breaking news
Salsa
-
సలామ్ సల్సా
ఆడుతూ పాడుతూ.. అలుపు సొలుపు తెచ్చుకోవాలనుకుంటున్నారా. తనువుకు వ్యాయామం.. మనసుకు ఆహ్లాదం కలిగించే సరదా స్టెప్పుల ఆటే సల్సా. చూడటానికి జల్సాగా కనిపించినా.. సల్సాతో ఫిట్నెస్ మెరుగుపర్చుకోవచ్చని చెబుతున్నారు ట్రైనీలు. అందుకే సల్సా డ్యాన్స్ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు డ్యాన్స్ క్లాస్ జరుగుతుంది. వేదిక: అవర్ సేక్రెడ్ స్పేస్, ఎస్పీ రోడ్, సికింద్రాబాద్ -
సల్సా
‘విల్ యూ డ్యాన్స్ విత్ మీ?’ ఈ ఆహ్వానం సిటీ పార్టీల్లో సహజమే. అయితే అలా అడగ్గానే ఒప్పుకోవాలనీ లేదు. డ్యాన్స్ పార్ట్నర్ దొరకాలనీ లేదు. డ్యాన్స్ రాకపోతే దిక్కులు చూడకా తప్పదు. మరేం చేయాలి? ఈ కష్టాలకి సల్సా పార్టీలే ఆన్సర్. ఒకప్పుడు సిటీలో పార్టీ అంటే సల్సా కంపల్సరీ. ఇప్పుడు.. సల్సా కోసమే పార్టీలు. ఎస్.సత్యబాబు వెన్యూ వెస్ట్రన్ డ్యాన్స్.. మొదట్లో ఇది ప్రొఫెషన్. తర్వాత ఫ్యాషన్. ఆపై ట్రెడిషన్. ఇప్పుడేమో ఎమోషన్ కూడా. వృత్తిగా మొదలై.. ప్రవృత్తిగా అల్లుకుని సాయంకాలం అందమైన సంప్రదాయంగా స్థిరపడుతూ భావోద్వేగాలను సరఫరా చేసే ఆధునాతన మార్గంగా మారింది. అపరిచితుల మధ్య కూడా అద్భుతమైన కమ్యూనికేషన్ సాధనంగా మారుతూ సిటీజనులకు చేరువైంది. ఈ నేపథ్యంలో కపుల్ డ్యాన్స్‌ల వీకెండ్ ఈవెంట్స్ మొదలయ్యాయి. బెస్ట్ ఫర్ కమ్యూనికేషన్.. ‘ఒంటరిగా వేసే చిందుల కన్నా.. జంటగా కదిపే డ్యాన్స్‌లోనే సంతృప్తి ఎక్కువ. సోషలైజింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్‌కి మంచి మార్గం కూడా’ అంటున్నారు డ్యాన్సర్ ఎం.శశాంక్. పార్ట్నర్ డ్యాన్స్‌ల ట్రైనర్‌గా, డ్యాన్స్ పార్టీల నిర్వహణకు పేరొందిన శశాంక్ వచ్చే నెలలో ఢిల్లీలో జరిగే ఇండియా ఫీస్టా లాటినా డ్యాన్స్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు అవకాశం పొందాడు. పేరుకు సల్సా పార్టీ అంటున్నా.. ఈ ఈవెంట్స్ విభిన్న రకాల కపుల్ డ్యాన్స్‌లకు కేరాఫ్ అంటున్నారాయన. వీకెండ్.. ట్రెండ్.. సల్సా పార్టీలకు రెస్టారెంట్లను, పబ్స్, క్లబ్స్‌ను ఎంచుకుంటున్నాయి సిటీలోని డ్యాన్స్ స్కూల్స్. వీకెండ్స్‌లో రాత్రి 7 నుంచి 11 గంటల మధ్య ఈ కపుల్ డ్యాన్స్‌లు హోరెత్తుతున్నాయి. కొన్ని ఈవెంట్స్‌కు ఇంతని ప్రైస్ ఫిక్స్ చేస్తున్నా.. కొంత మంది సల్సా ఇన్స్ట్రక్టర్లు ఉచితంగానే వేదికలను ఏర్పాటు చేస్తున్నారు. సల్సా నైట్స్ అంటున్నా