డ్రైనేజీలో వ్యక్తి మృతదేహం లభ్యం
నిడదవోలు (పశ్చిమగోదావరి): డ్రైనేజీలో పడి ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని పశువుల ఆస్పత్రి సమీపంలో ఉన్న మురికి కాలువలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు స్థానికంగా నివాసముండే సత్యనారాయణ(42)గా గుర్తించారు. అతడి మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.