breaking news
sahaja sree
-
చాంపియన్ సహజశ్రీ
సాక్షి, హైదరాబాద్: జాతీయ మహిళల అమెచ్యూర్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారిణి చొల్లేటి సహజశ్రీ అదరగొట్టింది. పంజాబ్‌లోని జలంధర్‌లో జరిగిన ఈ మెగా ఈవెంట్లో విజేతగా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. కరీంనగర్‌కు చెందిన సహజశ్రీ నిర్ణీత 11 రౌండ్ల తర్వాత 7.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో చైనా వేదికగా డిసెంబర్ 31 నుంచి 6 వరకు జరుగనున్న ప్రపంచ అమెచ్యూర్ చెస్ చాంపియన్‌షిప్‌కు ఆమె అర్హత సాధించింది. -
ప్రిక్వార్టర్స్‌లో సాయి దేదీప్య, సహజ
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) 50కే ప్రైజ్‌మనీ మహిళల, పురుషుల టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి వై. సాయిదేదీప్య, సహజ శుభారంభం చేశారు. ఎల్బీ స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ విభాగంలో వీరిద్దరూ ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నారు. సోమవారం జరిగిన తొలిరౌండ్లో రెండోసీడ్ దేదీప్య 5–7, 6–4, 6–1తో సింధు జనగాం (తెలంగాణ)పై విజయం సాధించింది. నేడు జరిగే ప్రిక్వార్టర్స్‌లో కర్ణాటకకు చెందిన సొనాషి భట్నాగర్‌తో దేదీప్య తలపడుతుంది. మరో మ్యాచ్‌లో సహజ యామలపల్లి 6–2, 2–6, 6–2తో మౌలిక రామ్ (తెలంగాణ)ను ఓడించింది. పురుషుల తొలిరౌండ్ మ్యాచ్‌ల్లో టాప్‌సీడ్ కృష్ణ తేజ (తెలంగాణ) 7–5, 6–1తో హిమాన్షు మౌర్య (ఛత్తీస్‌గఢ్)పై గెలుపొందగా... సాయి నిఖిల్ (తెలంగాణ) 4–6, 4–6తో సంసిధ్ (తమిళనాడు) చేతిలో ఓడిపోయాడు. మరో మ్యాచ్‌లో కవిన్ మసిలమణి (తమిళనాడు) 4–6, 6–3, 6–3తో రోహిత్ కృష్ణ (తెలంగాణ)పై నెగ్గారు. ఇతర మహిళల మ్యాచ్‌ల ఫలితాలు లక్ష్మీ సాహితి రెడ్డి (ఏపీ) 6–0, 6–2తో సొనాలి జైశ్వాల్ (తెలంగాణ)పై, అనూష కొండవీటి (ఏపీ) 6–3, 6–3తో దీక్ష (తెలంగాణ)పై, ముష్రత్ షేక్ (ఏపీ) 6–3, 6–2తో భక్తి షా (తెలంగాణ)పై, షాజిహా బేగం (తెలంగాణ) 6–2, 7–5తో మాల్విక శుక్లా (మహారాష్ట్ర)పై, లిఖిత (తెలంగాణ) 7–5, 6–4తో ఆకాంక్ష నిట్టూర్ (మహారాష్ట్ర)పై, సంస్కృతి దామెర (తెలంగాణ) 6–3, 7–6 (4), 6–3తో బిపాషా (ఏపీ)పై, సి. శ్రావ్య శివాని (తెలంగాణ) 6–3, 6–1తో విదిషా రెడ్డి (తెలంగాణ)పై, ఎల్. లిఖిత (తెలంగాణ) 6–1, 6–1తో భవిక (మహారాష్ట్ర)పై గెలుపొందారు. -
‘బెస్ట్ ప్లేయర్’గా సహజశ్రీ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్లో సెయింట్ ఆన్స్ మహిళా కాలేజ్ విద్యార్థిని చొల్లేటి సహజశ్రీ రాణించింది. ఫుణే చెస్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నమెంట్లో సహజశ్రీ ‘ఉత్తమ మహిళా క్రీడాకారిణి’ పురస్కారాన్ని అందుకుంది. మొత్తం తొమ్మిది రౌండ్లపాటు జరిగిన టోర్నీలో సహజశ్రీ 6.5 పాయింట్లను సాధించింది. ఈ టోర్నీ సెప్టెంబర్ 24నుంచి 29 వరకు పుణేలో జరిగింది.