breaking news
Sayeed Salahudeen
-
వెంకయ్య సీరియస్
న్యూఢిల్లీ: కశ్మీర్ అంశంపై భారత్ తో అణుయుద్ధం తప్పదని తీవ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ నేత సయీద్ సలాహుదీన్ చేసిన ప్రకటనపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తీవ్రంగా స్పందించారు. కశ్మీర్ అంశంపై మాట్లాడడానికి సలాహుదీన్ ఎవరు, ఈ విషయంపై మాట్లాడే హక్కు అతడికి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. సోమవారం పార్లమెంట్ వెలుపల వెంకయ్య మీడియాతో మాట్లాడారు. పబ్లిసిటీ కోసమే అతడు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నాడని అన్నారు. ఇలాంటి వ్యక్తులను ప్రోత్సహించడం సరైందో, కాదో పాకిస్థాన్ తేల్చుకోవాలని సూచించారు. కశ్మీర్ ప్రజలకు స్వేచ్ఛ ప్రసాదించకుంటే అణుయుద్ధం తప్పదని, నాలుగో ప్రపంచ యుద్ధం వస్తుందని సలాహుదీన్ వ్యాఖ్యానించాడు. -
'భారత్ తో అణుయుద్ధం తప్పదు'
కరాచీ: కశ్మీర్ అంశంపై భారత్ తో అణుయుద్ధం తప్పదని హిజ్బుల్ ముజాహిదీన్ నేత సయీద్ సలాహుదీన్ హెచ్చరించారు. కశ్మీర్ పోరాటానికి అన్నివిధాల మద్దతు ఇవాల్సిన బాధ్యత పాకిస్థాన్ పై ఉందని పేర్కొన్నారు. పాకిస్థాన్ అండగా నిలిస్తే రెండు దేశాల మధ్య అణుయుద్ధం వచ్చే అవకాశముందన్నారు. కశ్మీర్ ప్రజలు రాజీ పడడానికి సిద్ధంగా లేరని, నాలుగో ప్రపంచ యుద్ధం రానుందని జోస్యం చెప్పారు. ప్రపంచం, పాకిస్థాన్ మద్దతు ఇవ్వకపోయినా, ఐక్యరాజ్య సమితి తన కర్తవ్యం నిర్వహించకపోయినా కశ్మీర్ ప్రజలు తమ చివరి రక్తపు బొట్టు వరకు పోరాడాలని సలాహుదీన్ పిలుపునిచ్చారు. సాయుధ యుద్ధం చేయడం తప్ప ప్రత్యామ్నాయం లేదని కశ్మీర్ ప్రజలు నిర్ణయానికి వచ్చారని వెల్లడించారు. మోదీ ప్రభుత్వం ముక్తి ప్రసాదించకపోతే అణచివేతకు గురవుతున్న కశ్మీర్ ప్రజలు సాయుధ తిరుగుబాటు చేస్తారని చెప్పారు. కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ సమాజం విస్మరించినా, పాకిస్థాన్ ప్రయత్నాలు ఫలించకపోయినా, భారత్ వేధింపులు ఆపకపోయినా.. ఇండియా మూల్యం చెల్లించుకోక తప్పదని సలాహుదీన్ హెచ్చరించారు.