breaking news
Saul
-
దైవ స్పందన...
ధర్మశాస్త్ర పండితుడైన సౌలు తన సొంత యూదులను అనగా యూదులలో నుండి క్రైస్తవులైన యూదా క్రైస్తవులను హింసలకు గురి చేశాడు. యేసును మెస్సీయగా గుర్తించని యూదులు స్తెఫనును చంపుతుంటే అదొక వేడుకగా చూస్తూ వారిపక్కనే ఉన్నాడు. దమస్కులోని క్రైస్తవులను హింసించి చంపడానికి తన అనుచరులతో సౌలు బయలుదేరి వెళుతుంటే దమస్కు మార్గమున సూర్యకాంతిని మించిన కాంతి ఆకాశం నుండి ఆకస్మాత్తుగా అతని కళ్లను తాకడంతో చూపు కోల్పోతాడు.‘సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు?’ అని ఆకాశం నుండి ఒక స్వరము వినబడుతుంది. నీవు ఎవరవు ప్రభువా? అన్న సౌలు ప్రశ్నకు ‘నేను నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును’ అన్న జవాబు వినిపిస్తుంది. యేసుక్రీస్తు శరీరము అనగా సంఘము లేదా ఆయన పాలనలోని ప్రజలు అని అర్థం. సంఘము అనే తన ప్రజలను హింసిస్తే ఆయన చూస్తూ ఊరుకోడు. తప్పక వెను వెంటనే ప్రతిస్పందిస్తాడు అన్నది ఇక్కడ నిరూపితమైంది.కొదువలేని కటాక్షంతో క్రీస్తు తనను మెస్సీయగా ఇక తప్పక గుర్తించిన పౌలు అనబడే సౌలుకు దృష్టి కలుగజేసి అతని పాపాలను క్షమించి తన పరిచర్యకు సువార్త ప్రకటనకు ఎంచుకొని అతన్ని విరివిగా వాడుకోవడం మొదలు పెడతాడు. దేవునిచే పంపబడి శరీరధారిగా వచ్చిన క్రీస్తుకు సహజంగా ఒక్కటే శరీరం ఉంది. అదేవిధంగా ఆయనకు ఒక్కటే శిరస్సు ఉంది. దీన్నే ఆత్మ సంబంధంగా క్రీస్తుకు శరీరం ఒక్కటే అన్న రీతిలో చూస్తే సంఘము ఒక్కటే. అదే క్రీస్తు సంఘము. ఆయనకు శిరస్సు ఒక్కటే అన్న రీతిలో ఉన్నతంగా చూస్తే, మనస్సు పెట్టి ఆలోచన చేస్తే, మరో శిరస్సు అనగా క్రీస్తు ఏలుబడి తప్ప సంఘానికి మరో ఏలుబడి లేదు, ఉండదు, ఉండకూడదు అన్నది తేటగా అర్థమవుతుంది.– జేతమ్ఇదీ చదవండి: నవ్వు వెనుక ఏడుపు.. ద్రౌపది ఆవేదన చెప్పే నీతి ఏంటంటే? -
వెలిగి బూడిదైన తారాజువ్వ సౌలు
ఇశ్రాయేలీయుల మొట్టమొదటి రాజైన సౌలుది మామూలుగా మొదలై, మహాద్భుతమైన మలుపు తిరిగి, కొన్నాళ్లు ఉజ్వలంగా వెలిగి, క్రమంగా దిగజారి ఎంతో అధ్వానంగా అంతమైన జీవితం. అతని జీవితం ఈనాటికీ అందరికీ ఒక గుణపాఠం. దేశంలో ఒక మూలన సాదాసీదాగా బతుకుతున్న సౌలు ఒకరోజు దేశానికి చక్రవర్తినవుతానని కలలో కూడా ఊహించలేదు. చిన్న, పెద్ద, పేద, గొప్ప, నలుపు, తెలుపు లాంటి భేదాలు, పదాల జీవితమే నిదర్శనం. సింహాసనాన్ని చేపట్టిన వెంటనే సౌలు అత్యంత సంక్లిష్టమైన యుద్ధాన్ని గెలిచి తన దక్షతను నిరూపించుకొని ప్రజాభిమానాన్ని చూరగొన్నాడు. అందువల్ల