breaking news
Sailendra Kumar Joshi
-
ఈఎన్సీ మురళీధర్ పదవీకాలం పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ చీఫ్(ఈఎన్సీ) సి.మురళీధర్ పదవీకాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ శైలేంద్ర కుమార్ జోషి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పాటు సెంట్రల్ డిజైన్ ఆర్గైనె జేషన్ (సీడీఓ) చీఫ్ ఇంజనీర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్.ప్రదీప్‌కుమార్, పదవీ విరమణ చేసిన కారణంగా ఆయన స్థానంలో క్వాలిటీ కంట్రోల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎ.నరేందర్‌రెడ్డికి చీఫ్ ఇంజనీర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ మరో ఉత్తర్వు కూడా జారీ చేశారు. -
నిధుల వినియోగంలో ‘స్థానిక’ భాగస్వామ్యం
* ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఆర్థిక సంఘం నుంచి విడుదలైన నిధులతో నగర, పురపాలక సంస్థల పరిధిలో చేపట్టే అభివృద్ధి పనుల ప్రతిపాదనల తయారీలో ఎక్కడికక్కడ పాలక వర్గాలకు భాగస్వామ్యం కల్పించాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషీ ఆదేశాలిచ్చారు. ఈ మేరకు నిధుల కేటాయింపులు, పర్యవేక్షణ కమిటీ సమావేశంలో తీర్మానాలను ఆమోదిస్తూ బుధవారం ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక సంస్థల కోసం ఈ ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం రూ. 268.01 కోట్ల నిధులు విడుదల చేయగా.. రూ. 267.67 కోట్లతో వివిధ పనులు చేపట్టేందుకు మున్సిపాలిటీలు పంపిన ప్రతిపాదనలను ఆమోదిస్తున్నట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2011-12 నుంచి నాలుగేళ్లుగా విడుదలైన నిధులతో ఇప్పటికే మంజూరైన పనులను రద్దు చేసి కొత్త పనులు చేపట్టేందుకు అనుమతులు జారీ చేసే అధికారాన్ని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్, డెరైక్టర్‌కు ప్రభుత్వం కట్టబెట్టింది. ఈ నిధుల వినియోగానికి సంబంధించి త్వరలో కొత్త మార్గదర్శకాలను జారీ చేయనుంది.