breaking news
salim nagar
-
జెమినీ ఫ్రెండ్స్‌ను గెలిపించిన ఆకాశ్
ఎ2-డివిజన్ రెండు రోజుల లీగ్ సాక్షి, హైదరాబాద్: ఆకాశ్ సనా (53 పరుగులు; 7 వికెట్లు) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జెమినీ ఫ్రెండ్స్ జట్టును గెలిపించాడు. ఎ2-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో జెమినీ జట్టు 81 పరుగుల తేడాతో సలీమ్‌నగర్ జట్టుపై గెలిచింది. మొదటి రోజు ఆకాశ్ అర్ధసెంచరీతో జెమినీ ఫ్రెండ్ 283 పరుగులు చేసింది. రెండో రోజు మంగళవారం సలీమ్‌నగర్ జట్టు 202 పరుగులకే ఆలౌటైంది. బౌలింగ్‌లో నిప్పులు చెరిగిన ఆకాశ్ 7 వికెట్లు తీశాడు. మరో మ్యాచ్‌లో క్రౌన్ జట్టు 48 పరుగుల తేడాతో బడ్డింగ్ స్టార్స్‌పై నెగ్గింది. తొలి రోజు ఆటలో క్రౌన్ 283 పరుగులు చేసింది. శివదత్త 5 వికెట్లు తీశాడు. రెండో రోజు బడ్డింగ్ స్టార్స్ 235 పరుగుల వద్ద ఆలౌటైంది. నీలేశ్ (49), శ్రేయస్ (44), కౌశిక్ (39)లతో పాటు శివదత్త (31) భారీస్కోర్లు చేయలేకపోవడంతో పరాజయం తప్పలేదు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు చార్మినార్ సీసీ: 247 (అసద్ అలీ 94; ప్రతీక్ సాంగ్లీ 6/63), కొసరాజు: 251/2 (యశ్వంత్ 102, రాకేశ్ 74, లోహిత్ 32) అపెక్స్ సీసీ: 207 (చంద్రశేఖర్ 64; అభిషేక్ 4/50), నిజామ్ కాలేజి: 126 (శరత్ 48; చంద్రశేఖర్ 6/56) వీనస్ సైబర్‌టెక్: 214 (శ్రీకాంత్ 67), గౌడ్స్ ఎలెవన్: 216/7 (అవినాశ్ 75, వంశీ 46; కళ్యాణ్ 3/69) బ్రదర్స్ ఎలెవన్: 211 (రాహుల్ 63; యోగేశ్ 5/56), పీఅండ్‌టీ కాలనీ: 215/3 (జితేందర్ త్యాగి 119 నాటౌట్, ఉత్తమ్ 35) -
సలీమ్‌నగర్ గెలుపు
ఎ2-డివిజన్ రెండు రోజుల లీగ్ సాక్షి, హైదరాబాద్: సలీమ్‌నగర్ బ్యాట్స్‌మన్ ఎం.మహేందర్ (107 నాటౌట్) అజేయ సెంచరీ సాధించడంతో ఆ జట్టు 9 వికెట్ల తేడాతో గౌడ్స్ ఎలెవన్ జట్టుపై గెలుపొందింది. ఎ2-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గౌడ్స్ ఎలెవన్ 175 పరుగులకు ఆలౌటయింది. ఓవర్‌నైట్ స్కోరు 123/1తో శుక్రవారం ఇన్నింగ్స్ కొనసాగించిన సలీమ్‌నగర్ జట్టు.. ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 177 పరుగులు చేసి గెలిచింది. మరో మ్యాచ్‌లో స్పోర్టింగ్ ఎలెవన్ జట్టు 30 పరుగుల తేడాతో ఆక్స్ఫర్డ్ బ్లూస్‌పై విజయం సాధించింది. తొలుత స్పోర్టింగ్ జట్టు 160 పరుగులు చేసి... ఆ తర్వాత ఆక్స్‌ఫర్డ్‌ను 130 పరుగులకే పరిమితం చేసింది. స్పోర్టింగ్ బౌలర్లలో చంద్రకాంత్ 4, హరిశివ మూడు వికెట్లు తీశారు. ఇతర మ్యాచ్‌ల వివరాలు: న్యూ బ్లూస్: 202 (సాయి చరణ్ 81; ప్రతీక్ 3/46, సుక్మీన్ 3/17), కొసరాజు: 206/5 (సుఖీన్ జైన్ 82 నాటౌట్, యశ్వంత్‌రెడ్డి 53; పూజిత్ వంశీ 4/46); ఖల్సా: 116 (కె.నాగరాజు 4/26, వినయ్‌కుమార్ 3/21), గుజరాతీ: 120/4.