breaking news
Satyadevi
-
తమన్నా రాకతో గ్రాఫ్ మారిపోయింది
సత్యదేవ్, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. కన్నడంలో విడుదలై విజయం సాధించిన ‘లవ్ మాక్‌టైల్’ సినిమా ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది. నాగశేఖర్, భావనా రవి, ఎం.ఎస్. రెడ్డి, చినబాబు నిర్మిస్తున్నారు. నాగశేఖర్ దర్శకుడు. తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్‌కు సిద్ధమవుతున్న సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా సత్యదేవ్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాకి నేను హీరో అయినా, తమన్నాగారు రియల్ హీరో. ఆమె ఈ సినిమాలో చేస్తున్నారని ప్రకటించినప్పటి నుండి ‘గుర్తుందా శీతాకాలం’ గ్రాఫ్ మారిపోయింది. ఈ సినిమాలో చేస్తున్న మేఘా ఆకాశ్, కావ్యా శెట్టి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు’’ అన్నారు. తమన్నా మాట్లాడుతూ– ‘‘లాక్డౌన్ టైమ్‌లో చాలా సినిమాలు చూశాను, ఎన్నో కథలు విన్నాను. ఈ సినిమా ఆఫర్ రాగానే ఎందుకో ఈ సినిమాలో నటించాలనుకున్నాను. రొమాంటిక్ డ్రామాలో నటించి చాలాకాలం అయింది. టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ఈ సినిమాకు పర్ఫెక్ట్ హీరో’’ అన్నారు. దర్శకుడు నాగశేఖర్ మాట్లాడుతూ– ‘‘కన్నడంలో నేను స్టార్ డైరెక్టర్ అయినప్పటికీ తెలుగులో ఇది నాకు మొదటి సినిమానే. నటీనటులు, టెక్నీషియన్లు నూటికి నూరు శాతం ప్రతిభ ఉన్నవారు. ఎంతో తపనతో సినిమా చేస్తున్నారు’’ అన్నారు. ‘‘బహుశా ఈ సినిమాకు పనిచేయటం మొదలుపెట్టిన తొలి వ్యక్తి నేనే అనుకుంటున్నాను. నేను మాటలు అందించిన ‘చందమామ’, ‘అలా మొదలైంది’, ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘ఓ బేబి’ సినిమాల తరహాలో పెద్ద విజయం సాధిస్తుంది’’ అన్నారు మాటల రచయిత లక్ష్మీభూపాల్. సంగీత దర్శకుడు కాలభైరవ మాట్లాడుతూ– ‘‘లక్ష్మీభూపాల్ గారు ఈ సినిమా కోసం వేసవిలో పని చేయటం ప్రారంభిస్తే, నేను వర్షాకాలంలో ప్రారంభించాను. ఈ సినిమా మంచి మ్యూజికల్ ఫీల్ గుడ్ మూవీగా మిగిలిపోతుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో చినబాబు, సంపత్ కుమార్, నవీన్‌రెడ్డి తదితరులు పాల్గొ న్నారు. -
ఏమయ్యారో?
ఇద్దరు పిల్లలు సహా వివాహిత అదృశ్యం నెల రోజులైనా తెలియని ఆచూకీ మునగపాక: ఇద్దరు పిల్లలతో సహా భార్య అదృశ్యమై నెల రోజులు దాటుతున్నా ఆచూకీ లభించకపోవడంతో బాధితుడు ఆందోళన చెందుతున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని నాగులాపల్లి గ్రామానికి చెందిన కరెట్ల వరప్రసాద్ విశాఖకు చెందిన సత్యదేవిని 2010లో వివాహం చేసుకున్నాడు. నాగులాపల్లికి సమీపంలో అద్దె ఇంట్లో ఉండేవారు. వీరికి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. అయిదు నెలల క్రితం నాగులాపల్లిలోని సొంతింటికి మారారు. తరువాత అత్తతో సత్యదేవికి విభేదాలు రావడంతో విశాఖలో ఉంటున్న తల్లితండ్రుల వద్దకు వెళ్లిపోయింది. గత నెల 1న తిరిగి భర్త వద్దకు వచ్చింది. పది రోజుల తరువాత కూరగాయల కోసం ప్రసాద్ అనకాపల్లి వెళ్లి ఇంటికి వచ్చి చూడగా భార్యా పిల్లలు కనపించకపోవడంతో ఆందోళనకు గురై అత్తమామలు, కుటుంబ సభ్యుల వద్ద వాకబు చేశాడు. ఆచూకీ లభించకపోవడంతో అదే నెల 11న మునగపాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ పరిధి కాదని కేసు నమోదుకు మునగపాక పోలీసులు అంగీకరించకపోవడంతో అనకాపల్లి పట్టణ పోలీసు స్టేషన్లో అదే నెల 21న ఫిర్యాదు చేయడం తెలిసిందే. నాటి నుంచి నేటివరకు వారి ఆచూకీ దొరక లేదు. పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి తనకు న్యాయం చేయాలని వరప్రసాద్ వేడుకుంటున్నాడు. తన భార్య, పిల్లల ఆచూకీ కనిపిస్తే 8185051114 నంబర్‌కు సమాచారం ఇవ్వగలరని కోరాడు.