breaking news
S. Venkatesh Yadav
-
వెంకటేశ్ కుటుంబానికి అండగా నిలుస్తాం : నాగబాబు
సాక్షి,సిటీబ్యూరో: రాజకీయాలకతీతంగా చిరంజీవి అభిమానులు ఏకంగా ఉండాలని సినీనటుడు కె.నాగబాబు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా పాలెంలో జరిగిన వోల్వో బస్సు దుర్ఘటనలో మృతిచెందిన అఖిలభారత చిరంజీవి ఫ్యాన్స్‌వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.వెంకటేశ్‌యాదవ్ సంస్మరణసభ శుక్రవారం రవీంద్రభారతిలో జరిగింది. నాగబాబు ప్రసంగిస్తూ ఇబ్బందుల్లో ఉన్న చిరంజీవి అభిమానుల కుటుంబాలకు తాము అండగా ఉంటామన్నారు. వెంకటేశ్‌యాదవ్ పిల్లలు జీవితంలో స్థిరపడే వరకు చేదోడువాదోడుగా నిలుస్తామని హామీఇచ్చారు. చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ మాట్లాడుతూ వెంకటేశ్‌యాదవ్ మృతి అభిమాన సంఘానికి తీరనిలోటన్నారు. సినీ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ చిరంజీవి అభిమాని చనిపోతే ఇంత స్పందన వస్తుందని అనుకోలేదని చెప్పారు. ఈసందర్భంగా మృతుల కుటుంబీకులకు రాష్ట్ర చిరంజీవి యువత ఆధ్వర్యంలో రూ.6లక్షల డీడీని, ఇతరులకు మరో రూ.3 లక్షలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్, రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షుడు ఆర్.స్వామినాయుడు, తమిళనాడు రాష్ట్ర చిరంజీవి యువసేన అధ్యక్షుడు కె.నాగేష్, తెలంగాణ అధ్యక్షుడు కె.ప్రభాకర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
అభిమాని సంతాప సభకు మెగా హీరోలు
వోల్వో బస్సు ప్రమాదంలో మరణించిన కర్నాటక మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు ఎస్ వెంకటేశ్ యాదవ్ సంతాప సభ బెంగళూరులోని రవీంద్ర భారతిలో డిసెంబర్ 6 తేదిన మధ్యాహ్నం 12.45 నిమిషాలకు నిర్వహించనున్నారు. తన చెల్లెలు పెళ్లి సందర్భంగా శుభలేఖలు ఇవ్వడానికి బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వస్తున్న ఎస్ వెంకటేశ్ వోల్వో బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన సంగతి తెలిసిందే. అకాల మరణం చెందిన వెంకటేశ్ కుటుంబానికి ఇటీవల మెగా హీరోలు ఆర్ధిక సహాయం అందించారు. వెంకటేశ్ సంతాప సభకు మెగా హీరోలు హాజరవుతున్నారని సోషల్ మీడియా వెబ్ సైట్ ఫేస్ బుక్ ద్వారా తెలిపారు.