Sasha Chettri
-
నటీనటులకు భాష అడ్డు కాదు
‘‘తెలుగులో ‘నేనెక్కడున్నా’ సినిమా చేస్తున్నానని మా నాన్నకి (బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి) చెప్పినప్పుడు సంతోషపడ్డారు. ‘భాష రాదని ఆలోచించవద్దు... వంద శాతం నీ బెస్ట్ ఇవ్వు’ అన్నారు. నటీనటులకు భాష అనేది అడ్డు కాదు... కాకూడదని నా అభిప్రాయం’’ అని మిమో చక్రవర్తి తెలిపారు. మిమో చక్రవర్తి, సాషా చెత్రి లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘నేనెక్కడున్నా’. మాధవ్ కోదాడ దర్శకుడు. కేబీఆర్ సమర్పణలో మారుతి శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా మిమో చక్రవర్తి మాట్లాడుతూ–‘‘ఊటీలో మా నాన్నగారికి హోటల్ ఉంది. నేను అక్కడే ఉండటం వల్ల తెలుగు, తమిళ సినిమాలు చూస్తూ పెరిగాను. ఇక మాధవ్ కోదాడగారు ముంబై వచ్చి కథ చెప్పిన వెంటనే ఒప్పుకున్నాను. ఇదొక కంప్లీట్ పాప్‌కార్న్ ఎంటర్టైనర్. పాటలు, మంచి యాక్షన్ సీక్వెన్సులు, సన్నివేశాలు ఉన్నాయి. తెలుగులో నాకు మంచి లాంచింగ్ మూవీ అవుతుందనుకుంటున్నాను. విలన్ పాత్రలకు నేను పర్ఫెక్ట్ ఫిట్ అని నా ఫీలింగ్. మంచి క్యారెక్టర్లు వస్తే కమెడియన్‌గా, సపోర్టింగ్ రోల్స్ చేయడానికి కూడా సిద్ధం. నాన్నగారు ప్రస్తుతం ప్రభాస్‌గారి ‘ఫౌజీ’లో నటిస్తున్నారు. నేను విక్రమ్ భట్ దర్శకత్వంలో ‘హాంటెడ్’కి సీక్వెల్ చేస్తున్నాను. అలాగే నెట్‌ఫ్లిక్స్ కోసం ‘ఖాకీ’ అనే వెబ్ సిరీస్ సీజన్ 2 చేస్తున్నాను’’ అన్నారు. -
ప్రభాస్ సినిమాలో చాన్స్ కొట్టేసిన ‘ఎయిర్టెల్ పాప’
టీవీ యాడ్స్ చూసే వాళ్లకు బాగా పరిచయం ఉన్న మెహం సాషా చెట్రిది. పేరు చెప్పగానే గుర్తుపట్టకపోవచ్చు కానీ, ఎయిర్టెల్ యాడ్‌లో కనిపించే పొట్టి జుట్టు అమ్మాయి అంటే మాత్రం వెంటనే మైండ్‌లో ఫ్లాష్ అయిపోతుంది. లుక్స్ లోనే కాకుండా చక్కని స్మైల్ తో యాక్టింగ్ తో ఆ యాడ్ రక్తి కట్టేలా బాగా నటించి సక్సెస్ అవ్వడంలో కీలక పాత్ర పోషించింది సాషా. ఈ బ్యూటీ ఇప్పుడు మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘రాధే శ్యామ్’ మూవీలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తోంది సాషా. ఈ మూవీలో ఆమె రోల్ మిస్టీరియస్ ఎలిమెంట్స్‌తో కథకి ఇంటర్‌లింక్ అయ్యి ఉంటుందని తెలుస్తోంది. అయితే సాషాకి ఇది తొలి సినిమా మాత్రం కాదు. గతంలో ఆది సాయికుమార్ హీరోగా నటించిన ఆపరేషన్ గోల్డ్ ఫిష్ చిత్రంలో నటించింది. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఈ బ్యూటీకి గుర్తింపు రాలేదు. ఇక ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా చిత్రంలో, అది కూడా ప్రభాస్ పక్కన నటించే అవకాశం సాషాని వరించింది. ఈ సినిమాతో అయినా సాషాకి మంచి గుర్తింపు వస్తుందో చూడాలి మరి. కాగా, రాధేశ్యామ్ సినిమా వచ్చేఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
తెలుగు సినిమా చేయడం గౌరవంగా భావిస్తున్నా
