి’లో ప్రభాస్‌కు ధీటుగా భళ్లాలదేవుడి పాత్రలో రానా నటనను ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోలేరు. మరి... ‘జై హనుమాన్’లో రానా పాత్ర ఏంటి? ఎలా ఉంటుంది? అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.సరికొత్త అనుభూతినాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్?సీ 24’ (వర్కింగ్ టైటిల్). ‘తండేల్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకోవడంతో పాటు తొలిసారి వంద కోట్ల క్లబ్లో చేరారాయన. ‘తండేల్’ వంటి విజయవంతమైన సినిమా తర్వాత ఆయన నటిస్తున్న చిత్రమిది. సాయిదుర్గా తేజ్‌తో ‘విరూపాక్ష’ (2023) వంటి హిట్ మూవీ తర్వాత కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్న చిత్రం కూడా ఇదే. ఇలా... సూపర్ సక్సెస్‌లు అందుకున్న తర్వాత నాగచైతన్య, మీనాక్షీ చౌదరి, కార్తీక్ దండు కాంబినేషన్లో రూ΄÷ందుతోన్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. బాపినీడు సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘తండేల్’లో ఫుల్ మాస్ లుక్‌లో కనిపించిన నాగచైతన్య.. ‘ఎన్సీ 24’లో నాగచైతన్య నెవర్ బిఫోర్ లుక్‌లో కనిపించబోతున్నారు. మిథికల్ థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్‌గా రూ΄÷ందుతోన్న ఈ చిత్రంలో దక్ష అనే ఆర్కియాలజిస్ట్‌గా సరికొత్త ΄ాత్రలో కనిపిస్తారు మీనాక్షీ చౌదరి. ఇటీవల విడుదల చేసిన ఆమె ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ కథలో ఆమె ΄ాత్ర చాలా క్రూషియల్‌గా ఉండబోతోందట. ఎమోషన్స్, పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉండే దక్ష క్యారెక్టర్ ఆమె కెరీర్లో ఓ మైలురాయిగా నిలవనున్నట్లు చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని మేకర్స్ తెలి΄ారు. ఈ సినిమాకి అజనీష్ బి. లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ అడ్వెంచర్నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ‘కార్తికేయ’ (2014), ‘కార్తికేయ 2’ (2022) చిత్రాలు ఎంత సూపర్ హిట్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఒకదానికి మించి ఒకటి బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. ‘కార్తికేయ 2’తో వందకోట్లకు పైగా వసూళ్లు సాధించారు నిఖిల్. కృష్ణతత్వం నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ , అనుపమ్ ఖేర్, హర్ష, శ్రీనివాసరెడ్డి కీలక పాత్రలు పోషించారు. కృష్ణతత్వాన్ని ఉద్దేశించి అనుపమ్ ఖేర్ చెప్పే డైలాగ్స్ సినిమాకే హైలైట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ సూపర్‌హిట్ అందుకుంది. అంతేకాదు... కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 70వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా ‘కార్తికేయ 2’ నిలిచింది. ఈ సినిమాకి కొనసాగింపుగా ‘కార్తికేయ 3’ చిత్రం ఉంటుందని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘‘సరికొత్త అడ్వెంచర్‌ను సెర్చ్ చేసే పనిలో డాక్టర్ కార్తికేయ నిమగ్నమయ్యారు. త్వరలో రానున్నాం’’ అంటూ నిఖిల్ సిద్ధార్థ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం విదితమే. సైన్స్ ఫిక్షన్‌గా రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ‘కార్తికేయ, కార్తికేయ 2’ చిత్రాలతో పోలిస్తే ‘కార్తికేయ 3’ మరింత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందనుందని ఫిల్మ్‌నగర్ టాక్. ఇదిలా ఉంటే... నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ జానర్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సైన్స్ ఫిక్షన్ని కూడా జోడించారట మేకర్స్. ఈ చిత్రం 2026 వేసవిలో విడుదల కానుందని టాక్. ఏటిగట్టుపై అద్భుతం‘విరూపాక్ష, బ్రో’ వంటి హిట్ సినిమాల తర్వాత సాయిదుర్గా తేజ్ నటించిన తాజా చిత్రం ‘ఎస్వైజీ’(సంబరాల ఏటిగట్టు). నూతన దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వం వహించిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్. ప్రైమ్‌షో ఎంటర్టైన్ మెంట్‌పై ‘హను–మాన్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ నిర్మించిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 25న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళంలో విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. అక్టోబరు 15న సాయిదుర్గా తేజ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ‘అసుర ఆగమన’ పేరుతో విడుదల చేసిన ఈ మూవీ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ‘‘నా జీవితంలో ‘ఎస్వైజీ’(సంబరాల యేటిగట్టు) చిత్రం చాలా ముఖ్యమైనది. ఈ సినిమా కోసం నా సర్వస్వం ధారపోశాను. అద్భుతమైన క్వాలిటీతో సినిమా ఇవ్వాలని చాలా కష్టపడుతున్నాం. నిరంజన్, చైతన్యగార్లు ఖర్చుకి వెనకాడకుండా సపోర్ట్ చేశారు. డైరెక్టర్ రోహిత్ తీసిన ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది.. అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇది నా ప్రామిస్’’ అంటూ ఇటీవల సాయిదుర్గా తేజ్ పేర్కొన్నారు. ఈ మూవీకి బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీత దర్శకుడు. పైన పేర్కొన్న సినిమాలే కాదు... మరికొన్ని చిత్రాలు కూడా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ప్రేక్షకులను అలరించేందుకు సమాయత్తం అవుతున్నాయి. -
మహాప్రాణులకు మళ్లీ జీవం!