పేరొందిన డ్యాన్సింగ్ స్టైల్స్ ఇక్కడ రాజ్యమేలుతున్నాయి. సిటీలో టాప్ 5 పార్ట్నర్ డ్యాన్స్‌ల విశేషాలు.. న్యూయార్క్ నైట్ పార్టీల ద్వారా ప్రాచుర్యం పొందిన డ్యాన్స్ స్టైల్ సల్సా. ప్రపంచంలోని అన్ని మెట్రో సిటీస్ సల్సా సందడికి ఓటేస్తున్నాయి. మన సిటీలో దాదాపు పదేళ్ల క్రితం అడుగుపెట్టింది. డొమినికన్ రిపబ్లిక్ నుంచి విశ్వవ్యాప్తమైన బచాతా.. సల్సా తరహాలో అధికంగా మెలికలు తిరిగే అవసరం లేని నృత్యం. భుజాలు, పిరుదులతో చేసే మూవ్మెంట్స్ అధికం. పార్ట్నర్స్ ఒకరికి ఒకరు ఎక్కువ దూరం జరగకుండా స్టెప్స్ మాత్రమే దూరం జరుగుతుంటాయి. సౌత్ అమెరికా మూలాలున్న నృత్యశైలి టాంగోలో మూవ్మెంట్స్ సున్నితమైన రొమాన్స్‌ను ఎక్స్‌ప్రెస్ చేస్తాయి. పురుషుని చేతుల్లో స్త్రీ విల్లులా వంపులు తిరగడం అద్భుతంగా అనిపిస్తుంది. సెంట్ ఆఫ్ ఎ ఉమెన్, టేక్ ద లీడ్, మిస్టర్ అండ్ మిస్ట్రెస్ స్మిత్, ట్రూ లైస్, షల్ వుయ్ డ్యాన్స్, ఫ్రిడా తదితర హాలీవుడ్ మూవీస్ దీనికి పెద్ద పీట వేశాయి.. లాటిన్ డ్యాన్స్‌లలోనే ఫాస్టెస్ట్‌గా ‘జై’వ్ని వ్యవహరిస్తారు. ఇందులో నీ లిఫ్టింగ్, బెండింగ్, హిప్స్ రాకింగ్లతో మూవ్మెంట్స్ ఎనర్జిటిక్‌గా ఉంటాయి ముందుకు, పక్కకు జరుగుతూ స్వింగ్ అయ్యే మూమెంట్స్ దీని స్పెషల్. క్యూబాకు చెందిన చాచాచా డ్యాన్స్ స్టైల్‌కు డ్యాన్సర్ల షూస్.. ఫ్లోర్ మీద చేసే శబ్దం నుంచి ఆ పేరు వచ్చిందట. దీన్ని ఒక ప్లే ఫుల్ డ్యాన్స్ అంటారు. స్మాల్ స్టెప్స్, ఎక్కువగా హిప్ కదలికలు ఉండే స్టైల్. ‘వన్ టూ చాచాచా’ రిథిమ్ దీనిలో పాపులర్. జంటగా చేయడం అనేది తప్ప ఈ డ్యాన్స్స్టైల్స్ వేటికవే విభిన్నం. వీటిని నేర్చుకోవడం సులభమే. ముందుగా కొన్ని రోజులైనా ప్రొఫెషనల్స్ దగ్గర శిక్షణ తీసుకున్న తర్వాత ఆన్లైన్లో వీడియోల ద్వారా మెరుగు పెట్టుకోవచ్చు. బ్యూటీఫుల్ రెస్పాన్సిబులిటీ.. వీకెండ్స్‌లో ఛేంజ్ కోసం డ్యాన్స్‌లు ఆశ్రయించడం మూడేళ్ల క్రితం అలవాటైంది. ఇప్పుడు సల్సా పార్టీలకు రెగ్యులర్ అయ్యాను. కపుల్ డ్యాన్స్‌లో మరొకరిని డ్యాన్స్‌కు ఇన్వయిట్ చేయడం దగ్గర్నుంచి అన్నీ చాలా పద్ధతిగా వ్యవహరించాలి. దీని ద్వారా ఆడవాళ్లను ఎలా రెస్పెక్ట్ చేయాలో కూడా అర ్థమవుతుంది. మనం మనకోసమే మాత్రమే చేయడం లేదని మరొకరితో కలిసి చేస్తున్నామనే బ్యూటీఫుల్ రెస్పాన్సిబులిటీని ఫీలవుతాం. - అర్జిత్ ముఖర్జీ, ఐటీ ఉద్యోగి. కాఫీషాప్‌లో సల్సానైట్స్... పార్ట్నర్ డ్యాన్స్‌లకు ఇప్పుడు బాగా పాపులర్ అయ్యాయి. మా డ్యాన్స్‌స్కూల్ తరఫున సల్సానైట్స్ నిర్వహిస్తున్నాం. బ్రదర్స్-సిస్టర్స్, కొలీగ్స్.. ఇలా పలువురు వీటి కి హాజరవుతున్నారు. రెస్టారెంట్స్, పబ్స్‌లోనే కాదు తరచుగా కాఫీషాప్స్లో సైతం సల్సాపార్టీలను నిర్వహిస్తున్నాం. ప్రత్యేకమైన మ్యూజిక్ ఉంటుంది కాబట్టి వీటికి స్పెషలైజ్డ్ డిజె కావాలి. నేను డిజెయింగ్ కూడా చేస్తాను. - శశాంక్, డ్యాన్స్‌మాస్టర్. సింక్‌వన్ డ్యాన్స్ స్కూల్ ఆరోగ్యానందాలనిచ్చే అడిక్షన్.. లాస్ట్ ఇయర్ నుంచే కపుల్డ్యాన్స్లో పార్టిసిపేట్ చేయడం అలవాటైంది. ఇదొక అద్భుతమైన ఆనందాన్నిచ్చే అడిక్షన్. సోషలైజింగ్‌కు ఇది బెస్ట్ రూట్. డిఫరెంట్ పీపుల్‌తో కలిసి డ్యాన్స్ చేయడం వల్ల ఒకరి నుంచి ఒకరు ఎన్నో నేర్చుకుంటాం. కపుల్ డ్యాన్సింగ్ చేసేవారిలో కొందరు ఆడవాళ్ల పట్ల రాంగ్ ఇంటెన్షన్స్ ఉండే అవకాశం ఉంది. అయితే అవి మనకు ఈజీగానే తెలిసిపోతాయి. దాంతో వారిని దూరంగా ఉంచడం ఎలాగో కూడా తెలుస్తుంది. - సునంద, సాఫ్ట్వేర్ ఇంజినీర్ -
సాల్సా 4 వాటర్
డ్యాన్స చేస్తే ఏం వస్తుంది? ఆనందం! అంతేనా? సామాజికసేవకు కావలసిన చైతన్యం కూడా అంటున్నారు ఈ యువకులు... వీళ్లు మామూలు విద్యార్థులు... మెరిట్ విద్యార్థులు ఎంతమాత్రం కాదు. గొప్ప విద్యావంతులుగానో, వ్యాపారవేత్తలుగానో ఎదిగే అవకాశం లేనివారు. అయినా తమకు చేతనైనంతలో సేవ చేసి చూపిస్తున్నారు! ప్రస్తుతం ప్రపంచంలో తాగడానికి సురక్షితమైన నీటి సదుపాయం లేని వారి సంఖ్య 783 మిలియన్లు (ఒక మిలియన్‌కి పదిలక్షలు). ఇంకోరకంగా చెప్పాలంటే ప్రపంచ జనాభాలో ప్రతి పదిమందిలో ఒకరికి సురక్షితమైన నీరు అందుబాటులో లేదు. దీనివల్ల వారికి అనారోగ్యపరమైన సమస్యలు వస్తున్నాయి. చిన్నారులకు అత్యంత భయంకరమైన వ్యాధులు సోకుతున్నాయి. ఈ విషయం తెలిసినప్పుడు ఎవరైనా బాధపడతారు. గ్లాస్గో యూనివర్సిటీలో చదువుతున్న కొంతమంది విద్యార్థులకు కూడా ఇలాగే బాధేసింది. ట్రెండీ, మోడ్రన్, అర్బనైజ్డ్ అయిన వీరు ఈ విషయంలో బాధపడి ఊరుకోలేదు, తామేం చేయలేం... అనే అభిప్రాయానికి రాలేదు. మనసుంటే మార్గం ఉంటుందన్నట్టుగా... వాటర్ విషయంలో వారి వితరణ మొదలైంది. సాల్సాను సొమ్ముచేసుకొన్నారు! యూకే పరిధిలోని యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గోలో ‘సాల్సా’ అంటే పిచ్చి. సాల్సా వచ్చిన వాళ్లు మిగిలిన వారి దృష్టిలో ఆరాధ్యులే! అలాంటి