breaking news
saibarabad
-
రాత్రుళ్లు చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: రాత్రుళ్లు ఇళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఆవుల కిరణ్ అనే వ్యక్తిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. గత 7సంవత్సరాల నుంచి 90 కేసుల్లో అతడు నిందితుడిగా ఉన్నట్లు తెలిపారు. ఇటీవల ఖమ్మం పోలీసులకు చిక్కి జైలుకు వెళ్ళాడు. జూలైలో విడుదల అయిన నిందితుడు మళ్ళీ దొంగతనాలకు పాల్పడటం మొదలు పెట్టాడు. రెక్కీ నిర్వహించి చోరి చేయడం అతని నైజం అని తెలిపారు. నంబర్ ప్లేట్ లేని వాహనం, నల్ల హెల్మెట్ వాడుతూ చోరీలు చేస్తున్నట్లు పోలీసుల వెల్లడించారు. సీసీటీవీ కెమెరాల ద్వారా పట్టుకున్నట్లు తెలిపారు. అతని వద్ద నుంచి రూ.16.70 లక్షల విలువ చేసే 390గ్రాముల బంగారం, 829 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నట్లు ఉన్నారు. మరో 60తులాల బంగారం రికవరీ చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. చదవండి: 14 కేజీల బంగారం మాయం.. -
మూడు రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్
సాక్షి, సిటీబ్యూరో : కేవలం 26 ఏళ్ల వయస్సుకే హర్యానా, రాజస్థాన్, పంజాబ్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న ఘరానా గ్యాంగ్‌స్టర్ సంపత్ నెహ్రా సైబరాబాద్ పరిధిలో చిక్కాడు. హర్యానా నుంచి వచ్చిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్) అధికారులు మాదాపూర్ జోన్ ఎస్వోటీ సహకారంతో బుధవారం అతడిని పట్టుకున్నారు. స్థానిక కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై హర్యానాకు తరలించినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ గురువారం తెలిపారు. రాజస్థాన్‌లోని కలోడి ప్రాంతానికి చెందిన సంపత్ చండీఘడ్‌లో స్థిరపడ్డాడు. పంజాబ్ యూనివర్శిటీ పరిధిలోని డీఏవీ కాలేజీలో బీఏ చదివిన అతను వర్శిటీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు అనుచరుడిగా పని చేశాడు. బిష్ణోయ్‌ని పోలీసులు అరెస్టు చేయడంతో తానే ఓ గ్యాంగ్‌స్టర్‌గా మారాడు. యువత, విద్యార్థులతో భారీ నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్న సంపత్ తన సామ్రాజ్యాన్ని హర్యానాతో పాటు పంజాబ్, రాజస్థాన్‌లకూ విస్తరించాడు. వరుస నేరాలు చేస్తూ, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ మూడు రాష్ట్రాల పోలీసులకు సవాల్ విసిరాడు. పది సంచలనాత్మక హత్యలు, మూడు హత్యాయత్నాలతో పాటు బెదిరింపులు, దోపిడీల కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నాడు. ప్రతి నేరంలోనూ తుపాకీ వినియోగించిన సంపత్ డబుల్ హ్యాండ్ షూటర్. తన రెండు చేతులతోనూ ఏక కాలంలో తుపాకీ పేల్చగలడు. హర్యానాలోని పంచకుల ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న తన అనుచరుడు దీపక్ అలియాస్ టింకును వినిపించడానికి అతను పోలీసుల పైనే తుపాకీ ఎక్కుపెట్టాడు. ఎ స్కార్ట్ అధికారుల కళ్లల్లో కారం చల్లడంతో పాటు కాల్పులు జరిపి తన అనుచరుడిని తప్పించాడు. రాజస్థాన్‌లోని రాజ్‌ఘర్ కోర్టు ఆవరణలో అజయ్ అనే ప్రత్యర్థిపై కాల్పులు జరిపిన సంపత్ అతడిని హత్య చేశాడు. మూడు రాష్ట్రాల్లోనూ ఇతడి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. దీంతో చండీఘర్‌కు పారిపోయిన సంపత్ అక్కడి ఖోర్బా ప్రాంతంలో తలదాచుకున్నాడు. దాదాపు 20 రోజుల క్రితం మియాపూర్‌కు వచ్చిన అతడు గోకుల్‌ప్లాట్స్‌లో ఓ అద్దె ఇంట్లో మకాం పెట్టాడు. ఇతడి కదలికలను గుర్తించిన ఎస్టీఎఫ్ అధికారులు సైబరాబాద్‌కు చేరుకున్నారు. బుధవారం ఎస్వోటీ సాయంతో సంపత్‌ను పట్టుకుని తీసుకువెళ్లారు. -