డైనోసార్లు, మామత్‌లు వంటి ప్రాణులను ఇప్పటి వరకు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లోనూ, టీవీ సిరీస్‌లలోను మాత్రమే చూశాం. ఇలాంటి ప్రాణుల్లో కొన్ని త్వరలోనే మన కళ్ల ముందు సజీవంగా కనిపించనున్నాయి. సహస్రాబ్దాల కిందట అంతరించిపోయిన ప్రాణులు మొదలుకొని, మన కళ్ల ముందే కనుమరుగైపోయిన చాలా ప్రాణులు తిరిగి ప్రాణం పోసుకోనున్నాయి. అంతరించిపోయిన ప్రాణుల పునరుత్థానానికి ఇప్పటి శాస్త్రవేత్తలు సాగిస్తున్న ప్రయత్నాలపై ఒక విహంగ వీక్షణమే ఈ కథనం.పన్యాల జగన్నాథదాసుఈ భూమ్మీద తొలి జీవకణం ఎప్పుడు పుట్టిందో ఎవరికీ తెలీదు. భూమ్మీద మనుషులు పుట్టక ముందే ఎన్నో జీవజాతులు ప్రాణం పోసుకున్నాయి. వాటిలో కొన్ని జీవజాతులు ఆదిమానవుల కాలంలోనే అంతరించిపోయాయి. మన కాలంలోనూ మరికొన్ని జీవజాతులు అంతరించిపోయాయి. ఇంకొన్ని జీవజాతులు ప్రమాదం అంచుల్లో అంతరించిపోయే దశకు చేరువగా ఉన్నాయి. ఒకప్పుడు భూమ్మీద సంచరించిన డైనోసార్లు, మామత్‌లు వంటి వాటి గురించి పుస్తకాల ద్వారా, సైన్స్‌ఫిక్షన్ సినిమాల ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతున్నామే తప్ప వాటిని ఈ భూమ్మీద సజీవంగా చూసిన మనుషులెవరూ ఇప్పుడు లేరు. శతాబ్దాల కిందటే అంతరించిన కొన్ని జీవజాతులు సమీప భవితవ్యంలోనే తిరిగి మన కళ్ల ముందు కనిపించనున్నాయి. అంతరించిపోయిన ప్రాణుల పునరుజ్జీవానికి శాస్త్రవేత్తలు కొన్నేళ్లుగా కొనసాగిస్తున్న ప్రయోగాల్లో కొన్ని ఒక కొలిక్కి వచ్చాయి. మరో నాలుగేళ్లలోనే మామత్‌కు మళ్లీ ప్రాణం పోయనున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదే రీతిలో మరిన్ని జీవులకూ పునర్జీవం కల్పించనున్నట్లు చెబుతున్నారు. అంతరించిపోయిన జీవులకు తిరిగి ప్రాణం పోసే ప్రక్రియను ‘జైవ పునరుత్థానం’గా (బయో రిసరెక్షన్) అభివర్ణిస్తున్నారు.మరో నాలుగేళ్లలోనే మామత్ పునరుత్థానంఎప్పుడో మంచుయుగంలో అంతరించిపోయిన ప్రాణి మామత్. ఏనుగులాంటి భారీ జంతువు ఇది. దీనికి ఏనుగులాగానే తొండం, దంతాలతో పాటు ఒంటి నిండా దట్టంగా రోమాలు ఉండేవి. భూమ్మీద మంచు యుగం 26 లక్షల ఏళ్ల కిందటి నుంచి 11 వేల ఏళ్ల కిందటి వరకు కొనసాగింది. ఆ కాలంలోనే మామత్ భూమ్మీద సంచరించేది. మంచుయుగం ముగిసిన తర్వాత మామత్ జనాభా క్రమంగా క్షీణించింది. నాలుగు వేల ఏళ్ల కిందట ఇది పూర్తిగా అంతరించిపోయింది. సహస్రాబ్దాల కిందటే అంతరించిపోయిన మామత్‌కు పునర్జీవం కల్పించేందుకు శాస్త్రవేత్తలు కొన్నేళ్లుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. మామత్ 2028 నాటికల్లా పునరుత్థానం చెందుతుందని, అప్పటికల్లా దీనికి మళ్లీ ప్రాణం పోయనున్నామని అమెరికన్ స్టార్టప్ కంపెనీ ‘కలోసల్ బయోసైన్సెస్’కు చెందిన శాస్త్రవేత్తలు ఇటీవల ప్రకటించారు.‘కలోసల్ బయోసైన్సెస్’ అమెరికాలోని తొలి డీ–ఎక్స్‌టింక్షన్ కంపెనీ. మామత్ పునరుత్థానం కోసం దీనికి చెందిన అత్యంత కీలకమైన జన్యువులను సేకరించామని ఈ కంపెనీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రాణుల పునరుత్థానం లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ కంపెనీకి ‘పేపాల్’ సహ వ్యవస్థాపకుడు పీటర్ థీల్, సెలబ్రిటీ మోటివేషనల్ స్పీకర్ టోనీ రాబిన్స్ వంటి ప్రముఖులే కాకుండా, అమెరికన్ గూఢచర్య సంస్థ సీఐఏ కూడా భారీ స్థాయిలో నిధులు సమకూరుస్తున్నట్లు అమెరికన్ వార్తా సంస్థ ‘ది ఇంటర్సెప్ట్’ వెల్లడించింది. ‘తొలి మామత్‌కు 2028 ద్వితీయార్ధం నాటికల్లా ప్రాణం పోయాలని లక్ష్యం నిర్ణయించుకున్నాం. ప్రస్తుతం అదే పనిలో పురోగతిలో కొనసాగుతున్నాం.అంతరించిపోయిన జీవుల్లో మొదటిగా పునరుత్థానం పొందే ప్రాణి మామత్ మాత్రమే కాగలదు. దీని గర్భధారణ వ్యవధి ఇరవైరెండు నెలలు. మామత్ జన్యువుల్లో 99.5 శాతం జన్యువులు ఆసియన్ ఏనుగుల్లో ఉన్నాయి. జన్యు సవరణ, మూలకణాల అనుసంధానం ప్రక్రియల ద్వారా ఆడ ఆసియన్ ఏనుగు అండానికి ఫలదీకరణ జరిపి మామత్‌కు పునరుత్థానం కల్పించనున్నాం’ అని కలోసల్ బయోసైన్సెస్ సీఈవో బెన్ లామ్ తెలిపారు.‘జురాసిక్ పార్క్’ మాదిరిగా కాదు స్టీవెన్ స్పీల్బర్గ్ దర్శకత్వంలోని సైన్స్ ఫిక్షన్ సినిమా ‘జురాసిక్ పార్క్’ చాలామంది చూసే ఉంటారు. ఇదే పేరుతో మైకేల్ క్రైటన్ రాసిన నవల ఆధారంగా ఈ సినిమా తీశారు. ఇందులో ఒక పారిశ్రామికవేత్త క్లోనింగ్ ద్వారా పునర్జీవం కల్పించిన డైనోసార్లతో ఒక థీమ్ పార్కు ఏర్పాటు చేస్తాడు. డైనోసార్ల బాగోగులను చూసుకునే ఒక వ్యక్తిని వెలాసిరేప్టర్ జాతికి చెందిన డైనోసార్ చంపేస్తుంది. ఇందులో క్లోనింగ్ కోసం అంతరించిన డైనోసార్ల డీఎన్ఏ ఉపయోగించినట్లుగా ఉంది. కలోసల్ బయోసైన్సెస్ జరుపుతున్న ప్రయోగాల్లో మాత్రం డీఎన్ఏను నేరుగా ఉపయోగించడం లేదు. ‘ జురాసిక్ పార్క్‌లో మాదిరిగా మేము మామత్ డీఎన్ఏను తీసుకుని, దాంతో ఆసియన్ ఏనుగు జన్యువుల రంధ్రాలను పూడ్చే పని చేయడం లేదు. సవరించిన మామత్ జన్యువులను, మూలకణాలను ఆరోగ్యకరమైన ఆడ ఆసియన్ ఏనుగు అండంలోకి ప్రవేశపెట్టి ఫలదీకరణ జరపనున్నాం’ అని బెన్ లామ్ వివరించారు.