ఏమయ్యారో? | Married with two children disappear | Sakshi
Sakshi News home page

ఏమయ్యారో?

Sep 16 2014 12:55 AM | Updated on May 3 2018 3:17 PM

ఏమయ్యారో? - Sakshi

ఏమయ్యారో?

ఇద్దరు పిల్లలతో సహా భార్య అదృశ్యమై నెల రోజులు దాటుతున్నా ఆచూకీ లభించకపోవడంతో బాధితుడు ఆందోళన చెందుతున్నాడు.

  • ఇద్దరు పిల్లలు సహా వివాహిత అదృశ్యం
  • నెల రోజులైనా తెలియని ఆచూకీ
  • మునగపాక: ఇద్దరు పిల్లలతో సహా   భార్య అదృశ్యమై నెల రోజులు దాటుతున్నా ఆచూకీ లభించకపోవడంతో బాధితుడు ఆందోళన చెందుతున్నాడు.  వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని  నాగులాపల్లి గ్రామానికి చెందిన కరెట్ల వరప్రసాద్ విశాఖకు చెందిన సత్యదేవిని  2010లో వివాహం చేసుకున్నాడు.   నాగులాపల్లికి సమీపంలో అద్దె ఇంట్లో  ఉండేవారు.  వీరికి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. అయిదు నెలల క్రితం  నాగులాపల్లిలోని సొంతింటికి మారారు. తరువాత  అత్తతో  సత్యదేవికి   విభేదాలు రావడంతో విశాఖలో ఉంటున్న తల్లితండ్రుల వద్దకు వెళ్లిపోయింది.   

    గత నెల 1న  తిరిగి భర్త వద్దకు వచ్చింది.  పది రోజుల తరువాత కూరగాయల కోసం ప్రసాద్ అనకాపల్లి వెళ్లి ఇంటికి వచ్చి చూడగా భార్యా పిల్లలు కనపించకపోవడంతో ఆందోళనకు గురై అత్తమామలు, కుటుంబ సభ్యుల వద్ద వాకబు చేశాడు. ఆచూకీ లభించకపోవడంతో అదే నెల 11న మునగపాక పోలీసులకు ఫిర్యాదు చేశారు.   

    తమ పరిధి కాదని కేసు నమోదుకు మునగపాక పోలీసులు అంగీకరించకపోవడంతో అనకాపల్లి పట్టణ పోలీసు స్టేషన్‌లో అదే నెల 21న   ఫిర్యాదు చేయడం తెలిసిందే. నాటి నుంచి నేటివరకు వారి ఆచూకీ దొరక లేదు. పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి తనకు న్యాయం చేయాలని వరప్రసాద్ వేడుకుంటున్నాడు. తన భార్య, పిల్లల ఆచూకీ కనిపిస్తే 8185051114 నంబర్‌కు సమాచారం ఇవ్వగలరని కోరాడు.
     

Advertisement
 
Advertisement
Advertisement