ఈ విజయాలకు కృతజ్ఞతగా దేవునికి గిల్గాతులో దహనబలి అర్పించేందుకు వెళ్దామని సమూయేలు ప్రవక్త సౌలును, ఇశ్రాయేలీయులనందరినీ ఆహ్వానించాడు. సౌలు, ఇశ్రాయేలీయులూ అక్కడ చేరారు. సౌలు, ఇశ్రాయేలీయులూ అక్కడ చేరారు కాని సమూయేలు రాలేదు. ఆయనకోసం ఏడురోజులు ఎదురు చూసి ఇక ప్రజలంతా వెళ్లిపోతారన్న భయంతో సౌలే దహనబలిని అర్పించాడు. అది దైవాజ్ఞలకు వ్యతిరేకం. దహనబలిని యాజకులు, ప్రవక్తలు మాత్రమే అర్పించాలి. ఎంతటి రాజైనా అది అతని పరిధిలో లేని విషయం. అది తెలుసుకున్న సమూయేలు ఉగ్రుడై రాజుగా సౌలును దేవుడు తృణీకరించాడని, త్వరలోనే మహారాజు వస్తాడని ప్రకటించాడు. సౌలు భ్రష్టత్వం అలా తొందరపాటుతో ఆరంభమైంది. తొందరపాటు దైవాజ్ఞ ఉల్లంఘించడానికి కారణమైంది. తర్వాత అతనిలో అభత్రాభావన నెలకొంది. ప్రజలందరినీ ఒక తాటిమీద తండ్రిలాగా నడిపించవలసిందిపోయి తనకంటూ ఒక ముఠా ఏర్పరచుకున్నాడు. ప్రజల్ని విడదీసి పాలించడం ఆరంభించాడు. గద్దెనెక్కినోడు, పైసలున్నోడు ప్రతివారికీ ఆప్తుడే!! అవి అంతర్థానమైన మరుక్షణం ప్రతి ఒక్కరికీ అతను అస్పృశ్యుడే!! అన్న సత్యాన్ని సౌలు గ్రహించలేక తన చుట్టూ చేరిన స్వార్థపరుల్లో నిజంగా తనవారెవరో తెలుసుకోలేని విచక్షణ లేక కక్షతో వ్యవహరించి ఎంతో మందిని శత్రువులను చేసుకున్నాడు. తనకు వారసుడిగా దేవుడెంపిక చేసిన దావీదు మీద అసూయతో అతన్ని చంపడంపైనే దృష్టి కేంద్రీకరించి సమయాన్ని వృథా చేసుకున్నాడు. పరిపాలన మీద పట్టుకోల్పోయాడు. అమాలేకీయులను వారి పశువులతో సహా సమూలంగా నాశనం చేయమని దేవుడాజ్ఞాపిస్తే ‘దేవునికి బలివ్వడానికి అన్న సాకుతో మంచి పశువుల్లో కొన్నింటిని తెచ్చి తన శాలలో పెట్టుకున్నాడు. అలా దైవాజ్ఞనే యథేచ్ఛగా ఉల్లంఘించాడు. తొందరపాటు, దైవభయం లేకపోవడం, అసూయ, పగ, కక్షసాధింపు, ఆశ్రీత పక్షపాతం, స్వార్థం ఇలా అవలక్షణాలన్నింటికీ అతని జీవితం కేరాఫ్ అడ్రస్‌గా అయింది. చివరికి గిల్బోవ పర్వతం వద్ద ఫిలిష్తీయులతో జరిగిన యుద్ధంలో అతను తీవ్రంగా గాయపడి శత్రువులు తనను చంపకమునుపే తనను చంపమని తన పనివాణ్ణి వేడుకుంటే, వాడు వినకపోతే తనను తాను ఆత్మహత్య చేసుకున్నాడు. చివరికి పనివాడు కూడా మాట వినని దీనస్థితిలో అతని జీవితం అంతమైంది. సౌలు సింహాసనాన్ని చూసుకుని మురిసిపోయాడు. దాన్నిచ్చిన దేవుణ్ణి మర్చిపోయాడు. రాజుగా ఎదిగాడు కానీ వ్యక్తిగా, విశ్వాసిగా దిగజారాడు. అన్నీ ఉన్నా దేవుడు తన కృప నుంచి దూరపర్చితే జీవితం ఎంత విషాదభరితమో ఇది తెలుపుతుంది. - రెవ. డా. టి.ఎ.ప్రభుకిరణ్