దశాబ్ద కాలంగా సంఘటిత కృషి అంతరించిపోయిన ప్రాణుల పునరుత్థానికి దాదాపు దశాబ్ద కాలంగా అంతర్జాతీయ శాస్త్రవేత్తలు సంఘటితంగా కృషి చేస్తున్నారు. ప్రాణుల పునరుత్థాన ప్రయోగాల కోసం ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్‌కు (ఐయూసీఎన్) చెందిన స్పీసీస్ సర్వైవల్ కమిషన్ 2014లో డీ ఎక్స్‌టింక్షన్ టాస్క్‌ఫోర్స్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఇందులో వివిధ దేశాలకు చెందిన తొమ్మిదివేల మంది శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. ఈ టాస్క్‌ఫోర్స్‌లోని శాస్త్రవేత్తలు అంతరించిపోయిన ప్రాణుల్లో వేటికి పునరుత్థానం కల్పిస్తే, పర్యావరణానికి ఎక్కువగా మేలు కలుగుతుందో గుర్తించడంతో పాటు ప్రాణుల పునరుత్థాన ప్రయోగాల కోసం ఎంపిక చేసుకున్న ప్రక్రియల సాధ్యాసాధ్యాలపై తమ విశ్లేషణలను అందిస్తారు. మామత్తో పాటు మరికొన్ని అంతరించిపోయిన ప్రాణులకు కూడా తిరిగి ప్రాణం పోయడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికే కొన్ని అంతరించిన ప్రాణులకు చెందిన జన్యుపదార్థాలను సేకరించి, వివిధ దశల్లో ప్రయోగాలు చేస్తున్నారు. వాటి గురించి తెలుసుకుందాం.క్వాగాఇది జీబ్రా జాతికి చెందిన జంతువు. జీబ్రాలా క్వాగాకు ఒంటి నిండా చారలు ఉండవు. తల నుంచి ఛాతీ భాగం వరకు చారలు ఉంటాయి. ఇది లేత గోధుమ రంగులో ఉంటుంది. తల నుంచి ముదురు రంగులో ఉండే ఛారలు ఛాతీ భాగం వద్దకు వచ్చే సరికి మసకబారుతాయి. క్వాగాలు ఒకప్పుడు దక్షిణాఫ్రికాలో విరివిగా కనిపించేవి. చిట్టచివరి క్వాగా 1878లో మరణించినట్లుగా రికార్డులు ఉన్నాయి. అంతరించిపోయిన క్వాగాకు తిరిగి ప్రాణం పోసేందుకు 1987లో ‘క్వాగా ప్రాజెక్టు’ ప్రారంభమైంది. జీబ్రా జాతుల్లోని బర్షెల్స్ జీబ్రాలో క్వాగా జన్యువులు అధిక శాతం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. బర్షెల్స్ జీబ్రా ద్వారా క్వాగా పునరుత్థానానికి వారు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.ఎలిఫంట్ బర్డ్ఎగరలేని భారీ పక్షుల్లో ఎలిఫంట్ బర్డ్ ఒకటి. మడగాస్కర్‌లో ఈ పక్షులు విరివిగా ఉండేవి. స్థానికులు ఇష్టానుసారం వీటిని వేటాడి తినేయడంతో దాదాపు వెయ్యేళ్ల కిందటే ఇవి అంతరించిపోయాయి. మడగాస్కర్‌లో పరిశోధనలు సాగిస్తున్న అంతర్జాతీయ శాస్త్రవేత్తలకు ఎలిఫంట్ బర్డ్ గుడ్ల శిలాజాలు దొరికాయి. వాటి నుంచి వారు ఎలిఫంట్ బర్డ్ జన్యు పదార్థాలను సేకరించగలిగారు. ఎలిఫంట్ బర్డ్ పక్షుల్లో ఎనిమిది జాతులు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. డోడో మాదిరిగానే ఎలిఫంట్ బర్డ్‌కు కూడా తిరిగి ప్రాణం పోసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.స్టెల్లర్స్ సీ కౌఇది తిమింగలంలాంటి భారీ జలచరం. ఒకప్పుడు అలాస్కా, రష్యాల మధ్య బేరింగ్ సముద్రంలో కమాండర్ దీవుల చుట్టూ కనిపించేది. పర్యావరణ మార్పులు, విచ్చలవిడిగా సాగిన వేట ఫలితంగా స్టెల్లర్స్ సీ కౌ జాతి పద్దెనిమిదో శతాబ్దిలో అంతరించిపోయింది. చివరిసారిగా ఇది 1768లో కనిపించినట్లుగా రికార్డులు ఉన్నాయి. జర్మన్ ప్రకృతి శాస్త్రవేత్త జార్జ్ విల్హెల్మ్ స్టెల్లర్ 1741లో ఈ జలచరం గురించి తన రచనల్లో విపులంగా వర్ణించాడు. అందువల్ల దీనికి అతడి పేరు మీదుగా ‘స్టెల్లర్స్ సీ కౌ’ అనే పేరు వచ్చింది. బేరింగ్ దీవి తీరంలో స్టెల్లర్స్ సీ కౌ పూర్తి అస్థిపంజరం 1987లో శాస్త్రవేత్తలకు దొరికింది. దీని ఆధారంగా జన్యు పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు స్టెల్లర్స్ సీ కౌకు పునరుత్థానం కల్పించడం సాధ్యమేనని, ఆ దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నామని చెబుతున్నారు.ఐరిష్ ఎల్క్జింక జాతుల్లో అతిపెద్ద జంతువు ఇది. సహస్రాబ్దాల కిందట భూమ్మీద సంచరించేది. ఐర్లండ్ నుంచి సైబీరియాలోని బైకాల్ సరస్సు వరకు గల ప్రాంతంలోని దట్టమైన అడవుల్లో ఉండేది. పర్యావరణ కారణాల వల్ల, మనుగడకు సంబంధించిన పరిమితుల వల్ల ఐరిష్ ఎల్క్ జాతి ఏడువేల ఏళ్ల కిందటే అంతరించింది. ప్రస్తుతం భూమ్మీద మనుగడ సాగిస్తున్న జింక జాతుల్లో ఐరిష్ ఎల్క్ జన్యువుల్లో ఎక్కువ శాతం జన్యువులు ఉన్న జాతి ఫ్యాలో డీర్ అని శాస్త్రవేత్తలు గుర్తించారు. పంతొమ్మిదో శతాబ్ది నుంచి సాగిన పరిశోధనల్లో శాస్త్రవేత్తలకు ఐర్లండ్‌లో ఐరిష్ ఎల్క్ అస్థిపంజరాలు విరివిగా దొరికాయి. వీటి ఆధారంగా ఇప్పటికీ శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. ఫ్యాలో డీర్ ద్వారా ఐరిష్ ఎల్క్కు పునర్జీవం కల్పించవచ్చనే అంచనాతో ఆ దిశగా ప్రయోగాలు చేస్తున్నారు.