breaking news
Russias internal affairs
-
రష్యాలో ఆఫ్రికన్ యువత మృత్యు ఘోష
డర్బన్: విదేశాల్లో భారీ జీతంతో కూడిన ఉద్యోగం.. విలాసవంతమైన జీవితం.. ఇవీ అక్కడి యువతకు చూపిన ఆశలు. కానీ కట్ చేస్తే, చేతిలో తుపాకీ.. కళ్లెదుట మృత్యుఘోష. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆఫ్రికా లోని పేద యువతను ఎలా బలిపీఠం ఎక్కిస్తోందో చాటిచెప్పే హృదయవిదారక ఘటనలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. రష్యా తరఫున ఉక్రెయిన్ సరిహద్దుల్లో యుద్ధం చేయడానికి పంపిన దక్షిణాఫ్రికా యువకులు చావును తప్పించుకుని స్వదేశానికి చేరుకున్నారు.ఈ భారీ కుంభకోణం వెనుక దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా కుమార్తె, దుదుజైల్ జుమా-సంబుడ్లా ఉన్నట్లు ఆరోపణలు రావడం సంచలనం సృష్టిస్తోంది. వీఐపీలకు భద్రతా సిబ్బందిగా శిక్షణ ఇస్తామని నమ్మించి, ఎంపిక చేసిన యువకులను నేరుగా ఉక్రెయిన్‌లోని డాన్బాస్ రణక్షేత్రానికి తరలించారు. ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో దుదుజైల్ తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయగా, ప్రస్తుతం ఆమెపై పోలీసు విచారణ కొనసాగుతోంది.స్వదేశానికి చేరుకున్న సిపో ద్లామిని అనే బాధితుడు తన చేదు అనుభవాలను పంచుకుంటూ.. ‘మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లగానే మా దుస్తులు, పత్రాలు, కుటుంబ సభ్యుల ఫోటోలతో సహా అన్నింటినీ తగలబెట్టించారు. కనీస శిక్షణ కూడా లేకుండానే తుపాకులు ఇచ్చి, యుద్ధ భూమికి పంపారు. అక్కడ ఆఫ్రికన్ల పరిస్థితి అత్యంత దారుణం. రష్యా సైనికులు మమ్మల్ని జాతి వివక్షతో దూషించేవారు. అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాలకు మమ్మల్ని ఎరగా పంపేవారు’ అని వాపోయాడు. డ్రోన్ దాడుల్లో కొందరు తమ అవయవాలను కోల్పోగా, మరికొందరు ప్రాణాలు విడిచినట్లు బాధితులు వెల్లడించారు.దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా నేరుగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జరిపిన చర్చల ఫలితంగా ఇప్పటివరకు 15 మంది యువకులు స్వదేశానికి చేరుకున్నారు. యుద్ధ భూమిలో ప్రాణాలు పోగొట్టుకున్న తోటి మిత్రుల జ్ఞాపకాలు వెంటాడుతుండగా, మరోవైపు విదేశీ యుద్ధాల్లో పాల్గొనడాన్ని నిషేధించే దక్షిణాఫ్రికా చట్టాల ప్రకారం వీరిపై విచారణ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ‘హాక్స్’ (Hawks) దర్యాప్తు సంస్థ ఈ అక్రమ రవాణాపై విచారణ జరుపుతోంది. నిరుద్యోగుల బలహీనతను ఆసరాగా చేసుకుని, వారిని కిరాయి సైనికులుగా మారుస్తున్న అంతర్జాతీయ ముఠాల ఆగడాలకు ఈ ఘటన ఒక హెచ్చరికగా నిలుస్తోంది.ఇది కూడా చదవండి: కారును 150లో పోనిస్తూ.. యూట్యూబర్ ఆత్మహత్యాయత్నం -
విత్ లవ్ ఫ్రమ్ రష్యా...
ఫ్రాన్స్‌కు పప్పీ కానుక ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో గత వారం దాడులు చేసిన ఉగ్రవాదులను పట్టుకొనే క్రమంలో బుధవారం ప్రాణాలు కోల్పోయిన శునకం డీజిల్ స్థానాన్ని రష్యా కుక్కపిల్ల దోబ్రిన్యా భ ర్తీ చేయనుంది. ఫ్రాన్స్‌కు రెండు నెలల వయసున్న ఆల్ట్సేనియా కుక్కపిల్లను పంపడానికి రష్యా తన సంసిద్ధతను వెల్లడించింది. ఈమేరకు శనివారం రష్యా అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రి ఫ్రాన్స్ మంత్రికి లేఖ రాశారు. ముద్దుముద్దుగా ఉన్న డోబ్రిన్యా పప్పి చిత్రాలు శుక్రవారం https://mvd.ru/news/item/6802710 వెబ్సైట్లో పెట్టింది. అంతేకాకుండా బంతితోఆడుతున్న వీడియోనూ పోస్ట్ చేసింది.


