breaking news
rural development and panchayats
-
సెస్‌లు, సర్‌చార్జీల్లో రాష్ట్రాలకు వాటా కుదరదు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర పన్నుల వాటా పంపిణీలో పనితీరు బాగా ఉన్న రాష్ట్రాలకు అన్యా యం జరుగుతోందనే ఆరోపణలను 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగరియా తోసిపుచ్చా రు. పంపిణీ చేయదగిన కేంద్ర నిధుల నుంచి రాష్ట్రాలకు 41 శాతాన్ని పంపిణీ చేయాలని 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిందని, చట్టరీత్యా తప్పనిసరిగా కేంద్రం పంపిణీ చేయాల్సిందేనని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నికర పన్నుల ఆదా యంలో సెస్‌లు, సర్‌చార్జీలు సైతం కలిసి ఉంటాయని, వీటిని రాష్ట్రాలకు పంపిణీ చేయడం కుదరదన్నారు. సెస్‌లు, సర్‌చార్జీలను సైతం లెక్కించి కేంద్రం రాష్ట్రాలకు 31 లేదా 32 శాతం నిధులు మాత్రమే ఇస్తోందని రాష్ట్రాలు అంటున్నాయని తెలిపారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా మంగళవారం ప్రజాభవన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడా రు. కేంద్రం వసూలు చేసే సెస్‌లు, సర్‌చార్జీల్లో సైతం రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని సిఫారసు చేస్తారా? అని జర్నలిస్టులు ప్రశ్నించగా, ఈ అంశం ఆర్థిక సంఘం పరిధిలోకి రాదంటూనే.. సెస్‌లు, సర్‌చార్జీలను వసూలు చేసి 100 శాతం తీసుకునే అధికారం కేంద్రానికి రాజ్యాంగం కల్పించిందని చెప్పారు. ఆ విధంగా రాష్ట్రాలకు వాటా ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందన్నారు. తెలంగాణ పట్టణాభివృద్ధి ప్రణాళికలు భేష్దేశంలో గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యతని స్తుండడంతో పట్టణాభివృద్ధి నిర్లక్ష్యానికి గురవు తోందని, తెలంగాణ ఈ విషయంలో చాలా ముందుచూపుతో వెళ్తోందని అరవింద్ పనగరి యా ప్రశంసించారు. పట్టణాభివృద్ధికి రాష్ట్ర ప్రభు త్వం వేసిన ప్రణాళికలు ఒక ఆర్థికవేత్తగా తనను ఆకట్టుకున్నాయన్నారు. ఆర్థిక ప్రణాళికల విష యంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టతతో ఉందని, ప్రభుత్వం వివరించిన రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలు తమను బాగా ఆకట్టుకున్నాయని చెప్పారు. రాష్ట్రానికి భారంగా మారిన రుణాల రీస్ట్రక్చరింగ్ అంశం తమ పరిధిలోకి రాదని వివరించారు.జీఎస్డీపీ ఆధారంగా నిధుల పంపిణీని రాష్ట్రం కోరిందిఏ ప్రాతిపదికన కేంద్రం, రాష్ట్రాల మధ్య నిధుల పంపకాలు జరగాలి? ఏ ప్రాతిపదికన రాష్ట్రాల మధ్య నిధుల పంపకాలు జరగాలి? అనే అంశంపై రాష్ట్రం సూచనలు చేసిందని పనగరియా చె ప్పారు. జీడీపీకి ఒక్కో రాష్ట్రం అందిస్తున్న చేయూ త, ఆయా రాష్ట్రాల స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీ పీ)ని ప్రామాణికంగా తీసుకుని 28 రాష్ట్రాల మధ్య సమానంగా (హారిజాంటల్గా) నిధుల పంపిణీ విషయంలో నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసిందని వెల్లడించారు. ఇప్పటివరకు తాము 6 రాష్ట్రాల్లో పర్యటించగా, కర్ణాటక, తెలంగాణ ఈ తరహా డిమాండ్ చేశాయని తెలిపారు. రాష్ట్రం చేసిన విజ్ఞప్తులను పరిశీలిస్తామని చెప్పారు. తాము ఇంకా 20కి పైగా రాష్ట్రాల్లో పర్యటించాల్సి ఉందని తెలిపారు.ఏం సిఫారసులు చేస్తామో ఇప్పుడే చెప్పలేం2026–27 నుంచి 2030–31 మధ్య ఐదేళ్ల కా లంలో కేంద్ర పన్నుల ఆదాయం.. కేంద్రం, రాష్ట్రాల మధ్య పంపిణీ, రాష్ట్రాల వాటా నిధు లు మళ్లీ రాష్ట్రాల మధ్య పంపిణీ, కేంద్ర సంఘటిత నిధి నుంచి పంచాయతీలు, మున్సిపా లిటీలకు నిధుల పంపిణీ, విపత్తుల నిర్వహణ కు నిధుల పంపిణీ విషయంలో కేంద్రానికి 16వ ఆర్థిక సంఘం సిఫారసులు చేయనుందని పనగరియా వివరించారు. అయితే ఎ లాంటి సిఫారసులు చేస్తామో ఇప్పుడే వెల్ల డించలేమన్నారు. 