వూలీ రైనోసరస్ఇది ఖడ్గమృగం జాతికి చెందిన భారీ జంతువు. ఖడ్గమృగం శరీరం నున్నగా ఉంటే, దీనికి మాత్రం ఒంటి నిండా దట్టంగా రోమాలు ఉంటాయి. ఈ జంతువు సహస్రాబ్దాల కిందటే అంతరించిపోయింది. పర్యావరణ మార్పుల ఫలితంగా దాదాపు 8,700 ఏళ్ల కింద వూలీ రైనోసరస్ అంతరించిపోయినట్లు శాస్త్రవేత్తల అంచనా. మామత్‌కు ఏనుగు ద్వారా పునర్జీవం కల్పించే ప్రయత్నాలు సాగిస్తున్నట్లుగానే, వూలీ రైనోసరస్కు ఖడ్గమృగం ద్వారా పునర్జీవం కల్పించేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగాలు జరుపుతున్నారు.ఆరోక్స్ఇది గోజాతికి చెందిన పురాతన జంతువు. ఇవి మిగిలిన జాతుల ఎద్దులు, ఆవుల కంటే భారీగా ఉంటాయి. నాలుగేళ్ల కిందటి వరకు ఆసియా, యూరోప్, ఉత్తరాఫ్రికా ప్రాంతాల్లో ఇవి విరివిగా ఉండేవి. ఆ తర్వాత పదిహేడో శతాబ్దం ప్రారంభం నాటికి ఇవి పూర్తిగా అంతరించిపోయాయి. ఆరోక్స్ జాతికి తిరిగి ప్రాణం పోయడానికి శాస్త్రవేత్తలు 2009 నుంచి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికీ మనుగడలో ఉన్న పురాతన గోజాతుల్లో ఆరోక్స్ డీఎన్ఏ ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆరోక్స్ డీఎన్ఏ ఎక్కువ శాతం ఉన్న గోజాతులను ప్రత్యేకంగా ఎంపిక చేసి, వాటి ద్వారా ఆరోక్స్ జాతికి పునరుత్థానం కల్పించడానికి ప్రయోగాలు చేస్తున్నారు.టాస్మానియన్ టైగర్పెద్దపులి మాదిరిగానే దీని ఒంటి మీద చారలు ఉంటాయి గాని, ఇది తోడేలు జాతికి చెందిన జంతువు. ఒకప్పుడు టాస్మానియా ప్రాంతంలో విరివిగా సంచరించిన ఈ జంతువుకు ఒంటి మీద చారల కారణంగా ‘టాస్మానియన్ టైగర్’ అనే పేరు వచ్చింది. కొందరు దీనిని ‘టాస్మానియన్ వూల్ఫ్’ అని కూడా అంటారు. ఈ జంతువు దాదాపు శతాబ్దం కిందట అంతరించిపోయింది. దాదాపు 110 ఏళ్ల కిందట చనిపోయిన టాస్మానియన్ టైగర్ అస్థిపంజరం నుంచి శాస్త్రవేత్తలు దీని ఆర్ఎన్ఏను సేకరించారు. ఈ ఆర్ఎన్ఏను ఇథనాల్‌లో భద్రపరచారు. దీని ద్వారా టాస్మానియన్ టైగర్‌కు తిరిగి ప్రాణం పోయడానికి కలోసల్ బయోసైన్సెస్ కంపెనీ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ యూనివర్సిటీకి చెందిన ‘థైలాసైన్ ఇంటిగ్రేటెడ్ జెనెటిక్ రిస్టరేషన్ రీసెర్చ్ లాబ్ శాస్త్రవేత్తల సహకారంతో ప్రయోగాలు సాగిస్తోంది.వూలీ రైనోసరస్ఇది ఖడ్గమృగం జాతికి చెందిన భారీ జంతువు. ఖడ్గమృగం శరీరం నున్నగా ఉంటే, దీనికి మాత్రం ఒంటి నిండా దట్టంగా రోమాలు ఉంటాయి. ఈ జంతువు సహస్రాబ్దాల కిందటే అంతరించిపోయింది. పర్యావరణ మార్పుల ఫలితంగా దాదాపు 8,700 ఏళ్ల కింద వూలీ రైనోసరస్ అంతరించిపోయినట్లు శాస్త్రవేత్తల అంచనా. మామత్‌కు ఏనుగు ద్వారా పునర్జీవం కల్పించే ప్రయత్నాలు సాగిస్తున్నట్లుగానే, వూలీ రైనోసరస్కు ఖడ్గమృగం ద్వారా పునర్జీవం కల్పించేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగాలు జరుపుతున్నారు.ది గ్రేట్ ఆక్ఇది చూడటానికి పెంగ్విన్‌లా కనిపించే ఎగరలేని పక్షి. వేటగాళ్ల తాకిడి వల్ల ది గ్రేట్ ఆక్ పక్షిజాతి పంతొమ్మిదో శతాబ్దిలో అంతరించిపోయింది. చిట్టచివరి ది గ్రేట్ ఆక్ పక్షిని 1844 జూలైలో వేటగాళ్లు చేజిక్కించుకుని, చంపి తినేసినట్లు రికార్డులు ఉన్నాయి. స్పెయిన్ ఉత్తర తీరం నుంచి కెనడా వరకు అట్లాంటిక్ తీర ప్రాంతమంతటా ఈ పక్షులు ఒకప్పుడు విరివిగా ఉండేవి. ధ్రువపు ఎలుగుబంట్లు ఈ పక్షులను తినేవి. వాటి కంటే ఎక్కువగా మనుషులు వేటాడి తినేవారు. ది గ్రేట్ ఆక్ పునరుత్థానం కోసం శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు. టెక్సస్‌లోని ఏ అండ్ ఎం యూనివర్సిటీ, ఆస్ట్రేలియన్ యానిమల్ హెల్త్ లేబొరేటరీ వంటి సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ దిశగా ప్రయోగాలు కొనసాగిస్తున్నారు.శాస్త్రవేత్తల ప్రయోగాలు ఫలించినట్లయితే, అంతరించిపోయిన జీవరాశుల్లో కనీసం కొన్ని అయినా తిరిగి ప్రాణం పోసుకోగలవు. వాటి వల్ల భూమ్మీద జీవవైవిధ్యం మాత్రమే కాకుండా, ప్రకృతి సమతుల్యత కూడా మెరుగుపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతరించిపోయిన జీవుల పునరుత్థానం కోసం సూక్షా్మతి సూక్ష్మస్థాయిలో సాగిస్తున్న జన్యు ప్రయోగాలు, మూలకణాల ప్రయోగాల వల్ల మానవాళిని పట్టి పీడించే ఎన్నో వ్యాధులకు చికిత్స మార్గాలను కూడా కనుగొనే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. -
టాలీవుడ్లో రాబోతున్న సైన్స్ ఫిక్షన్ సినిమాలివే!