ఇదీ పోలీస్ వసూల్ రాజాల జాబితా
ఎంతో కాలంగా పోలీస్ వ్యవస్థలో పాతుకుపోయిన అవినీతి డొంక కదిలింది. శాఖలో ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుల్ దాకా వసూళ్లకు పాల్పడుతున్న వారి జాబితాను డీజీపీ కార్యాలయం ప్రకటించింది. వీరిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఇదీ వసూల్ రాజాల జాబితా సైబరాబాద్: 13 మంది రాచకొండ: 24 మంది హోంగార్డులు: 6 కానిస్టేబుళ్లు: 24 హెడ్–కానిస్టేబుళ్లు: 6 ఏఎస్సై: 1 భువనగిరి ఏసీపీకి ఆరుగురు ‘కలెక్టర్లు’ సాక్షి, సిటీబ్యూరో: కలెక్టర్... పోలీసు విభాగంలోనూ అనధికారికంగా ఈ పోస్టు ఉంటుంది. సబ్–ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, ఏసీపీలకు నెల వారీ, కొన్ని ప్రత్యేక కేసుల్లో మామూళ్లు కలెక్ట్ చేసి ఇవ్వడం ఇతడి బాధ్యత. సాధారణంగా హోంగార్డు, కానిస్టేబుల్ స్థాయి అధికారులే కలెక్టర్లుగా ఉంటుంటారు. అయితేనేం... ఆ ఠాణా, డివిజన్లో అతడే పవర్ఫుల్. షాడో ఇన్స్పెక్టర్, ఏసీపీలుగా వ్యవహరిస్తుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ వసూల్‌రాజాల జాబితాను డీజీపీ కార్యాలయం రూపొందించింది. ఇందులో సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో పని చేస్తున్న వారు 37 మంది ఉన్నారు. ఆరుగురు కలెక్టర్లను ఏర్పాటు చేసుకున్న భువనగిరి ఏసీపీ జితేందర్‌రెడ్డి వసూళ్ల పర్వంలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు డీజీపీ కార్యాలయం తయారు చేసిన జాబితా స్పష్టం చేస్తోంది. సిటీ టు స్టేట్.. ప్రస్తుత డీజీపీ మహేందర్‌రెడ్డి 2014లో రాష్ట్ర అవతరించిన తర్వాత హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆపై ఏడాదిలోపే అవినీతి నిరోధక చర్యలు ప్రారంభించిన ఆయన సిటీలో ఉన్న వసూల్ రాజాలపై దృష్టి పెట్టారు. స్పెషల్ బ్రాంచ్ ద్వారా లోతుగా ఆరా తీయించి, దాదాపు 100 మందితో కూడిన జాబితాను రూపొందించారు. వీరిని సిటీ ఆరడ్మ్ రిజర్వ్ విభాగానికి బదిలీ చేయించారు. ఇప్పుడు డీజీపీగా మహేందర్‌రెడ్డి రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, కమిషనరేట్లలో ఉన్న కలెక్టర్లపై ఆరా తీయాల్సిందిగా నిఘా విభాగాన్ని ఆదేశించారు. దాదాపు రెండు నెలల పాటు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టిన ఇంటెలిజెన్స్ వింగ్ 391 మందితో కూడిన జాబితాను రూపొందించి గత నెల 23న డీజీపీకి సమర్పించింది. అగ్రస్థానంలో జితేందర్‌రెడ్డి... ఈ 391 మందిలో సైబరాబాద్‌కు చెందిన వారు 13 మంది, రాచకొండ కమిషనరేట్లలో పని చేస్తున్న వారు 24 మంది ఉన్నారు. వీరిలో హోంగార్డు నుంచి అసిస్టెంట్ సబ్–ఇన్స్పెక్టర్ వరకు వివిధ హోదాలకు చెందిన అధికారులు ఉన్నారు. భువనగిరి ఏసీపీ ఎం.జితేందర్‌రెడ్డి ఏకంగా ఆరుగురు కలెక్టర్లను ఏర్పాటు చేసుకుని రెండు కమిషనరేట్లలోనూ అగ్రస్థానంలో నిలిచారు. ఈయన తన డ్రైవర్‌గా ఉన్న ఏఆర్ కానిస్టేబుల్‌తో పాటు బి.