ప్రముఖ హిందీ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి తెలుగు పరిశ్రమకు హీరోగా పరిచయం కాబోతు న్నారు. భోషో సమర్పణలో శ్రీ కళా చిత్ర బ్యానర్‌పై మాధవ్ కోదాడ దర్శకత్వంలో రమణారావు బసవ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఎయిర్టెల్ మోడల్’ ఫేమ్ శాషా చైత్రీ కథానాయికగా నటిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఓ పబ్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. ‘‘తెలుగు పరిశ్రమకు హీరోగా పరిచయం కావడం గౌరవంగా భావిస్తున్నాను. ఈ సినిమా స్క్రిప్ట్ ఆసక్తికరంగా ఉంది’’ అన్నారు మిమో చక్రవర్తి. ‘‘మహేశ్ మంజ్రేకర్, మురళీ శర్మ, బ్రహ్మానందం, అభిమన్యుసింగ్, షిండే, రవి కాలే... ఇలా సినిమాలో భారీ తారాగణం ఉంది. ప్రస్తుతం ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీలో పార్టీ నేపథ్యంలోని పాటను చిత్రీకరిస్తున్నాం’’ అన్నారు మాధవ్ కోదాడ. ‘‘మల్టీ మీడియాలో గోల్డ్ మెడల్ పొందిన వ్యక్తి మాధవ్. తన ఆలోచనలు కొత్తగా ఉంటాయి. ఇప్పటి వరకు 95 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఇంకా ఓ పాట, ఓ ఫైట్ చిత్రీకరిస్తే సినిమా పూర్తవుతుంది. వచ్చే నెలలో ఫస్ట్ లుక్, టైటిల్‌ను ప్రకటిస్తాం. ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు రమణారావు బసవరాజు. ఈ చిత్రానికి సహనిర్మాత: మారుతీ శ్యాం ప్రసాద్‌రెడ్డి, సంగీతం: శేఖర్ చంద్ర. -
ఆసక్తికరంగా ‘ఆపరేషన్ గోల్డ్‌ఫిష్’ టీజర్
రానా, త్రివిక్రమ్ లాంటి సెలబ్రెటీలతో సినిమాకు సంబంధించిన పోస్టర్స్, ఫస్ట లుక్స్ రిలీజ్ చేయించింది ఆపరేషన్ గోల్డ్‌ఫిష్ చిత్రయూనిట్. నేడు సూపర్‌స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా టీజర్‌ను విడుదల చేయించి.. బజ్ క్రియేట్ చేసింది. చాలాకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆది సాయి కుమార్ నటించిన ఈ మూవీ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాటల రచయిత అబ్బూరి రవి కీలకపాత్రలో నటిస్తుండగా.. ఎయిర్టెల్ భామ సాషా ఛెత్రి హీరోయిన్గా నటిస్తోన్న ఈ మూవీని కాశ్మీర్ నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. దేశంలో ప్రస్తుత పరిస్థితులు కూడా ఈ సినిమాకు అనుకూలంగా ఉన్నాయి. హూ ఈజ్ ది గోల్డ్ ఫిష్ అంటూ ఆసక్తికరంగా మలిచిన ఈ టీజర్ అందర్నీ ఆకట్టుకునేలా ఉంది. మొదటి సారి వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోన్న అబ్బూరి రవి, సాషా ఛెత్రిలకు ఈ సినిమా విజయాన్ని ఇస్తుందో లేదో చూడాలి. 'వినాయకుడు' ఫేమ్ సాయికిరణ్ అడివి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. -
టాలీవుడ్‌పై కన్నేసిన ఎయిర్టెల్ భామ
సాక్షి, హైదరాబాద్ : ఎయిర్టెల్ 4జీ యాడ్‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సషా చెట్రీ టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనుంది. వినాయకుడు, కేరింత సినిమాల దర్శకుడు సాయి కిరణ్ అడవి మరో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రాన్ని తెరకెక్కించాలనుకుంటున్నారు. చిత్రంలోని పాత్రల్లో ఫ్రేష్ లుక్ కోసం కొత్త వారికి అవకాశం ఇవ్వాలనుకున్నారట. దీనికోసం జరిపిన ఆడిషన్లలో సాషా యాక్టింగ్ స్కిల్స్, డైలాగ్ డెలివరీతో డైరెక్టర్ ఇంప్రెస్ అయినట్టు సమాచారం. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ కూడా ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. డెహ్రాడూన్‌కు చెందిన ఈ 19 ఏళ్ల ముద్దుగుమ్మ మోడల్‌గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. 2015 ఆగష్టులో ఎయిర్టెల్ నెట్వర్క్ ప్రచార యాడ్‌లో సషాకు అవకాశం రావడంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.