కొన్ని వందల సంవత్సరాల తర్వాత మన దేశం ఎలా ఉంటుంది... సూపర్ పవర్ ఉన్న విలన్ని ఓ సామాన్యుడు ఎలా ఢీ కొంటాడు... వేరొకరి మెదడులోని ఆలోచనలను చిప్ సాయంతో ఇంకొకరి మెదడులోకి పెడితే... ఇవన్నీ సాధ్యమేనా అంటే.. సైన్స్‌తో సాధ్యమే. ఈ అంశాలకు సైన్స్ జోడించి, కొన్ని పిక్స్ (సినిమాలు) తెరకెక్కుతున్నాయి. ఆ ‘సైంటిపిక్స్’ గురించి తెలుసుకుందాం...ఆరువేల సంత్సరాల తర్వాత...కొన్ని వందల సంవత్సరాల తర్వాత భారతదేశం ఎలా ఉండబోతోంది అంటే ఊహించి, చెప్పడం కష్టం. కానీ దర్శకుడు నాగ్ అశ్విన్ ఊహించారు. వందల ఏళ్ల తర్వాత దేశం ఎలా ఉంటుంది? అని ఊహించి, ‘కల్కి 2898 ఏడీ’లో చూపించనున్నారు ఈ దర్శకుడు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ అండ్ ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ ఇది. మహాభారతం ముగింపు సమయంలో మొదలయ్యే ఈ సినిమా కథ ఆరువేల సంవత్సరాల టైమ్ లైన్‌తో 2898ఏడీలో ముగుస్తుందట.అలాగే ఈ సినిమా కథలో మైథలాజికల్ టచ్ ఉంటుంది. అందుకే ‘కల్కి 2898 ఏడీ’ అనే టైటిల్ పెట్టారని తెలిసింది. ఈ చిత్రంలో భైరవ పాత్రలో ప్రభాస్, అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ కనిపిస్తారు. పద్మావతి పాత్రలో దీపికా పదుకోన్, కలి పాత్రలో కమల్‌హాసన్ కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. హీరోయిన్ దిశా పటానీ మరో లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమాను అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 27న విడుదల కానుంది. డబుల్ ఇస్మార్ట్ ఓ కిరాయి రౌడీ మెదడులో ఓ సీబీఐ ఆఫీసర్ మెదడులోని ఆలోచనలను ఓ చిప్ సాయంతో ఇన్జెక్ట్ చేస్తే ఏమవుతుంది? అనే కథాంశంతో రూపొందిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్ ‘ఇస్మార్ట్ శంకర్’. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2019లో విడుదలై, ఘనవిజయం సాధించింది. ఇప్పుడు రామ్, పూరి కాంబినేషన్లోనే ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రీకరణ జరుగుతోంది.తన గతాన్ని మెల్లి మెల్లిగా మర్చిపోతున్న శంకర్ (రామ్ పాత్ర) పూర్తిగా సీబీఐ ఆఫీసర్‌గా మారిపోతాడా? ఒకవేళ సైన్స్ ప్రయోగాల ద్వారా శంకర్ తన జ్ఞాపకాలను తిరిగి పొందగలిగే చాన్స్ ఉందా? అనే అంశాలను ‘డబుల్ ఇస్మార్ట్’లో చూడొచ్చని టాక్. పూరి జగన్నాథ్, ఛార్మి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సూపర్ విలన్‌పై పోరాటంసూపర్ పవర్స్ ఉన్న ఓ సూపర్ విలన్‌పై ఓ సామాన్యుడు చేసే పోరాటం నేపథ్యంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ అడ్వెంచరస్ ఫిల్మ్ ‘మాయవన్’. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సీవీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్, సీవీ కుమార్ల కాంబినేషన్లోనే రూపొందిన ప్రాజెక్ట్ జెడ్’ సినిమాకు సీక్వెల్‌గా ‘మాయవన్’ చిత్రం తెరకెక్కుతోంది.బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంటేషన్ కూడా ఈ సినిమాలో ఓ ప్రధానాంశం అని టాక్. ఈ సినిమాలో సూపర్ పవర్స్ ఉన్న విలన్ పాత్రలో నీల్ నితిన్ ముఖేష్ నటిస్తున్నారు. అతన్ని ఢీ కొనే సామాన్యుడి పాత్రను సందీప్ కిషన్ చేస్తున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. సూపర్ యోధ చరిత్రలో ముఖ్యమైన తొమ్మిది గ్రంథాలు దుష్టుల చేతిలో పడి దుర్వినియోగం కాకుండా ఉండేందుకు తరాలుగా సాగుతున్న ఓ యుద్ధం నేపథ్యంతో రూపొందుతున్న చిత్రం ‘మిరాయ్’. జపాన్ భాషలో మిరాయ్ అంటే భవిష్యత్ అని అర్థం. ఇందులో సూపర్ యోధ పాత్రను హీరో తేజ సజ్జా చేస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ వచ్చే ఏడాది ఏప్రిల్ 18న రిలీజ్ కానుంది. త్రీడీ వెర్షన్ లోనూ రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భవిష్యత్ దర్శిని ముగ్గురు మిత్రులకు భవిష్యత్‌ను చూపించే ఓ యంత్రం దొరికినప్పుడు వారు చేసిన పనులు ఎలాంటి పరిణామాలకు దారి తీశాయి? అనే అంశంతో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘దర్శిని’. వికాశ్, శాంతి, సత్యప్రసాద్ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ సినిమాకు డా. ప్రదీప్ అల్లు దర్శకుడు. ఎల్వీ సూర్యం నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్ కానుంది.సూపర్ గాళ్ యానీయా భరద్వాజ్, కబీర్ దుహాన్ సింగ్, ప్రణీతా జిజిన లీడ్ రోల్స్‌లో నటించిన టైమ్ ట్రావెల్ అండ్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘ఇంద్రాణి’. స్టీఫెన్ పల్లం ఈ సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. గరిమా కౌశల్, షతఫ్ అహ్మద్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. దేశం కోసం పోరాడే ఓ సూపర్ ఉమన్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది అని తెలుస్తోంది. ఈ సినిమా ఈ నెలలోనే విడుదల కానుంది. ఈ తరహాలో తెలుగులో మరికొన్ని సైన్స్ ఫిక్షన్ చిత్రాలు ఉన్నాయి. -
గ్రహాంతర తాప్సీ!