రామారంలో ఇద్దరు, భువనగిరి టౌన్లో ఇద్దరు, బీబీనగర్‌లో ఒకరు కలెక్టర్లను ఏర్పాటు చేసుకున్నారు. చౌదరిగూడెం ఇన్స్పెక్టర్ లింగం ఏకంగా ఏఎస్సై స్థాయి అధికారినే వసూల్ రాజాగా మార్చుకున్నారు. దుండిగల్, జీడిమెట్ల ఇన్స్పెక్టర్లకు ముగ్గురు చొప్పున, షాద్‌నగర్, పహాడీషరీఫ్, భువనగిరి, బీబీనగర్, వలిగొండ, యాదగిరిగుట్ట రూరల్, మల్కాజ్గిరి ఇన్స్పెక్టర్లకు ఇద్దరు చొప్పున కలెక్టర్లు ఉన్నారు. చేయించిన వారిపై చర్యలేవీ? ఈ కలెక్టర్లు అంతా ప్రధానంగా రెస్టారెంట్లు, బార్స్, వైన్‌షాపులు, పబ్స్ తదితర వ్యాపార సంస్థల నుంచి నెలవారీ, కొన్ని కేసుల్లో బాధితులు, నిందితులతో పాటు వారి సంబం«ధీకుల నుంచి మామూళ్లు వసూలు చేస్తుంటారు. జాబితాను అన్ని జిల్లాల ఎస్పీలకు, పోలీసు కమిషనరేట్ల కమిషనర్లకు ఈ–మెయిల్ రూపంలో పంపించిన డీజీపీ వసూల్ రాజాలను ఏఆర్ విభాగానికి బదిలీ/ఎటాచ్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అయితే వసూలు చేసిన వారిపై కఠినంగా వ్యవహరిస్తూ వసూలు చేయించిన వారిని విస్మరించడం ఎంత వరకు న్యాయమని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా వ్యవహరించే సదరు పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్/ఎస్సై లేదా డివిజన్ ఏసీపీలు/డీఎస్పీల ఆదేశాల మేరకే, వారికోసమే వసూళ్లు జరుగుతాయని, అందులో కలెక్టర్లకూ కొంత మొత్తం ముడుతుందని చెప్తున్నారు. నేరం చేసిన వారిపై వేటు వేస్తున్న ఉన్నతాధికారులు దానికి ప్రేరేపించిన వారిని వదిలేయడం ఏమిటని అంటున్నారు. కలెక్టర్లను నియమించుకున్న వారి పైనా చర్యలు తీసుకోవాలని, అప్పుడే సమస్య పునరావృతం కాకుండా ఉంటుందని పేర్కొంటున్నారు. మామూళ్లు అడిగితే ఫిర్యాదు చేయండి తమ కమిషనరేట్ పరిధిలో ఎవరైనా మామూళ్ళు అడిగితే నేరుగా తనకే ఫిర్యాదు చేయాలని హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు అంజనీ కుమార్, వీసీ సజ్జనార్ గురువారం కోరారు. హోటళ్ళు, రెస్టారెంట్స్, వైన్ షాపులు, బార్స్, లాడ్జిలు, పబ్స్, ఇతర వ్యాపార సంస్థలు, గేమింగ్ జోన్స్, పార్లర్స్, కేఫ్‌లు తదితరాలు నిబంధనలకు అనుగుణంగానే పని చేయాలని స్పష్టం చేశారు. అలా కాకుంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆయా సంస్థల వద్ద ఎవరైనా పోలీసులు మామూళ్ళు డిమాండ్ చేస్తే హైదరాబాద్ పరిధికి చెందిన వారు 9490616555, సైబరాబాద్ వారు 9490617444 నెంబర్లకు వాట్సాప్ ద్వారా, లేదా హైదరాబాద్‌కు చెందిన వారు (cphydts@gmail. com), సైబరాబాద్వారు(cpcybd@gmail.com)కు ఈ–మెయిల్ చేయడం ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ మేరకు గురువారం ఇరువురు కమిషనర్లు ప్రకటనలు విడుదల చేశారు. -
సైబరాబాద్‌కు 18 మంది ఏఎస్ఐల బదిలీ
ధారూరు: రంగారెడ్డి జిల్లా నుంచి సైబరాబాద్‌కు 18 మంది ఏఎస్ఐలు బదిలీ అయ్యారు. జిల్లా ఎస్పీ రాజకుమారి ఏఎస్ఐల బదిలీ జాబితాను జారీచేశారు. బదిలీ ఉత్తర్వులు ఈనెల 8న జారీ అయ్యాయి. ధారూరు పీఎస్‌లో పనిచేస్తున్న ఏఎస్ఐలు ఎం. శ్రీనివాస్, డి. రామకృష్ణలు, బషిరాబాద్ నుంచి సయ్యద్ నజీర్ మియా, మర్పల్లి పీఎస్ నుంచి ఎం. శ్యామ్‌రావు, జిల్లా ఉమెన్ పీఎస్ నుంచి ఎండీ మొహినుద్దీన్, శంకర్పల్లి నుంచి నర్సింహారెడ్డి, కె. మోహన్‌రెడ్డి, చేవెళ్ల నుంచి కె. నర్సింహులు, మోమిన్‌పేట్ నుంచి పుల్లారెడ్డి, జిల్లా సీసీఎస్ నుంచి ఎం. ఆంజనేయులు, షాబాద్ నుంచి సుబ్రహ్మణ్యం, ఎన్. నారాయణరావులు, కరణ్‌కోట్ నుంచి ఎస్.వేణుగోపాల్‌రెడ్డి, నవాబుపేట్ నుంచి ఇ. తిరుపతిరెడ్డి, పి. రాంరెడ్డిలు, మర్పల్లి నుంచి బి. శ్రీధర్‌రావు, పరిగి నుంచి దేవేందర్, చెన్గోముల్ పోలీస్ స్టేషన్ నుంచి ఎం. శ్రీశైలంగౌడ్‌లు సైబరాబాద్‌కు బదిలీ అయ్యారు.