breaking news
S. ravi
-
‘ఎలైట్ ప్యానెల్’లో రవి
* శంషుద్దీన్ ఎమర్జింగ్ ప్యానెల్‌కు * అంపైర్లను ఎంపిక చేసిన ఐసీసీ న్యూఢిల్లీ: రాబోయే సీజన్‌కు ఐసీసీ అంపైర్లను ఎంపిక చేసింది. అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉన్న ఎస్.రవి.. ‘ఎలైట్ ప్యానెల్’లో స్థానాన్ని నిలబెట్టుకోగా, శంషుద్దీన్‌ను ‘ఎమర్జింగ్ ప్యానెల్’కు తీసుకుంది. 2011లో అంపైర్‌గా బాధ్యతలు చేపట్టిన రవి.. ఇప్పటి వరకు 11 టెస్టులు, 26 వన్డేలు, 18 టి20 మ్యాచ్‌ల్లో అంపైరింగ్ చేశారు. మరోవైపు 46 ఏళ్ల శంషుద్దీన్‌కు మరింత ప్రోత్సాహిన్నిస్తూ వన్డే ఎమర్జింగ్ ప్యానెల్‌కు ఎంపిక చేసింది. ఇప్పటికే ఆయన ఏడు వన్డేలు, 10 టి20 మ్యాచ్‌లతో పాటు అండర్-19 ప్రపంచకప్‌లో అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. -
విభజనపై అమికస్ క్యూరీగా రవి
విచారణ సోమవారానికి వాయిదా సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియను వ్యతిరేకిస్తూ, రాష్ట్రపతి పాలనకు ఉద్దేశించిన అధికరణ 356ను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందంటూ దాఖలైన వ్యాజ్యంపై కోర్టుకు సహకరించేందుకు వీలుగా సీనియర్ న్యాయవాది ఎస్.రవిని అమికస్ క్యూరీ (కోర్టు ఆదేశం మేరకు అభిప్రాయం వివరించే న్యాయనిపుణుడు, కోర్టుకు సలహాదారు)గా హైకోర్టు నియమించింది. ఈ మొత్తం వ్యవహారంలో తమకు సహకరించాలని రవిని హైకోర్టు కోరింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కేసును తదుపరి విచారణ నిమిత్తం సోమవారానికి వాయిదా వేసింది. ప్రజల అభిప్రాయాలను తీసుకోకుండా, రాజకీయ పార్టీలు చేసిన తీర్మానాలు, ఇచ్చిన లేఖల ఆధారంగా రాష్ట్ర విభజన చేయడం తగదంటూ హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది జేపీ రావు ఇటీవల హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని మంగళవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. వాదనలు ప్రారంభంకాగానే జేపీ రావు స్పందిస్తూ, విభజనకు వ్యతిరేకంగా తాను ఇటీవల దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ఇదే ధర్మాసనం కొట్టివేసిందని, ఇప్పుడు కూడా అదే అవకాశమున్నందున మరో ధర్మాసనానికి వ్యాజ్యాన్ని నివేదించాలని కోరారు. ఆ అవసరం లేదని, తామే వాదనలు వింటామని జేపీరావుకు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో కోర్టుకు సహకరించాలని సీనియర్ న్యాయవాది ఎస్.రవిని కోరింది. విచారణ సోమవారానికి వాయిదా పడింది.