కిక్ ఇచ్చే కాన్సెప్ట్ దొరికితే కాదనుకుండా పచ్చజెండా ఊపేస్తారు నటీనటులు. తాప్సీ ఇటీవల అలా కిక్ ఇచ్చే కాన్సెప్ట్ విన్నారట. చెప్పింది తమిళ దర్శకుడు భరత్ నీలకంఠన్. రెండేళ్ల క్రితం ‘కే 13’ అనే సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు భరత్. తాజాగా ఆయన ఓ సైన్స్ ఫిక్షన్ సినిమాకు కథ రాసుకున్నారట. ఇందులో విశేషం ఏంటంటే... ఈ సినిమాలో ఏలియన్స్ ప్రస్తావన ఉంటుందట. ఈ గ్రహాంతర వాసుల కథ వినగానే తాప్సీ మరోమారు ఆలోచించకుండా ఒప్పేసుకున్నారని సమాచారం. బహు భాషల్లో ఈ సినిమా చేయడానికి భరత్ సన్నాహాలు చేస్తున్నారని టాక్. భారీ బడ్జెట్‌తో రూపొందించనున్న ఈ చిత్రంలో స్పెషల్ ఎఫెక్ట్స్ అవసరం ఎక్కువగా ఉన్నప్పటికీ భారతీయ సాంకేతిక నిపుణులనే తీసుకోవాలనుకుంటున్నారని తెలిసింది. ‘మేక్ ఇన్ ఇండియా’ మూవీగా తీయాలన్నది టీమ్ ఆశయంగా చెప్పుకుంటున్నారు. ఒక్క విజువల్ ఎఫెక్ట్స్‌కే దాదాపు రూ. 10 కోట్లు ఖర్చవుతుందట. ఈ ప్యాన్ ఇండియా మూవీ చిత్రీకరణను ఎప్పుడు ఆరంభిస్తారనేది తెలియాల్సి ఉంది. -
సైన్స్ ఈస్ట్‌మన్ కలర్లో..
సైన్సు క్లాసు పిల్లలకు విజ్ఞానం. సినిమా వాళ్లకు వినోదం. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సైన్సు ఆధారంగా తయారైన తెలుగు సినిమాలెన్నో. నేడు నేషనల్ సైన్స్ డే సందర్భంగా... ఆదివారం ప్రత్యేకం హాలీవుడ్లో సైన్స్ ఫిక్షన్ తీయడం క్షణాల్లో పని. వారు కథలు ఎలా ఆలోచిస్తారో ఆ ఆలోచనలు ఎలా వస్తాయో తెలియదు. ఆత్రేయ ‘కలలు కూడా దోచుకునే దొరలు ఎందుకు’ అని రాశారు. హాలీవుడ్ వాళ్లు కలల్లోకి వెళ్లడాన్ని కూడా తీసుకుని సినిమాలు తీశారు. ‘ఎటర్నల్ సన్‌షైన్ ఆఫ్ ది స్పాట్‌లెస్ మైండ్’ అనే ఒక సినిమాలో హీరో హీరోయిన్ ఇక మన మధ్య ప్రేమ వద్దు అనుకుంటారు. బ్రేకప్ అయిపోతుంది. బ్రేకప్ అయిపోయినా పాత జ్ఞాపకాలు మాత్రం ఉంటాయి కదా. ఆ జ్ఞాపకాలు మాత్రం ఎందుకు అనుకుని ఒక టెక్నాలజీ ద్వారా ఆ జ్ఞాపకాలన్నీ ఇద్దరూ చెరిపేసుకుంటారు. ఆ తర్వాత ఏమయ్యింది అనేది కథ. చూడండి ఎంత బాగా ఆలోచించారో. తెలుగులో ఈ స్థాయి ఆలోచన రావడానికి చాలా కాలం పడుతుంది. కాని తెలుగు ఇంకా కచ్చితంగా చెప్పాలంటే తమిళ భాషల్లో సైన్స్‌ని కమర్షియల్ సినిమాకు బాగానే ఉపయోగించుకున్నారు. తెలుగులో జేమ్స్‌బాండ్ తరహా క్రైమ్ సినిమాలు మొదలయ్యాక సైన్సు, సైంటిస్టు అనే మాటలు ప్రేక్షకులకు ఎక్కువగా వినిపించడం మొదలయ్యాయి. ఒక సైంటిస్ట్ ఏదో ఫార్ములా కనిపెడతాడు. దాని కోసం విలన్ వెంటపడతాడు. ఆ సైంటిస్ట్ కూతురు తండ్రి కోసం వెతుకుతుంటుంది. హీరో సాయం చేస్తాడు. మనకు సైన్స్ అంటే ఒక ల్యాబ్, బుడగలు తేలే బీకర్లు మాత్రంగా చాలా కాలం సినిమాలు నడిచాయి. కాని సైన్స్‌ను లేశమాత్రంగా కథల్లో ప్రవేశ పెట్టడం మెల్లగా మొదలైంది. ముఖ్యంగా ఎన్.టి.ఆర్ నటించిన ‘దొరికితే దొంగలు’ దాదాపుగా సైన్స్ ఫిక్షన్‌గా చెప్పే వీలైన తొలి తెలుగు సినిమా అనుకోవచ్చు. ఇందులో రాజనాల, సత్యనారాయణ, అల్లురామలింగయ్యలు తెర వెనుక సైంటిఫిక్ పవర్స్‌ను అడ్డుపెట్టుకొని నానా అఘాయిత్యాలు చేస్తుంటారు. చివరకు ఎన్.టి.ఆర్ వారి ఆట కట్టిస్తాడు. ఆ తర్వాతి రోజుల్లో కృష్ణ ‘రహస్య గూఢచారి’ సినిమా వచ్చింది. ఇందులో విలన్ సత్యనారాయణ విజ్ఞాన శాస్త్రాన్ని ఔపోసన పట్టి అణు రాకెట్లు తయారు చేస్తాడు. ‘ఒక మీట నొక్కితే కుంభవృష్టి కురుస్తుంది.. ఒక మీట నొక్కితే సముద్రం ఆవిరవుతుంది’ అని చెబుతాడు. అయితే సహజంగానే కృష్ణ అతణ్ణి మట్టి కరిపిస్తాడు. కాని రహస్య గూఢచారిలో విలన్ చేసిన పని మనిషి త్వరలోనే చేస్తాడనిపిస్తుంది. దర్శకుడు గీతాకృష్ణ ‘కోకిల’ అనే సినిమా తీశారు. ఇందులో ప్రమాదరీత్యా కళ్లు పోయిన హీరోకు వేరొకరి కళ్లు