సాల్సా డాన్స్ నేర్చుకొని వర్సిటీలో హీరోలు అయిపోదామని చాలామంది స్టూడెంట్స్ అనుకొంటుంటారు. అలాంటి నేపథ్యంలో సాల్సాకూ చారిటీకి ముడిపెట్టారు కొంతమంది స్టూడెంట్స్. తాము సాల్సా డాన్స్ నేర్పిస్తామని, నేర్చుకొన్నవారు డబ్బు చెల్లించాల్సి ఉంటుందని, ఆ డబ్బును పేద ప్రజలకు మంచినీటిని అందించేందుకు వినియోగిస్తామని ప్రకటించారు. అలా ‘సాల్సా 4 వాటర్’ స్టూడెంట్స్ ఎన్జీవో ప్రస్థానం మొదలైంది. అనేక వర్సిటీలకు... ఒక మనిషికి ఒక ఏడాది పాటు సురక్షితమైన నీటిని అందివ్వడానికి అయ్యే ఖర్చు 15 పౌండ్లు (ఒక పౌండ్ అంటే రూ.101)గా లెక్కగట్టారు విద్యార్థులు. ఈ లెక్కన వీలైనంత ఎక్కువమంది కోసం తాము నిధుల సేకరణ చేపట్టాలని భావించారు. చారిటీ కార్యక్రమం గురించి సమాచారం అందుకొని వర్సిటీలో నూటయాభై మంది డాన్స్ మాస్టర్లు ముందుకొచ్చారు. నేర్చుకోవాలనుకొంటున్నవారు ఒక్కో క్లాస్‌కు మూడు పౌండ్లు చెల్లించాల్సి ఉంటుంది. అలా యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గోలో మొదలైన ఈ నిధుల సేకరణకార్యక్రమం ఇప్పుడు యూకే మొత్తం విస్తరించింది. అనేక వర్సిటీల్లో ఊపందుకొంది. యువతీ యువకుల ఆదరణ చూరగొంది. సూపర్ సక్సెస్ అయ్యింది! సాల్సా ద్వారా వీరంతా కలసి ఇప్పటివరకూ వేల డాలర్ల నిధులు సేకరించారు. వేలాది మందికి సురక్షిత నీటి సదుపాయాన్ని కలిగించారు. ఈ స్టూడెంట్స్ స్ఫూర్తి మిగతా దేశాలకూ పాకింది. చెక్ రిపబ్లిక్, స్వీడన్, ఫ్రాన్స్ దేశాల్లోని అనేక వర్సిటీల్లో ‘సాల్సా 4 వాటర్’ ఎన్జీవో కార్యక్రమాలు విస్తరించాయి. వివిధ వ్యాపారసంస్థలు ఈ ఎన్జీవోకి అవార్డులు, రివార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాయి. సాల్సాకు ఉన్న క్రేజ్‌ను చారిటీగా మార్చాలనే ఐడియా శామ్ కండల్ అనే గ్లాస్గో యూనివర్సిటీ విద్యార్థిది. అయితే కార్యాచరణలో వర్సిటీలోని అందరి విద్యార్థులదిగా మొదలైంది. ఉమ్మడిగా, ఉత్సాహంగా ఊపందుకొంది. సామాజికసేవకు తమ వంతు సహకారాన్ని అందిస్తోంది. ఛారిటీ కార్యక్రమం గురించి సమాచారం అందుకొని వర్సిటీలో నూటయాభై మంది డాన్స్మాస్టర్లు ముందుకొచ్చారు. నేర్చుకోవాలనుకొంటున్న వారు ఒక్కో క్లాస్‌కు మూడు పౌండ్లులు చెల్లించాల్సి ఉంటుంది. అలా యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గోలో మొదలైన ఈ నిధులసేకరణ కార్యక్రమం ఇప్పుడు యూకే మొత్తం విస్తరించింది. అనేక వర్సిటీల్లో ఊపందుకొంది.