15వ ఆర్థిక సంఘం సిఫా రసులనే కేంద్రం సరిగ్గా అమలు చేయడం లేదని విమర్శలున్న నేపథ్యంలో, 16వ ఆర్థిక సంఘం సిఫారసులకు ఏం విలువ ఉంటుందని జర్నలిస్టులు ప్రశ్నించగా.. కేంద్రం, రా ష్ట్రాల మధ్య నిధుల పంపిణీ, స్థానిక సంస్థ లు, విపత్తుల నివారణకు నిధుల పంపిణీ విషయంలో తమ సిఫారసులను కేంద్రం తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుందన్నారు. ఇతర సిఫారసుల అమలు కేంద్రంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. 16వ ఆర్థిక సంఘం సభ్యులు అజయ్ నారాయణ్ ఝా, జార్జి మాథివ్, మనోజ్ పాండ, సౌమ్య కంటి ఘోష్ సమావేశంలో పాల్గొన్నారు. -
గ్రామీణ ప్రాంతాల్లో మ్యుటేషన్ ఫీజు ఖరారు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని గ్రామీణ ప్రాం తాల్లో వ్యవసాయేతర స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం మ్యుటేషన్ ఫీజును ఖరారుచేసింది. ఫీజు కింద సదరు ఆస్తి విలువలో 0.1 శాతం లేదంటే రూ.800 (రెండింటిలో ఏది ఎక్కువైతే అది) వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా మంగళవారం జీవో నంబర్–46 విడుదల చేశారు. దీని ప్రకారం రాష్ట్రమంతటా గ్రామ పంచాయతీల పరిధిలోని వ్యవసాయేతర స్థిరాస్తులపై హక్కుల బదిలీ కోసం ఒకేరకమైన ఫీజు వసూలు చేస్తారు. గతంలో గ్రామ పంచాయతీల తీర్మానం మేరకు ఆయా గ్రామాల్లో మ్యుటేషన్ ఫీజు నిర్ధారించే ఆనవాయితీ ఉంది. దీంతో మ్యుటేషన్ ఫీజు ఒక్కో గ్రామంలో ఒక్కోలా ఉండేది. తాజా ఉత్తర్వులతో మ్యుటేషన్ ఫీజు ఖరారు అధికారం గ్రామ పంచాయతీలకు ఉండదు. ధరణి ద్వారా గ్రామాల్లోనూ ఏకరూప రుసుము అమలవుతుంది. క్రయవిక్రయాలు, వారసత్వ హక్కుల బదిలీ, గిఫ్ట్ రిజిస్ట్రేషన్ల వంటి లావాదేవీలకు ఇది వర్తి స్తుంది. ఈ మేరకు పంచాయతీరాజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. -
ఖాళీలు బోలెడు..భర్తీ బెత్తెడు!
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : మాటలు ఓరకం.. చేతలు మరో విధం.. ప్రభుత్వం వ్యవహార సరళి సర్వదా సమస్యాత్మకం.. పొంతనలేని ఈ వ్యవహారం వల్లే గ్రామీణాభివృద్ధి కుంటుపడుతోందన్నది విస్పష్టం. ఓవైపు గ్రామీణాభివృద్ధి శాఖల్లో సిబ్బంది లేక పనులు కుంటుపడుతూ ఉంటే, మరోవైపున ఖాళీల భర్తీలు కుంటుపడుతున్నాయి. దాంతో అటు నిరుద్యోగులు ఉసూరంటున్నారు.. ఇటు ప్రజలూ ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పూర్తిగా పోస్టులను భర్తీ చేయాల్సిన ప్రభుత్వం మళ్లీ అరకొరగానే నియామకాలు చేపడుతూ ఉండడమే విచి త్రం. వందల సంఖ్యలో ఖాళీలు ఉంటే ప దుల సంఖ్యలో పోస్టులను నింపడానికి సి ద్ధమైంది. పంచాయతీ కార్యదర్శుల పోస్టు ల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీపీఎస్సీ ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది. అయితే జిల్లాలో 920 గ్రామ పంచాయతీలు ఉన్నా యి. ఇందులో 660 పంచాయతీలకు కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఒక్కో కార్యదర్శికి అయిదారు పంచాయతీల బాధ్యతలను అప్పగించారు. దీంతో సిబ్బంది తీవ్ర పని ఒత్తిడితో అవస్థలు పడుతున్నారు. ఇటువంటి తరుణంలో పూర్తి స్థాయిలో నియామక ప్రక్రియను చేపట్టకుండా కేవలం 155 పోస్టులను మాత్రమే భర్తీ చేయాలని నిర్ణయించారు. క్లస్టర్స్‌కు ముందు కార్యదర్శులను నియమించి వారికి మూడు, నాలుగు పంచాయతీల బాధ్యతలను అప్పగించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇంకా 505 కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉండిపోనున్నాయి. పోస్టుల భర్తీ తర్వాత కూడా గ్రామ పంచాయతీల పరిస్థితిలో పెద్దగా మార్పు వచ్చే అవకాశం లేదు. పూర్తి స్థాయిలో పోస్టులను భర్తీ చేస్తే సిబ్బంది కొరత తీరడంతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.