అమరుస్తారు. అయితే అతడు కళ్లు తెరిచినప్పటి నుంచి ఒక హత్య జరిగిన దృశ్యం కనిపిస్తూ ఉంటుంది. ఎవరి కళ్లయితే నరేశ్‌కు పెట్టారో ఆ కళ్లు ఆఖరిసారిగా ఆ హత్యను చూశాయి. ఆ కళ్లకు ఆ మెమొరి అలా ఉండిపోయి ఆ దృశ్యం ఇప్పుడు నరేశ్‌కు కనిపిస్తూ ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారం లేకపోయినా జనం ఓకే చేశారు. సినిమా హిట్ అయ్యింది. ∙∙ అయితే తెలుగువాళ్లు ఈనాటికీ గొప్పగా చెప్పుకోదగ్గ సైన్స్ ఫిక్షన్ మాత్రం ‘ఆదిత్యా 369’ సినిమాయే. టైమ్ మిషన్ ఆధారంగా అల్లుకున్న ఈ కథ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇందులో హీరో బాలకృష్ణ హీరోయిన్ను తోడు చేసుకుని టైమ్ మిషన్‌లో రాయలవారి కాలానికి వెళతాడు. ఆ తర్వాత అత్యంత రేడియేషన్ ఉండే భవిష్యత్ కాలానికి కూడా వెళతాడు. ఆ సినిమా లో వీడియో కాల్స్, సెల్‌ఫోన్ కాల్స్ లాంటివి ఊహించారు. ఆ సినిమాలో సైంటిస్ట్‌గా టిన్నూ ఆనంద్ నటించి మంచి గుర్తింపు పొందాడు. ఈ సినిమా తీసినందుకు గాను దర్శకుడు సింగీతం శ్రీనివాస్ చాలా మంది ప్రేక్షకులకు మరింత ఇష్టులు అయ్యారు. దీని సీక్వెల్ గురించి ఎన్నో ప్రయత్నాలు సాగాయి కాని జరగలేదు. సైన్స్ ఫిక్షన్‌ను పెద్ద హీరోల మీద భారీగా ఉపయోగించాలి కాని కామెడీగా కాదని సూర్య దర్శకత్వంలో వచ్చిన ‘నాని’ నిరూపించింది. ఇందులో కూడా ఒక పిచ్చి సైంటిస్ట్ చేసిన ఒక ప్రయోగం వికటించి చిన్న పిల్లాడు పెద్దవాడిగా మారడం ఆ పెద్దగా ఉన్న సమయంలో వివాహం కూడా జరిగిపోవడం ఇవన్నీ ఫన్నీగా ఉన్నా జనం మెచ్చలేదు. మహేశ్ బాబు అభినయం, ఏ.ఆర్.రెహమాన్, అమీషా పటేల్ అల్లరి సినిమాను కాపాడలేకపోయాయి. ∙∙ అదే సమయంలో తమిళం నుంచి డబ్ అయిన సైన్స్ ఫిక్షన్ సినిమాలు తెలుగువే అన్నంత బాగా ఇక్కడ హిట్ అయ్యాయి. శంకర్ తీసిన ‘రోబో’ పెద్ద సంచలనం రేపింది. శాస్త్రం శృతి మించితే మనిషికి బానిసగా ఉండటం కాక మనిషినే బానిసగా చేసుకుంటుందని చెప్పిన ఈ సినిమా కలెక్షన్ల దుమారం రేపింది. రజనీకాంత్‌కు భారీ హిట్‌ను ఇచ్చింది. దీని కొనసాగింపుగా సెల్ టవర్ల దుష్ఫలితాలను తీసుకుని ‘రోబో2’ తీశారు కాని జనం మెచ్చలేదు. స్పష్టత కరువై ఎవరు హీరోనో ఎవరు విలనో తెలియకుండా పోయింది. హీరో సూర్య దర్శకుడు మురగదాస్‌తో కలిసి చేసిన ‘సెవెన్త్ సెన్స్’ భారతీయ సనాతన శక్తులను, శాస్త్రీయ శక్తులను చర్చించింది. ఇందులో వైరస్ చైనా నుంచి దిగుమతి అయినట్టు చూపడం మొన్న కరోనా సమయంలో చర్చకు వచ్చింది. సూర్య దర్శకుడు విక్రమ్ కుమార్‌తో తీసిన ‘24’ కూడా హిట్ అయ్యింది. ఈ సినిమా సమయాన్ని బంధించడం గురించి అందమైన ఊహ చేసింది. అలాంటి రోజులు వస్తాయేమో తెలియదు. అలాగే అంతరిక్షం కథాంశంగా వచ్చిన ‘టిక్ టిక్ టిక్’ కూడా మంచి మార్కులే సంపాదించింది. ∙∙ సైన్స్ ఫిక్షన్ మీద తెలుగు సినిమా పెట్టుకున్న నమ్మకం అన్నిసార్లు సక్సెస్ ఇవ్వలేదు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘అంతరిక్షం’ తొలి తెలుగు అంతరిక్ష నేపథ్య సినిమాగా నమోదైనా విజయం సాధించలేదు. హీరో వరుణ్‌తేజ్‌ను ఇది నిరాశ పరిచింది. ఇక విజయేంద్ర ప్రసాద్ కథతో వచ్చిన ‘శ్రీవల్లి’ సినిమా బ్రైన్ వేవ్‌ను కంట్రోల్లోకి తెచ్చుకోవడం వల్ల ఎదుటివారిని తమ అదుపులోకి తేవడం అనే అంశాన్ని చర్చించినా జనానికి కనెక్ట్ కాలేదు. పూరి జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’లో, రవితేజా ‘డిస్కో రాజా’లో శాస్త్రీయ అంశం కనిపించింది. సైన్స్ ఒక సముద్రం. దాని నుంచి ఎన్ని కథలైనా అల్లవచ్చు. అయితే విజ్ఞానం, వినోదం సమపాళ్లలో కలిపినప్పుడు ఆ జానర్ హిట్ అయ్యింది. భవిష్యత్తులో మంచి సైన్స్ ఫిక్షన్ చిత్రాలు వస్తాయని ఆశిద్దాం. – సాక్షి ఫ్యామిలీ -
డ్రోన్లే డెలివరీ బాయ్స్..
