breaking news
Sadanandam Goud
-
పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాలి: ఎస్టీయూటీఎస్
సాక్షి, హైదరాబాద్: పీఆర్సీ కమిటీని తక్షణమే నియమించి, పెండింగ్లో ఉన్న పీఆర్సీ బకాయిలను విడుదల చేయాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం, తెలంగాణ (ఎస్టీయూటీఎస్) రాష్ట్ర కౌన్సిల్ సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సంఘం అధ్యక్షుడు బి.సదానందంగౌడ్ అధ్యక్షతన ఎస్టీయూటీఎస్ రజతోత్సవ వేడుకలు ఆదివారం హైదరాబాద్లో ముగిశాయి. ఈ సందర్భంగా సమావేశం పలు తీర్మానాలు చేసింది. టీచర్ల పదోన్నతులు, బదిలీలకు షెడ్యూల్ ఇవ్వాలని, వేతనేతర, మెడికల్ బిల్లులు మంజూరు చేయాలని, తొలిమెట్టు కార్యక్రమాన్ని సరళతరం చేయాలని, టీచర్లను బోధనకే పరిమితం చేయాలని, 317 జీవో వల్ల నష్టపోయిన టీచర్లకు న్యాయం చేయాలని, స్పౌజ్ కేసులను పరిష్కరించాలని కోరింది. ఎమ్మెల్సీగా బరిలోకిదిగిన భుజంగరావుకు ఉపాధ్యాయులు బాసటగా నిలవాలని పిలుపునిచ్చింది. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి పర్వతరెడ్డి పాల్గొన్నారు. -
కనీస వేతన మండలి చైర్మన్గా సదానందం గౌడ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్గా మంద సదానందం గౌడ్ నియమితులయ్యారు. మండలిలో సభ్యుల జాబితాలో ఆరు మంది కార్మిక సంఘాల నేతలతో పాటు మరో ఆరు మంది యాజమాన్యాల ప్రతినిధులకు అవకాశం కల్పించింది. ఈ మేరకు కార్మిక శాఖ కార్యదర్శి ఆర్వీ చంద్రవదన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సభ్యులుగా నియమితులైన వారిలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్, ఐఎన్టీయూసీ ముఖ్యకార్యదర్శి దేవసాని బిక్షపతి, బీఎంఎస్ ఉపాధ్యక్షుడు బి.రాజ్ రెడ్డి, ఏఐటీయూసీ ముఖ్యకార్యదర్శి టి.నరసింహ, టీఆర్ఎస్కేవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.నారాయణ, హెచ్ఎంఎస్ గ్రేటర్ కార్యదర్శి పి.నరసింహ, ఫ్యాప్సీ ఉపాధ్యాక్షుడు వెన్నం అనిల్ రెడ్డి, సైనోడ్ ఆసియాపిక్ -ఎంఈఏ హెచ్ఆర్ డెరైక్టర్ ఉమా దేవగుప్తా, దక్షిణ భారత మిల్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.సెల్వరాజు, ఈఎఫ్ఎస్ఐ తెలంగాణ శాఖ గౌరవ కార్యదర్శి ఎస్ఎల్ఎన్ మూర్తి, రిసోర్స్ ఇన్పుట్ హెచ్ఆర్ మేనేజర్ సీవీ మధుసూదన్ రావు, లేజర్ షేవింగ్ మేనేజర్ పి.పెంటారెడ్డిలతో పాటు ఇద్దరు స్వంతంత్ర సభ్యులు ఈ వెంకటేశన్, సీహెచ్ నారాయణ రెడ్డి ఉన్నారు.