న్యూయార్క్: తేనెపట్టులాంటి భవనం.. తేనెటీగలను తలపించే డ్రోన్లు.. సైన్స్ ఫిక్షన్ మూవీని తలపించే ఆకాశహర్మ్యం.. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో ఉండే బిల్డింగ్ మాదిరిగా కనిపిస్తున్న ఈ ఆకాశహర్మ్యం ఎత్తు 1,400 అడుగులు(423 మీటర్లు). ఇంతకీ ఈ బిల్డింగ్ ఎందుకు ఉపయోగపడుతుందో తెలుసా.. వస్తువుల డెలివరీకి.. అలాగే డ్రోన్ల డిపోగానూ పనికొస్తుంది. ఈ టవర్ పేరు ‘ద హైవ్’. ప్రస్తుతానికి ఇది ఓ కాన్సెప్ట్ డిజైన్ మాత్రమే. కానీ ఏదో ఒక రోజు వాస్తవ రూపం దాలుస్తుందని దీని రూపకర్తలు చెపుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్ పెన్సుల్వానియాలో చదువుతున్న హదీల్ అయేద్ మహమ్మద్(25), యిఫెంగ్ జావో(24), ఛెంగ్డా జూ(24) అనే ఆర్కిటెక్ట్ విద్యార్థులు తమ యూనివర్సిటీ కోర్సులో భాగం గా ఈ హైవ్ డిజైన్‌ను రూపొందించారు. న్యూయార్క్ నగరంలోని మన్‌హట్టన్ నడిబొడ్డున ఈ టవర్‌ను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశారు. అక్కడ ఉన్న ఒక రెసిడెన్షియల్ టవర్‌ను కాస్తా.. సిటీకి సంబంధించి డ్రోన్ డిపోగా మార్చి నగరానికి మణిహారంగా మార్చాలనేది వీరి ప్రధాన ఉద్దేశం. సమీప భవిష్యత్తులో హైస్పీడ్ డెలీవరీలను చేసేందుకు వీలుగా దీనికి రూపకల్పన చేశారు. అమెజాన్, గూగుల్ ప్రస్తుతం డ్రోన్ డెలివరీ సర్వీసుల కోసం తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. అమెజాన్ తమ ఉత్పత్తులను 30 నిమిషాలు లేదా అంతకంటే తక్కువ సమయంలోనే డెలీవరీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని, ఇది ఒక ఏడాదిలోగా అందుబాటులోకి వస్తుందని గత వేసవిలో కాంగ్రెస్‌కు తెలిపింది. మరోవైపు డ్రోన్ డెలీవరీ సర్వీసులపై ఉన్న నియంత్రణలను త్వరలోనే ఎత్తేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్ అవసరాలు.. సమీప భవిష్యత్‌లో అవసరాలు పరిగణనలోకి తీసుకుని ఈ కాన్సెప్ట్ రూపొం దించామని మహమ్మద్ చెప్పారు. వెర్టికల్ హైవే మోడల్లో ఈ టవర్‌ను రూపొందిం చామన్నారు. ఈ ప్లాన్‌లో నో ఫ్లై జోన్స్, హైస్పీడ్ ట్రాన్సిట్ ఏరియాలు, లో స్పీడ్ లోకలైజ్డ్ ట్రాఫిక్ మొదలైన ప్లాన్లను కూడా పొందుపరిచారు. షేప్, సైజ్ ఆధారంగా తొమ్మిది భిన్నమైన డ్రోన్లు ఈ బిల్డింగ్‌పై నిలిపేలా ఈ కాన్సెప్ట్ రూపొందించారు. ఆర్కిటెక్చర్ మ్యాగజీన్ ఈవోలో నిర్వహించిన వార్షిక ఆకాశహర్మ్యాల కాంపిటీషన్లో 489 ఎంట్రీలు పోటీపడగా.. ఈ విద్యార్థులు రూపొందించిన ద హైవ్ కాన్సెప్ట్‌కు సెకండ్ ప్లేస్ దక్కడం విశేషం. -
సిమ్రాన్ వస్తోందోచ్!
సిమ్రాన్... ఈ పేరు చెప్పగానే, పెళ్ళయి, సినిమాలకు దూరమయ్యే ముందు దాకా తెలుగు, తమిళ భాషలను దున్నేసిన గ్లామర్ హీరోయిన్ గుర్తుకొస్తుంది. దీపక్‌తో పెళ్ళి, ఆ పైన పిల్లలతో సినిమాలకు దూరంగా ఉన్న ఈ అందాల భామ ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి వస్తున్నారు. కాకపోతే, ఈ సారి నటిగానే కాదు... నిర్మాతగా కూడా! ‘సిమ్రాన్ అండ్ సన్స్’ అనే పేరుతో నిర్మాణసంస్థ పెట్టిన ఆమె తొలి ప్రయత్నంగా ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా తీయనునట్లు కోడంబాకమ్ కబురు. ఒకటి రెండు నెలల్లో సెట్స్ మీదకు వెళ్ళనున్న ఈ సినిమాతో యాడ్ ఫిల్మ్స్ తీసే గౌరీశంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారట. ఈ విషయం గురించి వివరాలు అడిగినప్పుడు సిమ్రాన్ నెమ్మదిగా గొంతు విప్పారు. ‘‘చిత్ర నిర్మాణ సంస్థ పెడుతున్నట్లు ప్రకటించినప్పటి నుంచి బోలెడన్ని స్క్రిప్ట్స్ విన్నాం. గౌరీశంకర్ చెప్పిన సైన్స్ ఫిక్షన్ కథాంశం నచ్చి, ఓ.కె. చెప్పాం. కథ, కథన విధానం కొత్తగా ఉంటాయి’’అన్నారు. అన్నట్లు ఈ సినిమాలో సిమ్రాన్ ఒక గూఢచారి తరహా పాత్ర పోషిస్తారట. ఆమె పాత్రకు మంచి యాక్షన్‌తో పాటు, యాక్షన్ సీన్లు కూడా ఉన్నాయట. ఇంకేం... మంచి కథతో పాటు నిర్మాతగా, నటిగా కొత్త రోల్‌తో సిమ్రాన్ రీ-ఎంట్రీ ఇస్తారన్న మాట! తెలుగులో టాప్ హీరోయిన్గా కొన్నేళ్ళు వెలిగిన సిమ్రాన్ ఇటు తెలుగు చిత్ర పరిశ్రమ వైపు కూడా దృష్టి సారిస్తారేమో చూడాలి. -
మేఘం మింగేసేలా..
మనల్ని మింగేయడానికి వస్తున్నట్లు కనిపిస్తున్న ఈ మేఘం ఫొటో.. ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలోని సీన్లా కనిపిస్తోంది కదూ.. ఎగిరే పళ్లెం(యూఎఫ్‌వో) తరహాలో కనిపిస్తున్న ఈ తుపాను మేఘం టోర్నడోలు, తుపానులు, అకస్మిక వరదలు వచ్చినప్పుడు ఏర్పడతాయి. ముఖ్యంగా బ్రెజిల్, అర్జెంటీనా, అమెరికాలో ఇలాంటి తుపాను మేఘాలు కనిపిస్తాయి. జనాన్ని భయపెట్టేలా కనిపిస్తున్న ఈ మేఘాల ఫొటోలు తీయడంలో కాలిఫోర్నియాకు చెందిన జోడీ మిల్లర్ దిట్ట. ఈ చిత్రాన్ని ఆమె అమెరికాలోని రాస్వెల్ ప్రాంతంలో గత నెలలో తీశారు. తుపానులు వచ్చే సమయంలో ఫొటోల కోసం ఇలాంటి మేఘాల వెంట పడటమంటే.. లైఫ్ రిస్కే. కానీ.. అందులో ఉండే మజాయే వేరని మిల్లర్ చెబుతున్నారు.


